ద్రాక్ష గింజలను తినడం వల్ల కలిగే 10 రకాల ఆరోగ్యప్రయోజనాలు గురించి మీరు తప్పక తెలుసుకోవాలి !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ద్రాక్షను తినడాన్ని ఎవరూ ఇష్టపడరు ? ద్రాక్షలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలతో పాటు ఫ్లేవానాయిడ్ల వంటి శక్తివంతమైన పోషకాలతో నిండి వుంటాయి. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమంటే ద్రాక్షగింజలు తినదగినవి అలాగే, వాటిలో శక్తివంతమైన అనామ్లజనకాలు & ఒలిగోమెరిక్ ప్రోయాన్డోనిడినిన్ కాంప్లెక్స్ (OPCs) అనే మొక్కలకు సంబంధించిన సమ్మేళనాలను ఇవి పుష్కలంగా కలిగి ఉంటాయి. ఈ ఆర్టికల్లో, ద్రాక్ష గింజల ఆరోగ్య ప్రయోజనాల గూర్చి వివరించడం జరిగింది.

ద్రాక్ష గింజలలో ఉన్న ఒలిగోమెరిక్ ప్రొండోనియనిటిన్ కాంప్లెక్స్ (OPCs) లో గల యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలో స్వేచ్ఛా రాడికల్స్ నాశనం చేయడంలో సహాయపడతాయి. దీని ఫలితంగా మీరు అకాల వృద్ధాప్యమును & కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను నిరోధించవచ్చు.

10 Health Benefits Of Grape Seeds You Should Know

ద్రాక్ష గింజలలో ఉన్న ఒలిగోమెరిక్ ప్రోయాన్డోనియనిన్ కాంప్లెక్స్ (OPCs), శరీరంలో గల వివిధ రకాల ఆరోగ్య పరిస్థితులను నివారించి, ఇతర ప్రయోజనకరమైన కార్యకలాపాలను కొనసాగిస్తుంది.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ నేషనల్ సెంటర్ ప్రకారం, ఈ రోజుల్లో గుండె & రక్త నాళాలు, అథెరోస్క్లెరోసిస్, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు మొదలైన వాటికి సంబంధించిన ప్రతికూల పరిస్థితుల నివారణకు సాంప్రదాయకమైన ద్రాక్ష గింజలనే ఉపయోగిస్తున్నారు.

ద్రాక్ష గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిద్దాం !

1. అధిక రక్తపోటు :

1. అధిక రక్తపోటు :

ద్రాక్ష గింజలు రక్త నాళాలు & ధమనులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా రక్షించగలుగుతాయి, లేకుంటే అటువంటి ప్రమాదాలన్నీ అధిక రక్తపోటుకు & ఇతర హృదయ సంబంధమైన సమస్యలకు దారితీస్తుంది. అంతేకాక, ద్రాక్ష గింజలలో ఉండే కాంపౌండ్స్ శరీరంలో విటమిన్ C చర్యను ప్రేరేపించగలవు, ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, అలానే దెబ్బతిన్న రక్తనాళాల మరమత్తు ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

2. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది

2. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది

ద్రాక్ష గింజలలో ఉన్న ఫ్లేవనాయిడ్స్, శరీరంలో విటమిన్-సి స్థాయిలను ప్రేరేపిస్తాయి. కానీ వీటిలో విటమిన్-ఇ కూడా ఉంటుంది. ఇది బ్యాక్టీరియా & వ్యాధికారక చర్యల ప్రభావాన్ని నిరోధించడానికి వ్యతిరేకంగా పోరాడే రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే, ద్రాక్ష గింజలలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి కంటే 30-50 రెట్లు ఎక్కువ శక్తివంతమైనదిగా ఉందని భావిస్తారు.

3. వాపులను నిరోధిస్తుంది (ఎడెమా) :

3. వాపులను నిరోధిస్తుంది (ఎడెమా) :

దీర్ఘకాలంగా కూర్చుని ఉండటం వల్ల సంభవించే కాళ్ల వాపును ద్రాక్షగింజలు సమర్థవంతంగా నిరోధిస్తాయి. ఈ ద్రాక్ష గింజలను తినడం వల్ల శరీరంలో బాధాకరమైన స్థాయిలో నిల్వ ఉన్న నీటి శాతాన్ని తగ్గిస్తుంది. ఇది కణాలు & కణజాలాల మధ్య ద్రవాల బదిలీలను & బ్యాలెన్స్లను నియంత్రిస్తుంది.

4. బరువు కోల్పోవడాన్ని ప్రోత్సహిస్తుంది :

4. బరువు కోల్పోవడాన్ని ప్రోత్సహిస్తుంది :

శరీర బరువును కోల్పోవటం వంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలలో ద్రాక్ష గింజలు బాగా సహాయపడతాయి. ఈ గింజలు శరీరం లోపల ఉన్న కొవ్వు నిక్షేపణలను నిరోధిస్తాయి, శరీరంలో కొవ్వు శోషణ స్థాయిని కూడా తగ్గిస్తాయి. ద్రాక్ష గింజలను తినడం వల్ల మీలో శక్తిని పెంచుతుంది, అలానే మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది, ఇవన్నీ కూడా శరీర బరువును కోల్పోయే ప్రయత్నాలకు మరింతగా సహాయపడుతుంది.

5. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది :

5. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది :

ద్రాక్ష గింజల్లో అధికంగా ఉండే ఫ్లేవానాయిడ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, HDL & LDL కొలెస్ట్రాల మధ్య సమతుల్యాన్ని మెరుగుపరిచేందుకు బాధ్యత వహిస్తుంది. ఇది ధమనులు & రక్త నాళాలలో ఏర్పడే పాక్షిక ఫలకాల ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది, దానివల్ల గుండెపోటు, స్ట్రోక్, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాలు తగ్గుతాయి.

6. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది :

6. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది :

ఒలిగోమెరిక్ ప్రొన్డోసినయనిన్ కాంప్లెక్సులు, ఆలోచనా శక్తితో కూడిన మెదడు పనితీరును ప్రేరేపించగలవు, అలా ఇవి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి & మానసిక స్థితులను మెరుగుపరచడానికి బాగా దోహదపడతాయి. అల్జీమర్స్ & న్యూరోడెజెనరేటివ్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ద్రాక్ష గింజల సరైన ఔషధం. కాబట్టి మీరు మంచి జ్ఞానసంపదను పెంపొందించుకోవడానికి కొన్ని ద్రాక్ష గింజలను ప్రతిరోజు తినడం ప్రారంభించండి.

7. క్యాన్సర్ను నిరోధిస్తుంది :

7. క్యాన్సర్ను నిరోధిస్తుంది :

ఈ ద్రాక్షగింజలు, చర్మ క్యాన్సర్ తీవ్రతను తగ్గించి, వాటి క్యాన్సర్ కణాల వృద్ధిని నెమ్మదించేలా చేయగలవని కొన్ని ప్రయోగాల్లో నిరూపించబడినది. ఈ గింజలు బ్రెస్ట్ కేన్సర్ & ప్రొస్టేట్ క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడగలవు. శరీర కణాలను నాశనం చేసే స్వేచ్ఛ రాశులకు వ్యతిరేకంగా పోరాడటం వల్ల కాన్సర్ కణాల వృద్ధిని ఆపడంలో సహాయపడతాయి.

8. ఊపిరితిత్తులను సంరక్షిస్తుంది :

8. ఊపిరితిత్తులను సంరక్షిస్తుంది :

ద్రాక్ష గింజలు యాంటీ బాక్టీరియల్ & యాంటిహిస్టామైన్ వంటి లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి అలెర్జీలతో పోరాడటానికి & ఇన్ఫెక్షన్లను నివారించి మీ ఊపిరితిత్తులను కాపాడతాయి అలాగే, వాటి పనితీరును దెబ్బతీసే ఇతర వ్యాధులను కూడా నివారిస్తాయి. అంతేకాకుండా, ద్రాక్ష గింజలను తినడం వల్ల జలుబు, ఫ్లూ & శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన ఇతర పరిస్థితులను ఆకర్షించే అనుకూలతలను తగ్గిస్తుంది.

9. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది

9. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది

ద్రాక్ష గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ & యాంటీ బాక్టీరియా లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి సూక్ష్మజీవుల పెరుగుదలను అడ్డగించి, ఇన్ఫెక్షన్ల తీవ్రతను నివారించేలా చేసి, తగిన చికిత్సను అందించగలవు. అలాగే ఆర్థరైటిస్, చర్మశోథము, ద్రవాల నిలుపుదల, అల్సర్లు, సైనసిటిస్ & మూత్రనాళ ఇన్ఫెక్షన్ల తీవ్రతను తగ్గించడంలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా సహాయపడతాయి.

English summary

10 Health Benefits Of Grape Seeds You Should Know

Grape seeds are edible and are rich in powerful antioxidants and natural plant compounds called oligomeric proanthocyanidin complexes (OPCs). The health benefits of grape seeds include controlling high blood pressure, boosting the immune system, promoting weight loss, lowering cholesterol levels, stimulating brain function, etc.
Story first published: Thursday, May 10, 2018, 16:00 [IST]