కొంతమంది భోజనంతో మిరపకాయ ఎందుకు నములుతారు?

Posted By: Deepti
Subscribe to Boldsky

మన దేశం వారికి మిర్చి అంటే ప్రాణం! సమోసా, వడాపావ్ వంటి అనేక ఆహారపదార్థాలతో చాలామందికి పచ్చిమిర్చి తినే అలవాటుంది. కొంతమందికి బిర్యానీలో ఘాటుగా ఉండే పచ్చి మిరపకాయ తినే అలవాటుంటే, మరికొంతమంది రొట్టెలు కూరతో కూడా మిర్చి నమిలే అలవాటు ఉంటుంది.

ఒక నిమిషం! ఇంతకీ మిర్చి ఆరోగ్యానికి చెడ్డదా? కాదు. దానివల్ల అనేక లాభాలున్నాయి. పచ్చిమిర్చి మీ భోజనాన్ని రుచికరంగా మార్చటమే కాక, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అందుకే శతాబ్దాల నుంచి భారతీయ భోజనంలో మిరపకాయ భాగమైపోయింది !

Why Indians Bite A Green Chilli While Eating Food

అందులో విటమిన్ ఎ,సి,కె, ఇ లతో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాపర్ మరియు ఐరన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి.

పచ్చిమిర్చిలో మనకు తెలియని ఆరోగ్యరహస్యాలు

హెచ్చరిక: పచ్చిమిరప ఎక్కువ తింటే అల్సర్లు, పుళ్ళు, వాపులు కూడా వస్తాయి. కాబట్టి తిమితం గా తీస్కోండి!

అది మరింత లాలాజలాన్ని విడుదల చేస్తుంది

అది మరింత లాలాజలాన్ని విడుదల చేస్తుంది

పచ్చిమిరపకాయని ఊహిస్తేనే నోరూరుతోంది కదా? లాలాజలం వల్ల అరుగుదల ఎక్కువ ఉంటుంది. ఒక మిరపకాయని నేరుగా నోట్లో వేసుకున్నారనుకోండి, వెంటనే నోట్లో లాలాజలం ఊరుతుంది. ఆహారం లాలాజలంతో నమిలేటప్పుడు కలిస్తే, మీ జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది.

అది విషపదార్థాలను తొలగిస్తుంది

అది విషపదార్థాలను తొలగిస్తుంది

పచ్చిమిరపకాయలు మలబద్ధకాన్ని రాకుండా ఆపుతాయి. ప్రేగుల కదలికను ప్రేరేపించటమే కాక, శరీరంలో విషపదార్థాలను బయటకి పంపేస్తాయి. మీ మూడ్ ను కూడా మెరుగుపరుస్తుంది.

నాలికకే కాదు, పచ్చిమిర్చి ఘాటు మీ మూడ్ ను కూడా మార్చేస్తుంది! మిరపకాయలో ఉండే కాప్సయిసిన్ మీలో ఆనందాన్ని పెంచే ఎండార్ఫిన్ అనే రసాయనాలను విడుదలచేసి మీ మనస్సును ఆహ్లాదపరుస్తుంది. అందుకే చాలామందికి మిర్చి ఘాటంటే ప్రాణం.

ప్రాన్స్-గ్రీన్ చిల్లి మంచూరియా

మిర్చి వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది

మిర్చి వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది

వీటిల్లో ఉండే విటమిన్ సి మీ రోగనిరోధక వ్యవస్థకు మంచిది. మనం మామూలుగా సిట్రస్ జాతి పళ్ళలోనే విటమిన్ సి ఉంటుందనుకుంటాం. పచ్చిమిర్చిని కూడా ఆ లిస్ట్ లో చేర్చుకోండి.

కళ్ళకు మంచిది

కళ్ళకు మంచిది

మిరపకాయలో ఉండే విటమిన్ సి దృష్టిని పెంచి కంటి సమస్యలకు దూరంగా ఉండేట్లు చేస్తుంది

ఆరోగ్యవంతమైన ఎముకలు కూడానా?

ఆరోగ్యవంతమైన ఎముకలు కూడానా?

అందరికీ తెలియని విషయం పచ్చిమిరపకాయలు ఎముకల ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటూ, కణజాల మరమ్మత్తు, రక్తకణాలను ఉత్పత్తిచేయటంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తాయి.

ఇతర లాభాలు

ఇతర లాభాలు

పచ్చిమిరపకాయలు రక్తంలో సుగర్ శాతం నియంత్రించి ఇన్ఫెక్షన్ లను (వాటిలో ఉండే బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాల వలన) నివారిస్తూ, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంచుతాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Why Indians Bite A Green Chilli While Eating Food

    Is green chilli bad for health? No. It is good as it offers many health benefits. A green chilli makes your food tasty and also boosts your health.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more