Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
బెర్రీస్ లో దాగున్న ఎక్సలెంట్ హెల్త్ బెనిఫిట్స్ , ఖచ్చితంగా మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తాయి..!!
బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
మనం తినే ఆహారాన్ని బట్టి మన శరీర తత్త్వం ఉంటుంది. అందుకే మన ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త పడాలి. తినే ఆహారానికి సరిపడా వ్యాయామం ఉంటే ఎటువంటి రోగాలు దరికి రాకుండా ఉంటాయి. ఆరోగ్యం ఉంటేనే మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఏకకాలంలో అనేక పనులను చేయగల సామర్ధ్యం కలిగింది. ఆధునిక కాలంలో మానవుడు సృష్టించిన కంప్యూటర్ కన్నా మన మెదడు ఎన్నో రెట్లు సామార్తవంత మైనది. దాని పని తీరు కేవలం మనం తినే ఆహారంలోని పోషకాల పై ఆధారపడి ఉంటుంది. అందుకే మనం తినే ఆహారంలో మెదడుకు కావాల్సిన పోషకాలు ఉండేలా ఆహారాన్ని తినాలి. మెదడుకు కావలసిన పోషకాలు పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు బెర్రీస్ అనే ఈ పండ్లుం ముఖ్యమైనవి .

బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. ఫలితంగా వయసు మీరినట్లుగా కనిపించదు. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల చర్మ కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. కాంతులీనే చర్మంతో మెరిసిపోతారు.
వివిధ రంగులున్న కలర్ఫుల్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్, మరియు ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. బెర్రీస్ లో ఉండే ఈ ఫ్లేవనాయిడ్స్ పురుషుల్లో ఎరక్టైల్ డిస్ ఫంక్షన్ (శీఘ్రస్కలనం, ఇతర లైంగిక సమస్యల)ను నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తాయి. అంతే కాదు ఇవి వయాగ్రా కంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . ఇవే కాదు బెర్రీస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే పొందే అమేజింగ్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

బ్రెయిన్ చురుకుగా ఉంచుతుంది:
బెర్రీస్ ను రెగ్యులర్ గా తినడం వల్ల ఇది బ్రెయిన్ లో కాగ్నిటివ్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది. వీటిలో ఉండే ఫ్లెవనాయిడ్స్ , యాంతో సైనైడ్స్ మెమరీని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి, అందుకే బెర్రీస్ బ్రెయిన్ కు మంచిదని చెబుతుంటారు.

డయాబెటిస్ ను మ్యానేజ్ చేస్తుంది:
బెర్రీస్ లో కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి డయాబెటిక్ పేషంట్స్ కు తప్పనిసరిగా అవసరం అవుతాయి. రక్తంలోకి నిధానంగా గ్లూకోజ్ ను రిలీజ్ చేస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. బెర్రీస్ తినడం వల్ల డయాబెటిక్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.

క్యాన్సర్ నివారిణి:
బెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది సెల్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పిస్తుంది. క్యాన్సర్ సెల్స్ డెవలప్ కాకుండా నివారిస్తుంది. ఆశ్చర్యం కలిగించే మార్పులను తీసుకొస్తుంది.

హెల్తీ బోన్స్ :
బెర్రీస్ లో క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ , జింక్ , మెగ్నీషియం, మ్యాంగనీస్ లు అధికంగా ఉన్నాయి. ఇవి బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. బోన్ స్ట్రక్చర్ ను మెయింటైన్ చేస్తుంది.

బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది:
బెర్రీస్ లో బయోయాక్టివ్ కాంపౌండ్స్ , యాంతోసినిన్స్ అధికంగా ఉండటం వల్ల ఇవి హైపర్ టెన్షన్ తగ్గిస్తాయి, బ్లడ్ ప్రెజర్ మరియు హార్ట్ డిసీజ్, స్ట్రోక్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది:
బెర్రీస్ లో డైటరీ ఫైబర్, ఫొల్లెట్, పొటాషియం, విటమిన్ సి మరియు షైటోన్యూట్రీషియంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి కార్డియో వాస్క్యులర్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది:
బెర్రీస్ లో ఉండే ప్రోయాంథోసైనిడిన్స్ యుటిఐ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో , ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటటానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

మతిమరుపును నివారిస్తుంది:
బెర్రీస్ లో యాంథోసైనోసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి బీటా అమిలాయిడ్ ఫ్లాక్ ను రక్తనాళాల్లో నివారిస్తుంది. దాంతో మెమరీ డ్యామేజ్ ,మతిమరుపు వ్యాధులను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications
