For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ 3 వాల్ నట్స్ తింటే బాడీలో జరిగే అద్భుతమైన ప్రయోజనాలు.!!

నట్స్ లో బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, ఆప్రికాట్స్, డేట్స్, ఇవన్నీ కూడా డ్రైనట్స్ క్రిందికే వస్తాయి. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. రుచి మాత్రమే కాదు, అద్భుతమైన న్యూట్రీషియన్స్ కూడా ఉంటాయి.

|

నట్స్ లో బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, ఆప్రికాట్స్, డేట్స్, ఇవన్నీ కూడా డ్రైనట్స్ క్రిందికే వస్తాయి. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. రుచి మాత్రమే కాదు, అద్భుతమైన న్యూట్రీషియన్స్ కూడా ఉంటాయి.

వాల్ నట్స్ అంటే కేవలం డ్రై ఫ్రూట్స్ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. అలాగే ఇవి కేవలం మెదడుకి, మెమరీ మెరుగుపరచడానికి మంచిదని కూడా తెలుసు. అయితే వాల్ నట్స్ కేవలం మెదడు ఆరోగ్యానికే కాదు.. వీటిని సరైన విధంగా తీసుకోవడం వల్ల.. అనేకానేక లాభాలు, ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. కేవలం రోజూ మూడు వాల్ నట్స్ తింటే అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు.

లెక్కలేనన్ని ప్రయోజనాలను వాల్ నట్స్ ద్వారా పొందాలి అనుకుంటే.. వాటిని నానబెట్టి తీసుకోవడం మంచిది. గుప్పెడు వాల్ నట్స్ తీసుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం తొక్క తీసి తినాలి. లేదంటే.. ఈ తొక్క ద్వారా ఎక్కువ హాని కలుగుతుంది.

వాల్ నట్స్ ని నానబెట్టి తినడం వల్ల చాలా తేలికగా జీర్ణమవుతాయి. డ్రై ఫ్రూట్స్ లో చాలా హెల్త్ బెన్ఫిట్స్ ఉంటాయి. అందులో వాల్ నట్స్ మరింత మంచివి. వీటిల్లో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఒకే డ్రై ఫ్రూట్ లో లభించడం అమోఘం. అయితే నానబెట్టిన వాల్ నట్స్ ని ప్రతి రోజూ తినడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చో చూద్దాం..

హార్ట్ హెల్త్

హార్ట్ హెల్త్

వాల్ నట్స్ ని నానబెట్టి తినడం వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. దీంతో గుండె వ్యాధుల రిస్క్ దరిచేరదు.

డయాబెటిస్

డయాబెటిస్

వాల్ నట్స్ ని నానబెట్టి ప్రతిరోజూ తినడం వల్ల.. డయాబెటిస్ ని కంట్రోల్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టైప్ టు డయాబెటిస్ కి వాల్ నట్స్ చక్కటి పరిష్కారం.

క్యాన్సర్:

క్యాన్సర్:

వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. ఇవి క్యాన్సర్ కణాల గ్రోత్ ని అడ్డుకుంటాయి. శరీరంలో క్యాన్సర్ కి కారణమయ్యే కణాలను పూర్తీగా నాశనం చేస్తాయి.

ఒత్తిడి, డిప్రెషన్

ఒత్తిడి, డిప్రెషన్

వాల్ నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఒత్తిడి, డిప్రెషన్ ని తగ్గించడానికి సహాయపడతాయి. రెగ్యులర్ గా వాల్ నట్స్ ని నానబెట్టి తీసుకుంటూ ఉంటే.. మూడ్ ని కూడా మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, డిప్రెషన్ కి దూరంగా ఉంటారు.

మెటబాలిజం

మెటబాలిజం

వాల్ నట్స్ లో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, కాపర్, జింక్ ఉంటాయి. ఇవన్నీ శరీరంలో మెటబాలిజంను చాలా వేగంగా మెరుగుపరుస్తాయి.

బరువు తగ్గడం

బరువు తగ్గడం

శరీరానికి అవసరమైన మంచి ఫ్యాట్స్ వాల్ నట్స్ లో ఉంటాయి. ఎక్కువ సమయం వరకు ఇవి ఆకలి అనిపించకుండా.. ఫుల్ గా ఉన్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే అదనపు బరువు పెరగకుండా అడ్డుకుంటుంది.

మంచి నిద్రకు

మంచి నిద్రకు

వాల్ నట్స్ లో మెలటోనిన్ ఉంటుంది. ఇది హాయిగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది. నానబెట్టిన కొన్ని వాల్ నట్స్ ని ఉదయం, రాత్రి నిద్రకు ముందు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

ఎముకలు, పళ్లు

ఎముకలు, పళ్లు

వాల్ నట్స్ లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎముకలు, పళ్లను బలంగా మార్చడానికి సహాయపడుతుంది.

మెదడు ఆరోగ్యానికి

మెదడు ఆరోగ్యానికి

వాల్ నట్స్ ని మెదడు ఆరోగ్యానికి మంచిదని చాలామంది చెబుతారు. ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి మంచిది. అలాగే మెమరీ పవర్ పెంచడానికి సహాయపడుతుంది.

English summary

Here Is What Happens To Your Body When You Eat 3 Walnuts Every Day!

Whether you are a fan of dry fruits or not, you would surely know of walnuts, right? Famously used to prepare desserts like walnut brownies, walnuts have become quite popular.
Story first published: Saturday, February 4, 2017, 13:37 [IST]
Desktop Bottom Promotion