తర్బూజా విత్తనాల వలన కలిగే 10 అద్భుత ఆరోగ్య లాభాలు

Subscribe to Boldsky

వచ్చేసారి మీరు తర్బూజా పండు తిన్నప్పుడు, విత్తనాలను బయట ఊసేయకండి. ఎందుకనుకుంటున్నారా? వాటర్ మిలన్ విత్తనాలలో అధిక పోషకవిలువలు ఉంటాయి. నిపుణులు చెప్పేదాని ప్రకారం తర్బూజా విత్తనాలు తినటం సురక్షితం మరియు మీ మొత్తం ఆరోగ్యానికి మంచిది.

వేసవిలో సేదతీర్చే వాటర్ మిలన్ పండులో పోషకవిలువలుండే విత్తనాలలో అన్ని పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ విత్తనాలలో అధిక స్థాయిలో అమినోయాసిడ్లు, ప్రొటీన్, బి విటమిన్లు, నియాసిన్, మెగ్నీషియం, జింక్, కాపర్, పొటాషియం, మాంగనీస్, ఐరన్ మరియు కాపర్ ఉంటాయి.

తర్బూజా విత్తనాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మరియు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ల వంటి ఆరోగ్యకర కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి మీరు ఎలా కావాలంటే అలా తినవచ్చు.మీరు ఈ విత్తనాలను మీ ప్రొటీన్ షేక్స్ లేదా సలాడ్స్ కి జతచేసుకోవచ్చు.

ఈ విత్తనాలు మీ ఆరోగ్యానికి మంచివి మాత్రమేకాదు, వాటిల్లోంచి తీసిన నూనె కూడా మీ చర్మానికి, జుట్టుకి అద్భుతంగా పనిచేస్తుంది.

తర్బూజా పండు విత్తనాల ఆరోగ్య లాభాలను ఇప్పుడు చూడండి.

1.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

1.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

వాటర్ మెలన్ విత్తనాలలో ఉండే మెగ్నీషియం, గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఈ విత్తనాలను తినటం వలన రక్తపోటు అదుపులో ఉండే, గుండె సాధారణంగా పనిచేస్తుంది. ఈ విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు మరియు వాపు వ్యతిరేక లక్షణాలుంటాయి.

2.మగవారిలో సంతాన సాఫల్యతను పెంచుతుంది

2.మగవారిలో సంతాన సాఫల్యతను పెంచుతుంది

వాటర్ మిలన్ పండులోని విత్తనాలలో ఉండే జింక్, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు లాభాన్ని చేకూర్చే మరో ముఖ్య ఖనిజలవణం. ఇది సంతానోత్పత్తి సామర్థ్యం లేని మగవారిలో వీర్యకణాల నాణ్యతను పెంచుతుంది. ఈ విత్తనాలలో ఉండే మాంగనీస్ కూడా సంతాన సాఫల్యతను పెంచుతుంది.

3.రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది

3.రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది

వాటర్ మిలన్ విత్తనాల నిడా ఐరన్ మరియు బి విటమిన్లుండి రోగనిరోధక వ్యవస్థను మరియు రోగనిరోధకతను బలపరుస్తుంది.మీ ఆహారంలో క్రమం తప్పకుండా తర్బూజా విత్తనాలను రోగనిరోధక శక్తి బలపర్చుకోటానికి తినండి.

4. మధుమేహాన్ని నయం చేస్తుంది

4. మధుమేహాన్ని నయం చేస్తుంది

తర్బూజా విత్తనాలు డయాబెటిస్ కి వ్యతిరేకంగా పనిచేసి, గ్లైకోజెన్ ను పేరుకోనివ్వకుండా చూడటంలో సానుకూల ప్రభావాలు చూపిస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బేసిక్ అండ్ అప్లైడ్ సైన్సెస్ లో ఈ విత్తనాలు టైప్ 2 డయాబెటిస్ ను కూడా నియంత్రించవచ్చని ఉంది.

5.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

5.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

తర్బూజా విత్తనాలలో మెగ్నీషియం, పోషకాలను పీల్చుకోటానికి సాయపడే శరీరంలోని ఎంజైములను యాక్టివేట్ చేస్తుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపడటానికి సాయపడి, కడుపులో యాసిడ్స్ ఏర్పడకుండా నివారిస్తుంది.

6.చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

6.చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

వాటర్ మెలన్ విత్తనాలు మీ చర్మం తీరును, మొత్తం ఆకృతిని మెరుగుపరుస్తాయి. ఈ విత్తనాలలో ఉండే మెగ్నీషియం కార్టిసాల్ స్థాయిలను తగ్గించి, హార్మోన్లను సమతుల్యం చేసి, కణాల పనితీరును మెరుగుపరుస్తుంది.ఇది ముడతలు కూడా పడకుండా నివారించి, ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

7.మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

7.మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

వాటర్ మెలన్ విత్తనాలలో ఉండే మెగ్నీషియం జ్ఞాపకశక్తిని మరియు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపర్చటానికి సాయపడుతుంది. ఒక ప్రముఖ అమెరికన్ అధ్యయనం ప్రకారం, మెగ్నేషియం జ్ఞాపకశక్తి పనితీరును మెరుగుపర్చి, అల్జీమర్స్ వ్యాధిని నయం చేయగలదు.

8.ఎదుగుదల మరియు అభివృద్ధి

8.ఎదుగుదల మరియు అభివృద్ధి

తర్బూజా విత్తనాలలో అధిక మొత్తాలలో ఆర్జినైన్ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించి, కరోనరీ గుండె జబ్బు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది. ఈ విత్తనాలలో ఉండే అమినోయాసిడ్లు మరియు ప్రొటీన్ సాధారణ ఎదుగుదల మరియు అభివృద్ధిని తగినట్టు ఉంచటానికి సాయపడతాయి.

9.ఆస్టియోపోరోసిస్ ను నివారిస్తాయి

9.ఆస్టియోపోరోసిస్ ను నివారిస్తాయి

వాటర్ మెలన్ విత్తనాలలో ఎముకలను బలపర్చే మరియు ఎముకల్లో ఖనిజలవణాల సాంద్రతకి అవసరమైన అన్ని ముఖ్యమైన పోషకాలుంటాయి. ఈ విత్తనాలను తినటం వలన ఆస్టియోపోరోసిస్ నివారించబడి, మీ వయస్సు మీరేకొద్దీ మిమ్మల్ని బలంగా ఉండేట్లా చేస్తుంది.

10.చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

10.చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

వాటర్ మెలన్ విత్తనాలలో నిండుగా పీచుపదార్థం మరియు ఫ్యాటీ యాసిడ్లు ఉండి చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్ డిఎల్) ను తగ్గించటంలో సాయపడుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్ గుండె జబ్బులను పెంచుతుంది, రక్తనాళాలను మూసుకునేలా చేస్తుంది దానివల్ల గుండె పోటు మరియు స్ట్రోక్ వస్తుంది. ఈ విత్తనాలు తినటం వలన మంచి కొలెస్ట్రాల్ ఏర్పడి, చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

ఈ ఆర్టికల్ ను పంచుకోండి!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    10 Awesome Health Benefits Of Watermelon Seeds

    10 Awesome Health Benefits Of Watermelon Seeds,Experts suggest that eating watermelon seeds is safe and can actually be good for your overall health. Know about the health benefits of watermelon seeds.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more