రోజుకు 5 వాల్ నట్స్ తింటే బాడీలో జరిగే అద్భుత మార్పులు..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

డ్రైనట్స్ లో వివిధ రకాలున్నాయి. జీడిపప్పు, బాదం, వాల్ నట్స్, పీనట్స్, మరియు పిస్తా ఇవన్నీ ఆరోగ్యానికి బహు ప్రయోజనాలను అందిస్తాయి. అయితే వీటన్నింటిలోకి టాప్ వన్ గా ఉండే వాల్ నట్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. వాల్ నట్స్ ను రోజుకు 5 తింటే చాలు శరీంరలో అద్భుత మార్పులు జరుగుతాయి.

వాల్ నట్స్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మంచి ఫ్యాట్స్ మరియు ఓమేగా 2 ఫ్యాటీ యాసిడ్స్ , ఫైబర్ , మరియు ఇతర న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్, క్యాల్సియం, పొటాషియం, సోడియం వంటి న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అన్ని రకాల డ్రైడ్ ఫుట్స్ లో కంటే వాల్ నట్స్ బెస్ట్ గా సూచిస్తుంటారు.

health benefits of walnuts

వీటితో పాటు, వాల్ నట్స్ లో యాంటీఆక్సిడెంట్స్, యాంటీఇన్పమేటరీ లక్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని సుగుణాలున్న వాల్ నట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కొన్ని ముఖ్యమైన అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.

వాల్ నట్స్ ను స్నాక్స్ గా తినవచ్చు, లేదా నీళ్లలో నానబెట్టి తినాలి. ఈ రెండు మార్గాల్లో ఎలా తిన్నా శరీరానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ పుష్కలంగా అందుతాయి.

రోజుకు 5 వాల్ నట్స్ తినడం వల్ల, ఆరోగ్య పరంగా ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకుందాం..

1. బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

1. బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆప్షన్ డ్రైడ్ ఫ్రూట్స్, వాల్ నట్స్ లో ఫాలీ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుంది. ఇతర ఆహారాల మీద కోరికలను తగ్గిస్తుంది.

2. బ్రెయిన్ హెల్త్ కు మంచిది:

2. బ్రెయిన్ హెల్త్ కు మంచిది:

వాల్ నట్స్ లో ఫ్యాటీయాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది బ్రెయిన్ ను హెల్తీగా ఉంచుతుంది. దాంతో బ్రెయిన్ కు సంబంధించిన మతిమరుపు వంటి సమస్యలను నివారిస్తుంది.

3. కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

3. కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

వాల్ నట్స్ లో ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మరియు ఎసెన్షియల్ మినిరల్స్ అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

4. హార్ట్ హెల్త్ కు మంచిది:

4. హార్ట్ హెల్త్ కు మంచిది:

వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఎక్కువే, వాల్ నట్స్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతుంది . బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. హెల్తీ హార్ట్ కు వాల్ నట్స్ ఒక మంచి సోర్స్ .

5. బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:

5. బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:

రోజుకు 5 వాల్ నట్స్ తింటే చాలు బ్లడ్ ప్రెజర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. వాల్ నట్స్ లో ఫాలీ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇవి శరీరంలో బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను తగ్గిస్తాయి.

6.డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తాయి:

6.డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తాయి:

వాల్ నట్స్ లో పాలీ అన్ శ్యాచురేటెడ్స్ మరియు మోన్ అన్ శ్యాచురేటుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నాయి, వాల్ నట్స్ ఒక బెస్ట్ న్యూట్రీషియన్ కాబట్టి, ఇది డయాబెటిస్ ను అండర్ కంట్రోల్లో ఉంచుతుంది.

7. బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

7. బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

వాల్ నట్స్ లో ఎసెన్షియల్ ఫ్యాటీయాసిడ్స్ లేదా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి క్యాల్షియంను ఎక్కువగా గ్రహిస్తాయి, బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

8.బాడీ మెటబాలిజంను మెరుగుపరుస్తుంది:

8.బాడీ మెటబాలిజంను మెరుగుపరుస్తుంది:

వాల్ నట్స్ లో మినిరల్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల బాడీ మెటబాలిజంను మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది

English summary

Eat Just 5 Walnuts A Day And See These Quick Amazing Results

Walnuts can be eaten just like snacks in the dried form or it can be soaked in water and then consumed. Both ways the essential nutrients of walnuts will be intact. Listed here are a few of the major health benefits of eating five walnuts a day.
Story first published: Saturday, March 25, 2017, 19:00 [IST]
Subscribe Newsletter