ఈ నూనెలను వంటలకు వాడితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం...

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky
Top 11 Healthiest Cooking Oils That Will Keep You Healthy

స్వీట్స్ అయినా.. స్నాక్స్ అయినా.. కూరలైనా.. పప్పు అయినా.. చపాయితీ అయినా ఆయిల్ తగలాల్సిందే. నూనె లేకుండా వంట చేయడం కష్టం. వంటకాలకు, రుచి రావాలంటే.. జిడ్డు ఉండాల్సిందే. వంటకాల్లో నూనెకు అంత ప్రాధాన్యత ఉంది.

వంటల్లో నూనె తగ్గించాలని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. నూనె ఎక్కువగా వాడటం వల్ల అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని.. ముఖ్యంగా కొలెస్ర్టాల్ కి నూనె కారణమని సూచిస్తున్నారు. కానీ.. నూనె విషయంలో ఏ ఒక్కరూ కేర్ తీసుకోవడం లేదు. కాబట్టి కనీసం మోతాదైనా తగ్గించుకుంటే మంచిదని చెబుతున్నారు. అలాగే వంటలకు వాడే నూనె తక్కువగా ఉండాలి.. అది ఆరోగ్యకరమైనదే వాడాలి. అలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందే ఆయిల్స్ ఏంటి ? ఏవి వాడాలో ఇప్పుడు చూద్దాం..

వేరుశనగ నూనె

వేరుశనగ నూనె

గతంలో ఎక్కువగా వేరుశనగ నూనె వాడేవాళ్లు. అందుకే పూర్వం చేసే వంటలు రుచికరంగా.. ఘుమఘుమల సువాసన వెదజల్లేవి. అంతేకాదు.. ఈ నూనె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వంద గ్రాముల వేరుశనగ నూనెలో 884 క్యాలరీల శక్తి వస్తుంది. ఇది ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచడమే కాదు.. మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది.

అవొకాడో ఆయిల్:

అవొకాడో ఆయిల్:

అవొకాడో ఆయిల్లో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్అధికంగా ఉన్నాయి, ఇవి హార్ట్ హెల్త్ కు చాలా మంచిది. ముఖ్యంగా ఎక్కువ స్మోక్ చేసే వారికి ఇది ఒక మంచి కుకింగ్ ఆియల్ , వంటలకు గ్రిల్లింగ్, సోటిగ్ మరియు ఫ్రైయింగ్ కు దీన్ని ఉపయోగించవచ్చు. అవొకాడో నూనెను సలాడ్స్ డ్రెస్సింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కానీ దీని వీలువ చాలా ఎక్కువ. పొట్ట తగ్గేందుకు ఇది చాలా ఉపయోగ పడతది. దీనిలో చాలా తక్కువ కొలెస్ట్రాల్ ఉంటది. ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఇతర నూనెల కంటే ఆలివ్ ఆయిల్‌ను వంటల్లో ఉపయోగించడం ద్వారా మధుమేహం, హృద్రోగసమస్యలకు చెక్ పెట్టవచ్చునని చెప్పారు. హై కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులతో ఆలివ్ ఆయిల్ పోటీ పడుతుందని, క్యాన్సర్, డయాబెటిస్ వ్యాధులకు ఆలివ్ ఆయిల్ ఔషధంలా పనిచేస్తుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

దీనిలో అసలు కొలెస్టరాల్ ఉండదు. కనుక దీనిని వంటలలో వాడవచ్చు. అయితే మితంగా వాడండి.కొబ్బరి నూనె వంటలకు వాడటం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు, ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది ఎనర్జీ పెంచుతుంది. సూప్స్, స్టివ్స్, కర్రీస్ కు దీన్ని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు.

పాల్మ్ ఆయిల్ :

పాల్మ్ ఆయిల్ :

పామ్ ఆయిల్ పాల్మ్ పండ్ల నుండి తయారుచేస్తారు. ఈ నూనెలో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. ఇంకా ఇందులో విటమిన్ ఇక కూడా ఉంటుంది. కెరోటిన్స్, లైకోపిన్ లు అధికం. ఈ నూనెను వంటలకు ఉపయోగించుకోవచ్చు. హార్ట్ హెల్త్ కు మంచిది.

బాదం ఆయిల్ :

బాదం ఆయిల్ :

బాదం నూనెలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. వంటలకు ఇది సూటబుల్ నూనె. ఈ లైట్ కలర్ నూనె లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల కేక్స్, కుక్కీస్, సినామిన్ బన్స్ మరియు మఫిన్స్ బేక్ చేయడానికి ఉపయోగిస్తుంటారు.

వాల్ నట్ ఆయిల్ :

వాల్ నట్ ఆయిల్ :

వాల్ నట్ ఆయిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. మీడియం వంటలను నుండి పెద్ద పెద్ద వంటలకు కూడా ఉపయోగించుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ కు ఇది బెస్ట్ నూనె, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది. ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ నూనెలో విటమిన్ కె, మరియు ఇలు అధికంగా ఉన్నాయి. ఈనూనెను బేక్ చేయడానికి సూట్ చేయడానికి , సలాడ్స్ డ్రెస్సింగ్ కు పర్ఫెక్ట్ గా ఉంటుంది.

నువ్వుల నూనె

నువ్వుల నూనె

వంటల్లో నూనె వాడే విధానంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పాలి. నువ్వుల నూనె కూడా పూర్వం నుంచి వాడుతున్నది. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఇందులో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ర్టాల్ ని అరికడతాయి. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తాయి, హార్ట్ డిసీజ్ ను నివారిస్తాయి.

ఫ్లాక్ సీడ్ ఆయిల్ :

ఫ్లాక్ సీడ్ ఆయిల్ :

ఫ్లాక్ సీడ్ ఆయిల్లో కూడా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇన్ఫ్లమేటరీ వ్యాధులను ఆర్థ్రైటిస్ ను నివారిస్తుంది. మీట్ ను గ్రిల్ చేయడానికి, కేక్ బేకింగ్, మఫిన్స్ తయారీకి దీన్ని ఉపయోగించవచ్చు. ఇంకా ప్రోటీన్ షేక్ మరియు వెజిటేబుల్ జ్యూస్ లకు కూడా దీన్ని వాడుతారు.

వెజిటేబుల్ ఆయిల్ :

వెజిటేబుల్ ఆయిల్ :

వెజిటేబుల్ నూనెను కామన్ గా అన్ని రకాల వంటలకు ఉపయోగిస్తుంటారు. ఇది హైస్మోకింగ్ పాయింగ్ ఆయిల్ దీన్ని డీప్ ఫ్రైయింగ్, హై హీట్ సూటింగ్ కు ఉపయోగించుకోవచ్చు.

సన్ ఫ్లవర్ ఆయిల్

సన్ ఫ్లవర్ ఆయిల్

న్యాచురల్ గా పొందే ఏ వస్తువైనా ఆరోగ్యకరంగానే ఉంటుంది. అలాంటిదే సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా. ఇది ఎక్కువగా వాడతారు. ఈ నూనెను వంటకాల్లో వాడటం వల్ల ఆర్థరైటిస్ సమస్య రాకుండా నియంత్రించవచ్చు. అలాగే దీని ద్వారా ఎక్కువ మోతాదులో విటమిన్స్ పొందవచ్చు.

మస్టర్డ్ నూనె లేదా ఆవ నూనె:

మస్టర్డ్ నూనె లేదా ఆవ నూనె:

దీనిలో మోనో అన్ శాట్యురేటెడ్ మరియు పాలీ అన్ శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇంకా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా , విటమిన్ ఇ ఉంటుంది. దీన్ని వంటలకు వాడటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రావు. ఇది తక్కువగా వాడండి.

English summary

Top 11 Healthiest Cooking Oils That Will Keep You Healthy

Choosing the right kind of oil is beneficial because it provides maximum health benefits. These oils are best for all types of cooking food and are also good for your health. They help lower the cholesterol levels and protect against heart diseases.