మీ ఆరోగ్యం పదిలంగా కాపాడతామని కమ్మగా చెప్పే పల్లీ కబుర్లేమిటంటే ...

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

వంటింట్లో తప్పనిసరిగా వుండేవి పల్లీలు అంటే వేరుశెనగలు. వీటినే కొంద‌రు కొన్ని ప్రాంతాల్లో ప‌ల్లీలు అని కూడా అంటారు. ఇంగ్లిష్ లో పీన‌ట్స్ అంటారు. ఇవిలేకుండా పొద్దున్న ఇడ్లీలోకి చట్నీ రాదు. వేపుడు కూరల్లో అందం, రుచి రాదు. బగారా బేంగన్‌లో కమ్మదనం రాదు. సాయంత్రం పిల్లలకు చిక్కీ, కాలక్షేపం అసలే కాదు! ఇవికాక పిల్లలంతా ఇష్టపడే స్నిక్కర్స్‌ వంటి చాకొలెట్లకు ఆ రుచి పల్లీల వల్లనేగా వచ్చింది. విదేశాల్లో పీనట్‌ బటర్‌, బ్రెడ్‌ బెస్ట్‌ కాంబినేషన్‌. రోజుకో గుప్పెడు తింటే చాలు... మీ ఆరోగ్యం పదిలంగా కాపాడతామని కమ్మగా చెప్పే పల్లీ కబుర్లేమిటంటే ...

పల్లీలల్లో పూర్తిగా ప్రోటీన్లు మరియు మినిరల్స్ ఉన్నాయి. క్యాల్షియం, పాస్పరస్, ఐరన్, జింక్, బోరాన్‌ లాంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టపడుతారు. అందుకే వీటిని వివిధ రకాలుగా తీసుకుంటుంటారు. వీటి వల్ల ఆనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రాణాంతక వ్యాధులైన కేన్సర్, గుండె జబ్బులు దరిచేరవట. వేరుశనగలోని ఫైబర్‌, యాంటిఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు శరీర ఆరోగ్యానికి సహకరించి ఆయుష్షును పెంచుతాయట.

10 Amazing Health Benefits Of Groundnuts (Mungfali)

వేరుశెనగను రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల విటమిన్‌ ఇ, పాలీఫెనాల్స్‌ లాంటి యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు వేరుశనగను మించిన ఔషధం లేదు. పల్లీల్లో మోనోశాచురేటెడ్‌ కొవ్వుల కారణంగా వీటిని మోతాదుకు మించకుండా తినడం వల్ల గుండెజబ్బులను ఇరవై శాతం వరకూ తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇందులోని మోనో శాచ్యురేటెడ్‌ కొవ్వు గుండెకు మంచిది. శరీరానికి మేలుచేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ. విటమిన్‌ ఇ, నియాసిన్‌, ప్రోటీన్‌, మాంగనీసు వేరుశెనగల్లో అధికం. అలాగే అమినో యాసిడ్స్ కూడా ఎక్కువ. మ‌న ఆరోగ్యాన్ని కాపాడే శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్‌, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. అయితే ఇవి మ‌న‌కు హాని క‌లిగించ‌వు. ఎందుకంటే ఈ కొవ్వులు మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి. ప‌ల్లీల‌ను తింటే కొవ్వు చేరుతుంద‌ని కొంద‌రు అపోహ‌కు లోన‌వుతారు. కానీ అది నిజం కాదు. ఎవ‌రైనా రోజూ గుప్పెడు ప‌ల్లీల‌ను తింటే చాలు, దాంతో కింద చెప్పిన లాభాలు క‌లుగుతాయి. అవేమిటంటే…

1) ఇది బాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

1) ఇది బాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

వేరుశెనగ పప్పులో అధిక న్యూట్రీషియంట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడంలో ప్రధాన పాత్రపోషిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది.గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వీటిలో ఉండే మోనో అన్ శాచురేటుడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో అధిక బ‌రువు తగ్గుతారు. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

2) స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది-

2) స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది-

రోజూ వేరుశెన‌గ‌ల‌ను తింటూ ఉంటే గాల్ స్టోన్స్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది. 25 శాతం వ‌ర‌కు ఆ రిస్క్ త‌గ్గుతుందని అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

మైదానాల్లో మంచి కొలెస్ట్రాల్గా పిలువబడే HDL అధిక మొత్తంలో ఉంటుంది. వారు కూడా హృదయ ఆరోగ్యకరమైన ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి, ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి మరియు మా ధమనులను శుభ్రంగా ఉంచాలి. అయితే సాల్టెడ్ వెర్షన్ను తప్పించుకోవద్దని నిర్ధారించుకోండి.

3) గాల్ బ్లాడర్ డిసీజ్-

3) గాల్ బ్లాడర్ డిసీజ్-

వేరుశెనగలు మన శరీర ఆరోగ్యం మీద బహుముఖంగా పనిచేస్తుంది. పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. అలాగే పిత్తాశయంలో రాళ్ళు అభివృద్ధి చెందకుండా కాపాడుతుంది.

4) బరువు పెరుగుట నిరోధిస్తుంది-

4) బరువు పెరుగుట నిరోధిస్తుంది-

వేరుశెనగ ప్రోటీన్లో మరియు కెలోరీలు తక్కువగా ఉండటంతో; ఆకలి తక్కువగా చేయడానికి వారు భోజనం ముందు తినవచ్చు. ఆకలి సమయంలో వీటిని తినడం వల్ల ఆకలి తగ్గించి బరువు కంట్రోల్లో ఉంచుతుంది

5) కోలన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది-

5) కోలన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది-

రోజూ కొద్దిగా పల్లీలు తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ త‌గ్గుతుంది. పల్లీలలో ఉండే ఫాలీ ఫినోలిక్, యాంటీ ఆక్సిడెంట్స్ గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్ ను రాకుండా అడ్డుకుంటాయి. కార్సినోజెనిక్ ప‌దార్థాల‌ను శ‌రీరం నుంచి తొలగిస్తాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.

6) ఫెర్టిలిటీ లో సహాయపడుతుంది-

6) ఫెర్టిలిటీ లో సహాయపడుతుంది-

వేరుశెనగల్లో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇది మహిళల్లో గర్భధారణకు సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే ఫొల్లెట్ పిండం యొక్క అభివృద్ధిలో ఫోలేట్ కీలకమైనదిగా చెబుతారు. శరీరంలో తగినంత ఫోలేట్ ఉన్నప్పుడు, గర్భం పొందడం సులభం.

7) బ్లడ్ షుగర్-

7) బ్లడ్ షుగర్-

మధుమేహంతో బాధపడే వారు పరిమితంగా వేరుశెనగలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయాలు క్రమబద్దం చేస్తుంది. పల్లీలలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా శరీరంలో ని రక్తంను అదపు చేస్తుంది. రక్తనాళాల ను రిపేర్ చేయడానికి సహాయపడుతుంది.

8) ఫైట్ డిప్రెషన్-

8) ఫైట్ డిప్రెషన్-

వేరుశెనగలలో ఉండే అమినో యాసిడ్స్ డిప్రెషన్ తగ్గించడానికి సహాయపడుతాయి. మెడదు నాడీకణాలకు సంబంధించిన కెరోటిన్ ఉత్పత్తి చేస్తుంది. దాంతో మెదడు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ప‌ల్లీల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి సెర‌టోనిన్‌ను ఎక్కువగా ఉత్ప‌త్తి చేస్తాయి. దీంతో డిప్రెష‌న్, ఒత్తిడి, ఆందోళ‌న వంటివి త‌గ్గుతాయి.

9)జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది:

9)జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది:

శరీరంలో అన్ని జీవక్రియలను నియంత్రించడానికి అవసరం అయ్యే విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉన్నాయి. వేరుశెనగలో విటమిన్ బి పుష్కలంగా ఉండి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి మరియు జ్ఞాపకశక్తి ని పెంచడానికి సహాయపడుతుంది.

విటమిన్ B2 మరియు నియాసిన్ యొక్క అధిక కంటెంట్ కారణంగా, వయస్సు కారణంగా అభిజ్ఞాత్మక నష్టం నుండి మెదడును నివారించడానికి సహాయపడుతుంది

10) అల్జీమర్స్ వ్యాధిని నిరోధిస్తుంది-

10) అల్జీమర్స్ వ్యాధిని నిరోధిస్తుంది-

విటమిన్ B2 మరియు నియాసిన్ యొక్క అధిక కంటెంట్ కారణంగా, వయస్సు కారణంగా అభిజ్ఞాత్మక నష్టం నుండి మెదడును నివారించడానికి సహాయపడుతుంది

English summary

10 Amazing Health Benefits Of Groundnuts (Mungfali)

10 Amazing Health Benefits Of Groundnuts (Mungfali),Groundnuts are legumes which are full of protein. The oil extracted from groundnuts is also a very popular medium of cooking, as it contains high amounts of healthy fats. Groundnuts have other amazing health benefits. Read on to know more. Here are a few ama
Story first published: Saturday, December 2, 2017, 19:00 [IST]