For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పరగడుపున టమోటో జ్యూస్+బాదం మిల్క్ తాగడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు

|

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఐశ్వర్యం పొందినట్లే. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్న సంపదను ఖర్చుచేసుకోవడం కంటే, ఆరోగ్యంగా జీవిచండం వల్ల మరింత సంపదను పొదుపు చేసుకోవచ్చు. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ,డాక్టర్ కోసం జోబులు కాలీ చేసుకోవడం కంటే ఇంట్లో ఉండే కొన్ని పవర్ ఫుల్ నేచురల్ హెల్త్ డ్రింక్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, పొదుపుకు పొదుపు.

మన ఇంట్లోనే అందుబాటులో ఉండే నేచురల్ హోం రెమెడీస్ మనకు తెలియకుండానే మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంటాయి . అంతే కాదు ఈ నేచురల్ రెమెడీస్ ను ఇంగ్లీష్ మందులకు ప్రత్యామ్నాయంగా నేచురల్ రెమెడీస్ ను ఎంపిక చేసుకోవడం వల్ల ఇవి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి, ఇంకా సురక్షితమైనవి కూడా..ఈ విషయాన్ని పలు పరిశోధనలు కూడా మద్దతు పలుకుతున్నాయి.

అనారోగ్యానికి గురైనప్పుడు వెంటనే డాక్టర్లు, హాస్పిటల్స్ అని పరుగెత్తకుండా...మీకు దగ్గరలో ఉండే కిచెన్ లో అడుగు పెట్టి చూడండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎన్నో ఔషధాలు అక్కడో దొరుకుతాయి. మన శరీరంలో ఇమ్యూనిటిలో కోల్పోవడం వల్లే అనారోగ్యపాలవుతుంటాము. అలా జరగకుండా ఇమ్యూనిటి పవర్ పంెచుకోవడానికి హెర్బల్ హెల్త్ డ్రింక్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. అటువంటి వాటిలో టమోటో , బాదం జ్యూస్ ఒకటి. ఈ రెండింటి కాంబినేషన్ డ్రింక్ లో అద్భుతమైన ప్రయోజనాలెన్నో ఉన్నాయి .

కేవలం మూడు టేబుల్స్ స్పూన్ల టమోటో జ్యూస్ కు రెండు టేబుల్ స్పూన్ల బాదం మిల్క్ జోడించి గ్రైండ్ చేయాలి. ఈ జ్యూస్ ను ఒక గ్లాసులోకి తీసుకుని తాగాలి. రోజుకు ఒక్కసారైనా ఈ డ్రింక్ తాగితే మీరు ఊహించని విధంగా ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. టమోటో జ్యూస్ బాదం మిల్క్ లో ఉండే అమేజింగ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..

బరువు తగ్గించుకోవచ్చు:

బరువు తగ్గించుకోవచ్చు:

బరువు తగ్గడానికి ఈ నేచురల్ హెల్త్ డ్రింక్ బెస్ట్ సొల్యూషన్ అని చెప్పవచ్చు . ఈ హెల్తీ డ్రింక్ ను కాలీ పొట్టతో ఉదయాన్నే తీసుకోవడం వల్ల మెటబాలిక్ రేటు పెరుగుతుంది. బరువు కంట్రోల్ అవుతుంది.

కంటి చూపును మెరుగుపరుస్తుంది:

కంటి చూపును మెరుగుపరుస్తుంది:

ఈ హోం మేడ్ హెల్త్ డ్రింక్ కంటి నరాలకు బలోపేతం చేస్తుంది, దాంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది, కళ్ళు డ్రైనెస్ తగ్గుతుంది. ఇన్ఫెక్షన్స్ నివారించబడుతాయి.

మలబద్దక సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది:

మలబద్దక సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది:

టమోటో జ్యూస్, బాదం మిల్క్ కాంబినేషన్ డ్రింక్ ప్రతి రోజూ ఉదయం తాగడం వల్ల ప్రేగులను శుభ్రం చేస్తుంద. ప్రేగుల్లోని వ్యర్థాలను, జీర్ణమవ్వని ఆహారాలను సులభంగా తొలగించి, మలబద్దక సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ప్రెగ్నెన్సీకి మంచిది:

ప్రెగ్నెన్సీకి మంచిది:

ఈ కాంబినేషన్ డ్రింక్ లో విటమిన్స్ మరియు ఫోలిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఈ హెల్తీ డ్రింక్ గర్భిణీలకు కూడా మంచిదే.

 డిప్రెషన్ తగ్గిస్తుంది:

డిప్రెషన్ తగ్గిస్తుంది:

బాదం మిల్క్ లో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మెదడులోని డిప్రెషన్ ను బీట్ చేసే సెరోటిన్ అనే హార్మోన్స్ ను ఉత్పత్తి చేయడం వల్ల డిప్రెషన్ తగ్గించుకోవచ్చు.

హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

ఈ హెర్బల్ హెల్త్ డ్రింక్ హార్ట్ కు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ధమనుల్లో కొలెస్ట్రాల్ చేరకుండా నివారిస్తుంది. కార్డియో వ్యాస్కులర్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

బాడీ డిటాక్సిఫై చేస్తుంది:

బాడీ డిటాక్సిఫై చేస్తుంది:

ఈ హెర్బల్ డిటాక్స్ డ్రింక్ వల్ల శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్స్ ను తొలగించి, శరీరంను ఆరోగ్యంగా ఉంచతుంది.

బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి:

బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి:

ఈ రెండింటి కాంబినేషన్ హెల్త్ డ్రింక్ వల్ల క్యాల్షియంను గ్రేట్ గా గ్రహిస్తుంది. దాంతో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. స్ట్రాంగ్ గా మారుతాయి.

English summary

What Happens When You Drink Tomato Juice With Almond Milk?

Did you know that almond milk and tomato juice also come with exceptional health benefits? Just grind 3 tablespoons of tomato juice and 2 tablespoons of almond milk in a blender, collect the juice in a cup, and the health drink is ready for consumption.
Desktop Bottom Promotion