బాదంలను మీ బ్రేక్ ఫాస్ట్ లో కలుపుకోవడం వలన మీరు ఎక్కువకాలం జీవించగలుగుతారు!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మనందరికీ బాగా తెలిసిన ప్రసిద్ధ కోట్ ఒకటి వుంది, "ఆరోగ్యం కలిగినవాడు, ఆశను కలిగి ఉంటాడు మరియు ఆశ ఉన్నవాడు ప్రతిదీ కలిగి ఉంటాడు".

పైన చెప్పిన కోట్ అక్షరాలా నిజం ఎందుకంటే ఆరోగ్యం మరియు ఆశ ఒక నాణ్యమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన రెండు అతి ముఖ్యమైన అంశాలు.

మంచి ఆరోగ్యాన్ని మరియు జీవిత పట్ల సానుకూల వైఖరిని కలిగివున్నవారు, ఎవ్వరైనా ఎక్కువ కాలం నివసించగలుగుతారు.

Eating Almonds In The Morning

ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి, చిన్న పురుగుల నుండి అత్యంత అధునాతన మానవ జాతులకు వరకు, కాలం గడుస్తున్నంత కాలం జీవించి ఉండాలని మరియు జీవిస్తూ పోరాడాలని కోరుకుంటారు.

కాబట్టి, దీర్ఘాయువు, లేదా ఎక్కువ కాలం, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం అనే అవకాశం నిజంగా అన్ని జీవులకు ఒక గొప్ప బహుమతి.

చాలా పెద్ద వ్యాధులు లేని ఉచితమైన జీవితాన్ని గడపడానికి, ఆరోగ్య సంరక్షణను తీసుకోవడానికి ఒక నిజమైన ప్రయత్నం చేయాలి.

ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం మంచిగా లేకపోతే అతను/ఆమె అనేక రకాల వ్యాధులు మరియు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంటుంది, ఇది వారి జీవితకాలాన్నితగ్గించగలదు.

Eating Almonds In The Morning

వాస్తవానికి, ఒక వ్యక్తి ఎక్కువకాలం జీవించినప్పటికీ, ఒకవేళ వారు వ్యాధులతో బాధపడుతున్నట్లైతే అతడు / ఆమెను చాలా కష్టాలు మరియు నొప్పిని పొందవచ్చు!

సో, ఆరోగ్యంగా ఉండటానికి మరియు సుదీర్ఘ జీవితాన్ని ఆస్వాదించడానికి, కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అనుసరించాలి.

సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం, ధ్యానం, కాలుష్యం నుండి దూరంగా ఉండటం, ధూమపానం వంటి అనారోగ్యకరమైన దుర్గుణాలు, ఔషధాలు మరియు ఆల్కహాల్ ని సేవించకుండా ఉండటం వంటివి - ఈ అంశాలన్నిటికీ పాటించడం వలన వ్యాధి లేని జీవితం మరియు దీర్ఘాయువుకు దోహదం చేస్తుంది.

Eating Almonds In The Morning

జీవించి వున్న ప్రతి జీవికి చిన్న చిన్న వ్యాధులు రావడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి, కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు తో కొన్ని ప్రధాన వ్యాధులను కూడా నిరోధించవచ్చు.

ఇప్పుడు, ఇటీవల చేసిన పరిశోధన అధ్యయనం ప్రకారం ప్రతి ఉదయం అల్పాహారం లో బాదంని తీసుకోవడం దీర్ఘాయువు పెంచుతుంది కనుగొనబడింది.

అది ఎలాగో ఈ ఆర్టికల్ ని చదివి తెలుసుకోండి.

అల్పాహారం లో అల్మొన్డ్స్ /బాదాం ని తీసుకోవడం వలన దీర్ఘాయువు ని పొందవచ్చా?

మనకు తెలిసినంతవరకు, బాలన్సుడ్ డైట్ లో అన్ని రకాల కార్బోహైడ్రేట్లు, మినరల్స్ , మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు మొదలైన ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది.

పైన పేర్కొన్న పోషకాలలో ఏ ఒకటి సరైన మొత్తాలలో వినియోగించకపోయినా, అది లోపాలను కలిగిస్తుంది.

Eating Almonds In The Morning

మనందరికీ కూడా బాగా తెలుసు, అల్పాహారం అనేది రోజు అత్యంత ముఖ్యమైన భోజనం మరియు ఒక ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వలన మీ జీవక్రియ రేటు మరియు వ్యాధి నిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, దీని వలన అనేక వ్యాధులను కూడా నివారించవచ్చు.

శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ స్థాయి వల్ల కలిగే హార్ట్ కి సంబంధిత వ్యాధులు ప్రజల్లో మరణానికి దారి తీస్తున్న ప్రధాన కారణాల్లో ఒకటి. అధిక కొలెస్ట్రాల్ వలన కలిగే మరొక ఘోరమైన పరిస్థితి స్ట్రోక్.

ఇప్పుడు, టొరంటో విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక పరిశోధనా అధ్యయనం ప్రతీ ఉదయం బాదం ని బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవడం వలన ఆరోగ్యకరమైన అల్పాహారంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించవచ్చని పేర్కొంది.

Eating Almonds In The Morning

బాదం లో విటమిన్ E మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నందువల్ల మీ శరీరంలో పేరుకున్న కొలెస్ట్రాల్ ను తొలగించడానికి మరియు వాటిని మీ సిస్టమ్ నుండి బయటకు తీసివేయవచ్చు.

అందువల్ల, ప్రతి రోజూ అల్పాహారం లో కనీసం 4-5 బాదం లను తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ ని తగ్గించవచ్చు, అందువలన గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వంటి ఘోరమైన వ్యాధులను నివారించవచ్చు.మీకు ఆరోగ్యకరమైన హార్ట్ ని ఉన్నప్పుడు, మీ జీవిత కాలం గణనీయమైన స్థాయిలో పెరుగుతుంది!

English summary

Eating Almonds In The Morning

Eating Almonds In The Morning,A famous quote goes like this, “He who has health, has hope; and he who has hope, has everything”. The above quote is very much true. Read this!
Story first published: Wednesday, November 8, 2017, 8:00 [IST]
Subscribe Newsletter