సోంపు టీ తాగడం వల్ల శరీరంలో జరిగే అద్భుత మార్పులు తెలుసుకోండి..!!

Posted By:
Subscribe to Boldsky

సోంపు.. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినదే. దీన్ని సాధారణంగా.. మౌత్ ఫ్రెషనర్ గా ఉపయోగిస్తారు. లేదా భోజనం తర్వాత ఆహారం తేలికగా జీర్ణం అవడం కోసం తీసుకుంటారు. ముఖ్యంగా రెస్టారెంట్లలో దీన్ని ఎక్కువగా ఇస్తుంటారు.

అయితే సోంపులో అనేక హెల్త్ బెన్ఫిట్స్ ఉన్నాయి. దీన్ని డైరెక్ట్ గా తినడం ఇష్టంలేని వాళ్లు.. టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. సోంపు టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యం శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. అలసట మాయమవుతుంది.

 Fennel Tea Can Do These To Your Health; Check Them

ఒక టీస్పూన్ సోంపు గింజలు తీసుకుని.. ఒక కప్పు మరుగుతున్న నీటిలో కలపాలి. 10 నిమిసాల తర్వాత.. అందులోని పోషకాలను నీళ్లు గ్రహిస్తాయి. ఈ టీని ప్రతిరోజూ భోజనం తర్వాత అంటే.. రోజుకి రెండుసార్లు తీసుకోవాలి. మరి ఈ సోంపు టీ తాగడం వల్ల పొందే ప్రయోజనాలేంటో చూద్దామా..

మజిల్ స్పామ్ తగ్గిస్తుంది:

మజిల్ స్పామ్ తగ్గిస్తుంది:

సోంపు టీ మడమ నొప్పి, మజిల్ స్పామ్స్ తగ్గిస్తుంది.

అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది:

అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది:

గ్యాస్ట్రో ఇంటెన్సినల్ జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను నివారించడంలో సోంపు గ్రేట్ గా సహాయపడుతుంది. హార్ట్ బర్న్ వంటి సమస్యలను నివారించడంలో సోంపు గ్రేట్ గా సహాయపడుతుంది.

కడుపుబ్బరం మరియు గ్యాస్ నివారిస్తుంది:

కడుపుబ్బరం మరియు గ్యాస్ నివారిస్తుంది:

రెగ్యులర్ గా సోంపు టీ తాగడం వల్ల కడుపుబ్బరం , గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. పెద్దప్రేగులను శుభ్రం చేస్తుంది. దాంతో పొట్ట సమస్యలుండవు.

మహిళల ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది:

మహిళల ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది:

మహిళల్లో ఫీమేల్ రీప్రోడక్టివ్ హార్మోన్ ఈస్ట్రోజెన్ ను మెరుగుపరుస్తుంది.ప్రీమెనుష్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలను నివారిస్తుంది. సెక్స్ డ్రైవ్ పెంచుతుంది. ల్యాక్టింగ్ మదర్స్ కు సహాయపడుతుంది.

ఎసిడిటి తగ్గిస్తుంది:

ఎసిడిటి తగ్గిస్తుంది:

ఫెన్నల్ (సోంపు)ఆయిల్ ఎసిడిటి తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది వార్మ్ నాశనం చేస్తుంది. దాంతో బ్యాక్టీరియా తొలగిపోయి, వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.

డ్యూరియాటిక్ :

డ్యూరియాటిక్ :

సోంపు టీ తాగడం వల్ల శరీరానికి కావల్సిన తేమ అందుతుంది. రీనల్ సిస్టమ్ క్లీన్ అవుతుంది. దాంతో శరీరంలో ఎక్సెస్ వాటర్, టాక్సిన్స్ ను తొలగించుకోవచ్చు. కిడ్నీ స్టోన్స్ నివారిస్తుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుంది:

యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పనిచేస్తుంది:

సోంపు టీలో ఉండే ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేసి ఆర్థ్రైటిస్ మరియు జాయింట్ పెయిన్ నివారిస్తాయి.

 బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తాయి:

బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తాయి:

సోంపుటీలో బ్లడ్ ప్రెజర్ ను తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రోజుకు ఒక కప్పు సోంపు టీ తాగితే డాక్టర్ అవసరం ఉండదు.

బరువు తగ్గిస్తుంది.

బరువు తగ్గిస్తుంది.

సోంపు టీలో ఉండే గుణాలు ఆకలిని తగ్గిస్తుంది. ముఖ్యంగా మెటబాలిజం రేటు పెంచుతుంది. దాంతో ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఎలాంటి ఎఫోర్ట్స్ పెట్టకుండానే బరువు తగ్గించుకునే సులభ చిట్కా.

.ఫ్రెష్ బ్రీత్:

.ఫ్రెష్ బ్రీత్:

సోంపు టీ తాగడం వల్ల శ్వాస ఫ్రెష్ గా ఉంటుంది. బ్యాడ్ బ్రీత్ నివారిస్తుంది.

సోంపు టీ తయారుచేయడానికి ఒక స్పూన్ సోంపు తీసుకుని పొడి చేసుకోవాలి. ఒక గ్లాసు నీళ్లలో ఈ పొడిని మిక్స్ చేసి, బాయిల్ చేయాలి. తర్వాత గోరువెచ్చగా చేసి రోజూ ఉదయం తీసుకోవాలి. దీన్ని ఓవర్ గా ఉడికించకూడదు. ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నవారు సోంపు తినకూడదు. సోంపు టీ కూడా తాగకూడదు.

English summary

Fennel Tea Can Do These To Your Health; Check Them

Fennel Tea Can Do These To Your Health; Check Them,You love it or hate it but you cannot deny the health benefits of fennel tea. Listed in this article are a few of the major health benefits of drinking fennel tea.
Subscribe Newsletter