శరీరంలో వ్యర్థాలను తొలగించి, న్యూట్రీషియన్ అందించే కీరదోస+కొత్తిమీర

Posted By:
Subscribe to Boldsky

శరీరం బహిర్గతంగానే కాదు, అంతర్గతంగా కూడా శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా జీవించగలుగుతారు. అంతే కాదు, బాడీలో శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.అందుకు మొదట మీరు శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించుకోవాలి. అదే విధంగా శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ ను అందివ్వాలి.

 Parsley+Cucumber =Toxins Out And Nutrients In!

ఈ రెండు పనులను పార్ల్సే మరియు కుకుంబర్ చేస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్ స్మూతీ శరీరంలో టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తాయి. అదే సమయంలో శరీరానికి కావల్సిన త న్యూట్రీషియన్స్ ను లోపలికి అందిస్తాయి.

రోజూ కీరకాయ తినడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు..!

కొత్తిమీర, కీరదోసకాయ కాంబినేషన్ లో స్మూతీ తాగడం వల్ల చర్మం హైడ్రేషన్ లో ఉంటుంది. ఈ హెల్తీ స్మూతీ శరీరంలో ఆల్కలైన్ బ్యాలెన్స్ చేస్తుంది. అదెలాగో తెలుసుకుందాం...

కావల్సినవి:

కావల్సినవి:

ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు కీరదోసకాయ ముక్కలు, ఒక టీస్పూన్ నిమ్మరసం , చిన్న అల్లం ముక్క, 2 క్యారెట్స్ (చిన్న ముక్కలుగా )కట్ చేసుకోవాలి. ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ .

తయారీ:

తయారీ:

మొదట కీరదోస ముక్కలు, క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు, మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

తర్వాత కొత్తిమీర కూడా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఆరెంజ్ జ్యూస్ లో మిక్స్ చేసి, ఐస్ క్యూబ్స్, కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తాగాలి.

ఎలా పనిచేస్తుంది.

ఎలా పనిచేస్తుంది.

* కీరోదస, కొత్తిమీర స్మూతీ కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. టాక్సిన్స్ ను బయటకు నెట్టేస్తుంది. పార్ల్సే ఒక డ్యూరియాటిక్ . ఇది శరీరానికి కావల్సిన మినరల్స్, విటమిన్స్, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ను అందిస్తుంది. ఇది మలబద్దకంను నివారిస్తుంది. కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది. మరియు కొన్ని రకాల క్యాన్సర్ లక్షణాలను నివారిస్తుంది.

ఎలా పనిచేస్తుంది.

ఎలా పనిచేస్తుంది.

* కుకుంబర్, పార్ల్సే స్మూతీలో నిమ్మరసం జోడించడం వల్ల ఇది శరీరంలోని పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇమ్యూనిటి లెవల్స్ పెంచుతుంది. విటమిన్ సి అందిస్తుంది. అల్లం శరీరానికి ఒక మంచి యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది.

ఎలా పనిచేస్తుంది.

ఎలా పనిచేస్తుంది.

* కీరదోసకాయ విటమిన్ బి, సి, మరియు కె లను శరీరానికి అందిస్తుంది. బ్లడ్ ప్రెజర్ , కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

English summary

Parsley+Cucumber =Toxins Out And Nutrients In!

A detox smoothie is all that you want at times, to make you feel recharged and rejuvenated. To feel good, you first need to flush out toxins and then you should load some nutrients into your body.
Story first published: Monday, March 6, 2017, 11:23 [IST]
Subscribe Newsletter