మీ బరువు గురించి చింతించకుండా ఈ లో కేలరీ ఫుడ్స్ ని నిస్సందేహంగా తినవచ్చు

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఆహారం ద్వారానే మన శరీరానికి అవసరమైన అత్యవసర పోషకాలు లభిస్తాయి. అంతే కాదు ఆహరం రుచిగా ఉంటే ఒకవైపు టేస్ట్ బడ్స్ ని సంతృప్తి పరుస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎంతో మంది భోజన ప్రియులు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడం కోసమే జీవిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

అయితే, రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించాలనే కోరికతో తమ బరువు మీద నియంత్రణ కోల్పోతారు. తద్వారా, అధిక బరువు సమస్యతో బాధపడతారు. బరువుని అదుపులో ఉంచడానికి పాటించవలసిన కఠినమైన ఆహార నియంత్రణని వీరు శాపంగా భావిస్తారు.

low calorie foods

కాబట్టి, మన దైనందిన ఆహారపుటలవాట్లలో కాస్త మార్పు తీసుకురావడం ద్వారా హై కేలరీ ఫుడ్స్ రుచికి ధీటుగానుండే రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్నే మనం తీసుకోవచ్చు.

కొన్ని లోకేలరీ ఫుడ్స్ కూడా అమోఘమైన రుచితో భోజన ప్రియులను ఆకర్షిస్తాయి. వీటిని, పుష్కలంగా తీసుకున్నా అధిక బరువు పెరుగుతామేమోనన్న సందేహం దరిచేరదు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం పచ్చి కూరగాయలకు మాత్రమే పరిమితం కానవసరం లేదు.

కొన్ని ఫుడ్స్ లో చేసే చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా తయారయ్యే లోకేలరీ ఫుడ్, ఆరోగ్య స్పృహ కలిగినవారికి అలాగే అధిక బరువు సమస్యతో సతమతమయ్యేవారికి అద్భుతమైన ఫలితాలను కలుగచేస్తాయి.

low calorie foods

1. తాజా కూరగాయలలో టేస్టీ ఆప్షన్స్:

సాధారణంగా, కూరగాయలలో ఎక్కువ ఫైబర్ అలాగే నీరు లభించడం వలన వీటిని లోకేలరీ ఫుడ్స్ గా భావిస్తారు. అయితే, అటువంటి కూరగాయలను తీసుకుని రుచికరమైన సలాడ్స్ ను తయారుచేయవచ్చు.

రెండు కట్టల కొత్తిమీరకాడల నుంచి 13 కేలరీలు అలాగే 1.2 గ్రాముల ఫైబర్ లభిస్తుందని తెలుస్తోంది.

తాజాగా తరిగిన రెండు కప్పుల పాలకూర ఆకుల నుంచి 18 కేలరీలు మరియు 1.4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.

సగటు పరిమాణంలోనున్న దోసకాయ నుంచి 40 కేలరీలతో పాటు 2 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.

ఒక తాజా టొమాటో నుంచి 25 కేలరీలతో పాటు 1.3 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.

అర కప్పుడు చిక్కుడు కాయల నుంచి 30 కేలరీలతో పాటు 3.4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.

ఒక కప్పుడు తరిగిన జీకామా స్టిక్స్ నుంచి 45 కేలరీలతో పాటు 6 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.

కాబట్టి, ఈ కూరగాయలన్నిటినీ ఏ మాత్రం సందేహం లేకుండా మీ రోజువారీ డైట్ ప్లాన్ లో భాగంగా చేసుకోవచ్చు. వీటిని తీసుకుంటే ఆకలి తీరడంతో పాటు బరువు నియంత్రణలోనే ఉంటుంది. తాజా పెరుగుతో వీటిని జోడిస్తే రుచి అమోఘంగా ఉంటుంది. ఇంకెందుకాలస్యం, మీ పాకశాస్త్ర నైపుణ్యానికి మెరుగులు దిద్ది ఈ కూరగాయలతో అద్భుతమైన రెసిపీలను ప్రయత్నించండి మరి.

low calorie foods

2. ఆరోగ్యకరమైన తాజా పండ్లు:

తాజా పండ్లు రుచికరంగా ఉంటూనే ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఎంతగానో తోడ్పతడాయి. అన్ని రకాల పండ్లలో కేలరీలు తక్కువగా ఉండకపోవచ్చు. అయితే, ఎన్నో రకాల రుచికరమైన లో కేలరీ పండ్లు మార్కెట్ లో విరివిగా లభిస్తున్నాయి.

పోషక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక పీచ్ నుంచి 37 కేలరీలతో పాటు 1.6 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.

1 ఆరెంజ్ నుంచి 60 కేలరీలతో పాటు 2.3 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.

1 గ్రేప్ ఫ్రూట్ నుంచి 74 కేలరీలతో పాటు 3.4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.

1 కప్పు తాజాగా తరిగిన స్ట్రాబెరి నుంచి 50 కేలరీలతో పాటు 2.5 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.

1 కప్పు వాటర్ మిలన్ నుంచి 51 కేలరీలతో పాటు 0.4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.

1 కప్పు బొప్పాయి పండు నుంచి 54 కేలరీలతో పాటు 2.5 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.

3/4th కప్పు తాజాగా తరిగిన ఆప్రికాట్ లో 55 కేలరీలతో పాటు 2 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.

కాబట్టి, ఈ పండ్లను రోజూ తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైనటువంటి పోషకవిలువలు అందించవచ్చు. అదే సమయంలో, కేలరీలు కూడా తక్కువగా ఉండటం వలన అధిక బరువు సమస్య వేధించదు.

low calorie foods

3. ఫ్రోజెన్ వెజిటబుల్స్ లో వెరైటీస్:

మనలో చాలామందికి ఫ్రోజెన్ స్టేట్ లో నున్న కూరగాయల రుచి అంటే చాలా ఇష్టం.

ఈ ఫుడ్ ఐటమ్స్ ని ప్రిజర్వ్ చేసేటప్పుడు కూడా వీటిలోని పోషకవిలువలు చెక్కు చెదరకుండా జాగ్రత్తపడవచ్చు . అందుకే, ఆరోగ్యస్పృహ కలిగిన వారికి కూడా ఈ వెజిటబుల్స్ అనేవి సరైన ఎంపిక.

ఇంతకు ముందు చెప్పినట్టుగా, ఫ్రోజెన్ ఫుడ్స్ ప్యాకెట్స్ పైన ఉన్న కేలరీల సంఖ్య బట్టి మీరు సరైన నిర్ణయం తీసుకోవచ్చు. ఫ్రోజెన్ కాలిఫ్లవర్, క్యారెట్స్, బ్రకోలీలలో కేవలం 25 కేలరీలు కలిగి ఉంటాయి. అలాగే, వీటిలో 2 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.

తరిగిన ఫ్రోజెన్ గ్రీన్ బీన్స్ లో 25 కేలరీలతో పాటు 2 గ్రాముల ఫైబర్ లభిస్తుందని అలాగే ఒక కప్పుడు వివిధ తస్కన్ కూరగాయలలో కూడా ఇదే మోతాదు కేలరీలు అలాగే ఫైబర్ లభిస్తాయని డైటీషియన్స్ కనుగొన్నారు.

ఇక్కడ చెప్పుకోబడిన లో కేలరీ ఫుడ్స్ అన్నీ అధిక బరువు సమస్యకు దారితీయకుండా మీకు సరైన పోషకవిలువలు అందిస్తూ మిమ్మల్ని స్లిమ్ గా ఉంచేందుకు సహకరిస్తాయి. అయితే, వీటికి జతగా మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అధిక బరువు సమస్య మిమ్మల్ని వేధించదు.

English summary

Low-calorie Foods To Eat Without Worrying About Your Weight

Food is one of the most vital necessities of life. Making the right choice of foods is very essential for a healthy living. Consuming foods high in fat, calories and carbohydrates can only lead to weight gain and serious health conditions too. Hence, it is always better to have low-calorie foods in order to prevent weight gain and other diseases..