ఒక్క గ్లాసు కొత్తిమీర జ్యూస్ తాగి, శరీరంలో జరిగే అద్భుత మార్పులు గమనించండి.!!

Posted By:
Subscribe to Boldsky

కొత్తిమీరను సీలాంట్రో లేదా ధనియా అని వివిధ రకాలుగా పల్చుకుంటారు. ఇది ఒక అద్భుతమైన హెర్బ్ (మూలిక). కూరల్లో కొత్తిమీర లేకపోతే కూరలో ఏదో వెలితి ఏర్పడుతుంది. ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ లో కొత్తిమీరకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే కొత్తిమీరకు ఎందుకింత ప్రత్యేక స్థానం ఉందో ఎవరికీ అంతగా తెలియదు. కానీ సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటుంది. చాలా సున్నితమైన ఆకులు కాండంతో ఉంటుంది. ఇది వంటలకు రుచిని , సువాసనను అందిస్తుంది. అంతే కాదు కొత్తిమీరలో ఆరోగ్యం దాగుందని నిపుణులంటున్నారు.

కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి,భాస్వరం,కాల్షియం,ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, మొక్క నుంచి తీసిన ద్రవ యాసిడ్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు ఉంటాయి. వీటన్నింటికి ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలను అంధించే గుణాలు ఉంటాయి. కొత్తిమీరను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆహారంలో కొత్తిమీర రుచి మరియు వాసనతో పాటు అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. అది తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Add A Glass of Coriander Juice To Your Daily Diet & See What Happens

కొత్తిమీరను జ్యూస్ రూపంలో తయారుచేసి తీసుకుంటే మరిన్ని అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక కట్ట కొత్తిమీర తీసుకుని, క్లీన్ చేసి, వాటర్ లో శుభ్రంగా కడగాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేయాలి. తర్వాత అందులో ఒక గ్లాసు మంచినీళ్లు పోయాలి.

అదనంగా కొద్దిగా ధనియాలు కూడా వేయాలి. ధనియాల్లో మరిన్ని ప్రయోజనాలున్నాయి. తెలుసుకోవాలంటే ఒక్కడ క్లిక్ చేయండి.

ఈ మిశ్రమాన్ని 10 నిముషాలు ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి. గోరువెచ్చగా చల్లారిన తర్వాత అందులో చిటికెడు నిమ్మరసంను కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం..

డెర్మటాలజికల్ బెనిఫిట్స్ :

డెర్మటాలజికల్ బెనిఫిట్స్ :

కొత్తిమీరలో చర్మానికి సంబంధించిన అనేక ప్రయోజనాలున్నాయి. ఇది అనేక చర్మ సమస్యలను నివారిస్తుంది. ముక్యంగా ఎగ్జిమా, స్కిన్ డ్రైనెస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేక మైనర్ అండ్ మేజర్ డెర్మటాలజికల్ సమస్యలను నివారిస్తుంది.

కార్డియో వాస్క్యులర్ బెనిఫిట్స్ :

కార్డియో వాస్క్యులర్ బెనిఫిట్స్ :

కొత్తిమీర జ్యూస్ లో ఎసెన్షియల్ ఆయిల్ 6 రకాలు ఉంటాయి. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ ఎల్ డిఎల్ లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఇది హార్ట్ కు సంబంధించిన సమస్యలను నివారించి, హార్ట్ ను హెల్తీగా ఉంచుతుంది

అనీమియా :

అనీమియా :

అనీమియా నివారించడంలో కొత్తమీర లేదా ధనియాల గొప్పగా సహాయపడుతాయి. అందులో ఉండే ఐరన్ కంటెంట్ హీమోగ్లోబిన్ పెంచుతుంది. ఇది ఆక్సిజెన్ ప్రసరణను మెరుగుపర్చడంలో పూర్తి బాధ్యత తీసుకుంటుంది. దాంతో అనీమియాను నివారిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

కొత్తిమీరలో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాసియం వంటి వివిధ రకాల మినిరల్స్ అధికంగా ఉన్నాయి. సోడియం తక్కువగా ఉంటుంది. హై పొటాషియం ..లోసోడియం వల్ల బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.

యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి:

యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి:

కొత్తీమీరలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది ఇతర మోలిక్యులస్ వల్ల ఆక్సిడైజ్డ్ గా అనేక వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. ముఖ్యంగా మతిమరుపు వంటి సమస్యలను నివారిస్తుంది.

గ్యాస్ట్రో ఇన్టెన్సినల్ బెనిఫిట్స్ :

గ్యాస్ట్రో ఇన్టెన్సినల్ బెనిఫిట్స్ :

కొత్తిమీర జ్యూస్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అందుకు అవసరమయ్యే ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. దాంతో అజీర్తి, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది.

ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి:

ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి:

కొత్తిమీర జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల అందులో ఉండే క్యాల్షియం కంటెంట్ ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. బోన్ రీగ్రోత్ అవుతుంది. ఓస్టిరియోపోసిస్ వంటి బోన్స్ వ్యాధులను నివారిస్తుంది.

ఓరల్ హెల్త్:

ఓరల్ హెల్త్:

కొత్తిమీర జ్యూస్ లో ఉండే యాంటీ సెప్టిక్ లక్షణాలు మౌత్ అల్సర్ నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల లక్షణాలు నోటిని శుభ్రంగా ఉంచుతుంది. వాస్తవానికి బ్యాడ్ బ్రీత్ నివారించడంలో ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

బరువు తగ్గిస్తుంది.

బరువు తగ్గిస్తుంది.

ప్రతి రోజూ ఉదయం పరగడపున కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. దాంతో బరువు తగ్గిస్తుంది.

హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది:

హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది:

కొత్తిమీర లో ఉండే ఎసెన్సియల్ ఆయిల్స్ హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. దాంతో రుతక్రమ సంబంధ సమస్యలను దూరం చేస్తుంది.

English summary

Add A Glass of Coriander Juice To Your Daily Diet & See What Happens

Add A Glass of Coriander Juice To Your Daily Diet & See What Happens ,Coriander is a powerhouse of nutrients. Listed in this article are a few of the best health benefits of coriander juice.
Story first published: Friday, May 5, 2017, 20:35 [IST]
Subscribe Newsletter