For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్ గా క్యారెట్ జ్యూస్ త్రాగితే ఏం జరగుతుంది..?

|

సహజంగా చాలా మందికి క్యారెట్స్ తినడం అంటే చాలా ఇష్టం . అదే విధంగా కొంత మంది ఇష్టముండుదు. ఇక క్యారెట్ కలర్, మరియు టేస్ట్ కు పిల్లలు ఇష్టంగా తినేస్తుంటారు. కొంత మందికి పచ్చిక్యారెట్స్ తినడం చిన్నప్పటి నుండే బాగా అలవాటు పడి ఉంటారు. క్యారెట్ కంటే క్యారెట్ జ్యూస్ తో దినచర్యను ప్రారంభించినట్లైతే బాడీ ఫంక్షన్స్ చాలా గ్రేట్ గా పనిచేస్తాయి.

క్యారెట్ లో కొన్ని హీలింగ్ ప్రొపర్టీస్ ఉన్నాయి. అంతే కాదు ఈ గుణాలతో పాటు విటమిన్ ఎ, సి, బి1, బి6, కె, ఇ, డి లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇంకా క్యారెట్ లో ఫైటో న్యూట్రీయంట్స్ గా పిలవబడే లైకోపిన్, ల్యూటిన్, క్సాథోఫిల్ మరియు జియాక్సిథిన్ వంటివి కూడా ఉన్నాయి. వీటన్ని మూలంగా జబ్బులను నయం చేసే గుణాలు మెండుగా ఉన్నాయి.

ఇక మినిరల్స్ విషయంలో సోడియం, ఫాస్పరస్, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, మరియు బయోటిన్ లు కూడా అధికంగా ఉన్నాయి. మీ శరీరానికి పొటాషియం అవసరం అయినప్పుడు క్యారెట్ ను ఎంపిక చేసుకోవచ్చు.

ముఖ్యంగా క్యారెట్ లో కెరోటిన్ అనే యాంటీఆక్సిడెంట్ కలిగి ఉండటం వల్ల మీ జీవక్రియలను నయం చేస్తుంది . క్యారెట్ జ్యూస్ ను ప్రతి రోజూ త్రాగడం వల్ల అనేక వ్యాధులను నివారించుకోవచ్చు.

సూచన: డయాబెటిస్ ఉన్న వారు క్యారెట్ జ్యూస్ త్రాగకూడదు. డాక్టర్ ను సంప్రదించి తీసుకోవాలి. మరి రెగ్యులర్ గా క్యారెట్ జ్యూస్ త్రాగడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

రక్తంలో ఎసిడిటిని తగ్గించేస్తుంది:

రక్తంలో ఎసిడిటిని తగ్గించేస్తుంది:

క్యారెట్ జ్యూస్ లో ఉండే ఆల్కలైన్ నేచర్ జీవక్రియలో ఎసిడిటిని న్యూట్రలైజ్ చేస్తుంది.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

క్యారెట్ జ్యూస్ ను రెగ్యులర్ గా త్రాగడం వల్ల కొన్ని రకాల కంటి సమస్యలను నివారించుకోవచ్చు. లూటిన్ మరియు బీటా కెరోటిన్ వంటివి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

మలబద్దకం నివారిస్తుంది:

మలబద్దకం నివారిస్తుంది:

కొద్దిగా ఆకుకూరలు మిక్స్ చేసిన తయారుచేసిన క్యారెట్ జ్యూస్ ను రెగ్యులర్ గా త్రాగడం వల్ల మలబద్దకం నివారించుకోవచ్చు.

శ్వాస సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు:

శ్వాస సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు:

క్యారెట్ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల శ్వాస సమస్యలను తగ్గించుకోవచ్చు.

యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు:

యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు:

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా త్రాగడం వల్ల ఆర్ధరైటిస్ మరియు ఇతర ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ ను నివారించుకోవచ్చు.

స్టోక్ నివారించుకోవచ్చు:

స్టోక్ నివారించుకోవచ్చు:

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా త్రాగడం వల్ల రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించి, స్ట్రోక్ మరియు హార్ట్ అటాక్ వంటివి సమస్యలను నివారిస్తుంది.

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

రోజూ పచ్చి క్యారెట్స్ తినడం వల్ల క్యాన్సర్ ను నివారించుకోవచ్చని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైనది.

కిడ్నీలు శుభ్రపడుతాయి:

కిడ్నీలు శుభ్రపడుతాయి:

ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్ త్రాగడం వల్ల కిడ్నీల మీద ఎక్కువ పనిభారం పడకుండా చేస్తుంది. జీవక్రియలను నేచురల్ గా శుభ్రపరుస్తుంది.

అనీమియా నివారిస్తుంది:

అనీమియా నివారిస్తుంది:

క్యారెట్ జ్యూస్ రక్తం ఉత్పత్తికి సహాయపడుతుంది . దాంతో అనీమియాను నివారించుకోవచ్చు.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

క్యారెట్ లో పెక్టిన్ అనే కంటెంట్ రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

స్మోకర్స్ కు చాలా మంచిది:

స్మోకర్స్ కు చాలా మంచిది:

క్యారెట్ జ్యూస్ త్రాగడం వల్ల ముఖ్యంగా చైన్ స్మోకర్స్ కు ఈ అలవాటు మానుకొనేలా చేస్తుంది. ఇది జీవిత కాలాన్ని కూడా పెంచుతుంది . అంత వరకూ తెచ్చుకోకుండా స్మోకింగ్ మానుకోవడం మంచిది.

English summary

What Happens When You Drink Carrot Juice

During your childhood, when your parents forced you to eat a raw carrot, you might have developed an aversion towards it. But, starting your day with some vegetable juice is a great way to allow your body to function well.
Desktop Bottom Promotion