For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొక్క ఆధారిత ఆహార ప్రణాళిక వలన కలిగే 6 ఆరోగ్య ప్రయోజనాలు.

|

జంతువుల మాంసం, మరియు ఉన్ని వంటి వాటికోసం, వాటి పట్ల మానవులు చూపే క్రూరత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చలు కారణంగా ప్రజల్లో ఒక అవగాహన అనేది వస్తూ ఉంది. మరియు మాంసం వలన కలిగే గుండె మరియు అనేక అంతర్గత రోగాల గురించిన అవగాహన కారణంగా, మరియు శాకాహారం వలన కలిగే లాభాల గురించి పెరిగిన ప్రచారాల కారణంగా, గతకాలంతో పోలిస్తే ఇప్పటి ప్రజలు నెమ్మదిగా మాంసాహారాన్ని తగ్గించి శాకాహారం వైపునకు మళ్ళుతూ ఉన్నారని తెలుస్తూ ఉంది.

కానీ మొక్క ఆధారిత ఆహార ప్రణాళికల గురించి సరైన అవగాహన లేకపోవడం వలన, మరియు వాటి లభ్యత రాను రాను తగ్గడం వలన, పర్యావరణ పరిరక్షణ మరియు జంతు రక్షణా చర్యల నేపద్యంలో కొన్ని స్వచ్చంద సంస్థలు చేపడుతున్న అవగాహనా కార్యక్రమాలలో కొందరు ప్రముఖులు స్వచ్చందంగా తమ మద్దతును తెలుపుతూ ప్రపంచ వ్యాప్తంగా శాకాహారం మీద అవగాహన కల్పిస్తున్నారు కూడా. క్రమంగా, మొక్కలలో మాంసం, మరియు పాల ఉత్పత్తులకు సంబంధించిన లక్షణాలు లేకపోవడం మూలాన, శాకాహారం ఆరోగ్యానికి ఎంతో ఉన్నతమైనదిగా ప్రజలు తెలుసుకుంటున్నారు కూడా.

6 Health Benefits Of Eating A Plant-based Diet

మొక్క ఆధారిత ఆహారం అంటే ఏమిటి?

పండ్లు, తృణధాన్యాలు మరియు కూరగాయలు వంటివి మొక్కల మూలాలను కలిగి ఉన్న ఆహార పదార్ధాలుగా ఉన్నాయి. ప్రధానంగా శాకాహార మూలాలపై ఇది ఆధారపడుతుంది, మాంసం మరియు పాల ఉత్పత్తులకు పూర్తిగా వ్యతిరేకం.

మొక్క ఆధారిత ఆహారం ఎందుకు ప్రజాదరణ పొందింది?

మాంసాహారం కన్నా పండ్లు, తృణ ధాన్యాలు, కూరగాయలు మొదలైనవి కూడిన శాకాహారం తీసుకోవడం మూలంగా కాన్సర్ ముప్పు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అనేక నివేదికలు తేల్చాయి. క్రమంగా ప్రజల్లో కూడా అవగాహన పెరగడం మూలంగా శాకాహారానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మరియు మాంసాహారం అధికంగా తీసుకునే వారిలో రక్తపోటు, గుండె, ఉదర మరియు కాలేయ సంబంధిత వ్యాధులు అనేకం తలెత్తుతాయని, ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు కూడా.

1. మీ మానసిక స్థితి మెరుగుపరుస్తుంది

1. మీ మానసిక స్థితి మెరుగుపరుస్తుంది

తాజా కూరగాయలతో నిండిన ఆహారం మానసిక ఆనందాన్ని పెంచుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రోకొలీ మరియు బెర్రీలు తినడం మూలంగా మీ శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. మొక్క-ఆధారిత ఆహారం ఇన్ఫ్లమేషన్ తగ్గించగలిగే, శరీరానికి అవసరమైన అనామ్లజనకాలను అందిస్తుంది. ఇది మీ మానసిక స్థితిని నియంత్రించే మెదడులోని రసాయనాలను క్రమబద్దీకరించడానికి సహాయపడే ఫైటోకెమికల్స్ సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది.

2.బరువు తగ్గడంలో పనితనం

2.బరువు తగ్గడంలో పనితనం

మొక్క ఆధారిత ఆహారం కేవలం తాజా కూరగాయలు, చిక్కుళ్ళు, మరియు గింజలను కలిగి ఉంటుంది. మరియు ఊబకాయం, లేదా అధిక బరువును తగ్గించడంలో మీకు సహాయం చేస్తుంది. మాంసాహారం తినేవాళ్ళతో పోలిస్తే, శాకాహారులు తక్కువ కేలరీలు కలిగిన ఆహారాన్ని స్వీకరిస్తుంటారు. క్రమంగా బరువు తగ్గడానికే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా అడ్డుకోగలదు. మొక్క ఆధారిత నూనెలు మరియు ఆలివ్ నూనె జోడించనవసరం లేకుండా, తక్కువ కేలరీల్లో మీ కడుపును నింపే ప్రయత్నం చేసేలా మొక్క ఆధారిత ఆహారాలు దోహదపడుతాయి. బీన్స్, తాజా కూరగాయలు మరియు చిక్కుళ్ళు వంటివి ఫైబర్ అధికంగా కలిగి ఉండడం మూలాన, కడుపు నిండిన అనుభూతికి లోనవుతారు. తద్వారా, ఆహారం మీదకు మనసు మళ్ళకుండా చేయగలదు.

3. దీర్ఘకాలిక వ్యాధులను నిరోధిస్తుంది

3. దీర్ఘకాలిక వ్యాధులను నిరోధిస్తుంది

పండ్లు మరియు కూరగాయలు కలిగి ఉన్న ఆహారం, దీర్ఘకాల వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం డయాబెటిస్ మరియు క్యాన్సర్ నుండి రక్షణకు మొక్క ఆధారిత ఆహార పదార్ధాలు ఎంతగానో సహాయం చేస్తాయి. ఎందుకంటే ఈ మొక్క ఆధారిత ఆహారాలలోని సంతృప్త కొవ్వులలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది, మరియు ప్రాసెస్ చేయబడిన మరియు మాంసం కన్నా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఆహారం మీ రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడమే కాకుండా, రక్తపోటుని తగ్గించడానికి మరియు అధిక బరువుని కోల్పోవటానికి కూడా సహాయపడుతుంది.

4. గుండెని కాపాడుతుంది

4. గుండెని కాపాడుతుంది

పండ్లు, తృణధాన్యాలు, కూరగాయల సహాయంతో మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచవచ్చు. మరియు ఈ ఆహారాలు మీ రక్తపోటుని తగ్గిస్తుంది. ఒక శాకాహారి ఆహార మార్గంలో మీ జీవనశైలి ఉంటే, గుండెవ్యాధుల ప్రమాదాన్ని మూడింట ఒక వంతు వరకు తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

5. దీర్ఘాయువు మరియు శక్తిని ప్రోత్సహిస్తుంది

5. దీర్ఘాయువు మరియు శక్తిని ప్రోత్సహిస్తుంది

మొక్క-ఆధారిత ఆహారాన్ని అనుసరిస్తున్న వారు ఎక్కువ సంవత్సరాలు జీవిస్తారని మరియు మరణ ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి దీర్ఘకాలిక వినియోగ లక్షణాలు కలిగి ఉన్న, తాజా మొక్క-ఆధారిత ఆహార పదార్ధాలలో కనిపించే పాలీఫెనోల్స్ యొక్క నిక్షేపాలే ప్రధాన కారణం.

6. రక్తపోటును తగ్గిస్తుంది

6. రక్తపోటును తగ్గిస్తుంది

హైపర్ టెన్షన్ ను అధిక రక్తపోటుగా కూడా పిలుస్తారు. ఆహార ప్రణాళికలో మొక్క-ఆధారిత ఆహారాన్ని చేర్చడం ద్వారా తగ్గించవచ్చు. పరిశోధనలలో, కూరగాయలు మరియు పండ్లతో అధికంగా ఉండే ఆహారం రక్తపోటుని క్రమబద్దీకరించగలదని తేల్చాయి. మరియు మాంసాహారాన్ని వీడి శాకాహారం వైపుకు మొగ్గు చూపిన వారిలో అధికశాతం రక్తపోటు నుండి బయటపడగలిగారని కూడా తేలింది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు స్ట్రోక్ లేదా గుండె సంబంధిత సమస్యలను అధికంగా కలిగి ఉంటారు.

ఆరోగ్యకరమైన గుండె కోసం రోజులో ఎన్ని పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి?

రోజుకు 8 లేదా అంతకన్నా ఎక్కువ పండ్లు మరియు కూరగాయలు తీసుకున్న ఎడల గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదం 30 శాతం తగ్గుతుంది. పోషకాలు మరియు అనామ్లజనకాల కూడిన మొక్క ఆధారిత శాకాహార పదార్ధాలు శారీరిక ఆరోగ్యమే కాకుండా, మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇవ్వగలవు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆరోగ్య సంబంధ విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

English summary

6 Health Benefits Of Eating A Plant-based Diet

As there is a rising awareness about animal cruelty and to stop killing them to consume their meat, more and more people are shifting to a plant-based diet because it has several health benefits and also going green will keep your heart healthy.Though the plant-based diet still remains unfamiliar with a vast majority of people across the globe due to issues of access and availability, celebrities have been endorsing the vegan diet or plant-based diet and have promised to cut meat and dairy products from their meals.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more