For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాల్నట్ ఆయిల్ వల్ల కలిగే 7 రకాల ఆరోగ్య ప్రయోజనాలు !

|

వాల్నట్ ఆయిల్ (నూనె) అనేది వాల్నట్ (అక్రోటు) నుండి సేకరించబడుతుంది; దీనిని శాస్త్రీయ భాషలో "జుగ్లాన్స్ రెజియా" అని పిలుస్తారు - దాని ఉపరితల రూపం అనేది, మానవ మెదడును పోలి ఉండే గింజలా కనపడుతుంది. 'ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను' కలిగి ఉన్న ఆరోగ్యకరమైన గింజలలో ఒకటిగా ఉంటూ, అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ నూనెలో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు మినరల్స్ (ఖనిజాలు) అనేవి సమృద్ధిగా ఉంటాయి, మరియు ఈ నూనెను అనేక రకాల ప్రయోజనాల కోసం పురాతన కాలం నుంచి వినియోగిస్తున్నారు. ఈ వాల్నట్ ఆయిల్ ను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు, ముఖ్యంగా ఇది చర్మము మరియు జుట్టుతో సహా మన శరీర ఆరోగ్యమంతటికీ అద్భుతమైన ప్రయోజనాలను కలిగజేస్తుంది.

7 Health Benefits Of Walnut Oil

ఈ అద్భుతమైన నూనె, వినియోగదారులకు శ్రేయస్సును మాత్రమే కలుగజేయకుండా, అనేక ఆరోగ్య సమస్యలను కూడా పరిష్కరించడానికి చాలా సహాయపడుతుంది.

ఈ నూనెను వంటలోనూ మరియు వెలుపల (బయట) వైపు కూడా ఉపయోగించవచ్చు, దీనిని సలాడ్ పై కూడా నేరుగా వెదజల్లి ఉపయోగించుకోవచ్చు.

శక్తివంతమైనదిగానూ, ఆరోగ్యాన్ని పెంపొందించేదిగానూ ఉన్న వాల్నట్ ఆయిల్ కలుగజేసే ఇతర ప్రయోజనాలను కొన్నింటిని ఇక్కడ చూద్దాం.

1. వ్యాధుల చికిత్సకు మరియు నివారణకు :

1. వ్యాధుల చికిత్సకు మరియు నివారణకు :

ఈ నూనె మన శరీరములో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలను పరిశీలించడానికి మరియు, వాటి యొక్క స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది. వాల్నట్ ఆయిల్ ఉపయోగించటం వల్ల గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇది రక్త నాళాల యొక్క మొత్తం పనితీరును మెరుగుపరుస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఆస్త్మా, తామర మరియు కీళ్ళనొప్పులు వంటి వ్యాధుల చికిత్సలోనూ వాల్నట్ ఆయిల్ చాలా ఉపయోగకరంగా ఉంటూ, మరోపక్క జీర్ణ సమస్యలకు ఉపశమనమును కలిగిస్తుంది.

ఇది ప్రేగులలోని ఉన్న వ్యర్థాన్ని బయటకి పంపి, మీ ప్రేగులు ఖాళీ అయ్యేటట్లుగా ప్రోత్సహించే ఒక విరేచనకారిగా పనిచేస్తుంది. వాల్నట్ నూనె అనేది ఒక యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఫంగల్ మరియు యాంటి-సెప్టిక్ వంటి గుణములను కలిగినదిగా ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లుగా పరిగణించబడే తామర, మొలగజ్జి, దురదలు మరియు పాదాలకు ఫంగస్ పట్టడం వంటి శిలీంధ్ర లక్షణాల వల్ల కలిగే సమస్యలను నివారించేందుకు ఈ నూనెను ఉపయోగించవచ్చు.

ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మరియు గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వాల్నట్ ఆయిల్ తో మర్దనా చేయడం వల్ల కండరాలు మరియు కీళ్ళ నొప్పుల నుండి మంచి ఉపశమనమును కలిగిస్తుంది.

2. ఆలోచనా శక్తిని పెంచుతుంది :

2. ఆలోచనా శక్తిని పెంచుతుంది :

వాల్నట్ ఆయిల్, మన మెదడు యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది. మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షించే గింజల జాబితాలో "వాల్నట్" ప్రథమ స్థానంలో ఉన్నది. ఈ వాలెట్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల మెదడు యొక్క వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తూ, మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది మరియు దాని యొక్క జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో బాగా ఉపయోగపడుతుంది. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు మరియు ఇతర జ్ఞాపకశక్తికి సంబంధించి ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

3. బరువు తగ్గటానికి :

3. బరువు తగ్గటానికి :

మీరు మీ కడుపు చుట్టూ వున్న కొవ్వును తగ్గించటానికి బాగా కష్టపడుతున్నట్లయితే, వాల్నట్ ఆయిల్ను కూడా మీ జాబితాలోనికి చేర్చుకోవాలి. వాల్నట్ ఆయిల్ మీ కడుపు చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు మీ నాభిని మరింత అందంగా తయారు చేస్తుంది. ఆ తర్వాత, ఈ అద్భుతమైన నూనెను మీ వ్యాయామములోనూ మరియు తీసుకునే ఆహారంలోనూ ఒక భాగంగా చేసుకోవడం వల్ల, మీ పొట్ట భాగంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించటంలో బాగా సహాయపడుతుంది.

4. మచ్చలు లేని ప్రకాశవంతమైన చర్మం కోసం :

4. మచ్చలు లేని ప్రకాశవంతమైన చర్మం కోసం :

వాల్నట్ ఆయిల్ అనేది మన చర్మంపైన చాలా అద్భుతాలను చేస్తుంటుంది. వాల్నట్ ఆయిల్ అనేది చర్మ కణాలను ఉత్పత్తి చెయ్యటంలోనూ మరియు టోనర్గా కూడా ఉపయోగించబడుతుంది. ఈ నూనెను తరచుగా కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలను పోగట్టడానికి, కళ్ళలో ఉన్న నిస్తేజాన్ని మరియు వాపులను పోగొట్టడానికి ఉపయోగిస్తారు. ఈ నూనెను కళ్ల చుట్టూ ఉన్న ముడతలను తగ్గించడానికే కాకుండా, కంటి సౌందర్యానికి ఆటంకాలుగా ఉన్న ఇతర సమస్యలను నివారించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఈ నూనె, బయట పరిస్థితుల వల్ల పొడిగా మారిన మీ చర్మాన్ని బాగా శుభ్రపరచి, మరింత కాంతివంతంగా చెయ్యటంలో మీకు బాగా దోహదపడుతుంది. చర్మం పై నెలకొన్న మచ్చలను నివారించడానికి మరియు చర్మానికి కావల్సినంత పోషణను అందించి చర్మాన్ని తేమగా ఉంచడానికి ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, అకాలంగా వచ్చే వృద్ధాప్య ఛాయల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ఈ నూనె కూడా చర్మరోగాలైన సోరియాసిస్ మరియు తామర వంటి వాటికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

5. నిగనిగలాడే ఆరోగ్యకరమైన జుట్టు కోసం :

5. నిగనిగలాడే ఆరోగ్యకరమైన జుట్టు కోసం :

వాల్నట్ అయిల్ను జుట్టు సమస్యల కోసం కూడా ఉపయోగిస్తారు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను గొప్ప స్థాయిలో కలిగి ఉన్న ఈ వాల్నట్ ఆయిల్, శరీర కణాలకు నష్టాన్ని చేకూర్చే అవాంతరాలను నిరోధిస్తుంది, తద్వారా జుట్టుకు నష్టం వాటిల్లకుండా ఎదుర్కోవటానికి బాగా సహాయపడుతుంది. ఇది తలపై చర్మానికి సరైన పోషణను అందించడమే కాకుండా, మచ్చలను మరియు చుండ్రును నిరోధించడంలోనూ సహాయపడుతుంది. ఈ నూనెను ప్రతిరోజూ ఉపయోగించటం వల్ల ఆరోగ్యవంతమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వాల్నట్ అయిల్ను వాడకం వల్ల మీకు మరింత మృదువైన మరియు మెరిసే జుట్టును ఇస్తుంది.

6. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది :

6. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది :

ఈ వాల్నట్ ఆయిల్, ఒత్తిడి మరియు ఆందోళన వంటి లక్షణాలతో పోరాటం చేసి, మానసిక ఒత్తిడిని దూరం చెయ్యటంలో అనేకమందికి సహాయపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి మరియు క్రమరహితమైన నిద్రతో బాధపడుతున్నవారికి నివారణ చికిత్సను అందించే మంచి నిద్రను పెంపొందించటంలో ప్రోత్సహిస్తుంది. ఈ నూనె మెలటోనిన్ అనే గుణాన్ని కలిగి ఉంది, ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తూ, దానిని అలానే నియంత్రిస్తుంది.

7. వృద్ధాప్య వ్యతిరేక గుణాలను కలిగి ఉంది :

7. వృద్ధాప్య వ్యతిరేక గుణాలను కలిగి ఉంది :

వాల్నట్ ఆయిల్లో వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ నూనె మంచి యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంది,కావున ఇది వృద్ధాప్య ఛాయలతో బాగా పోరాడటానికి సహాయపడుతుంది. శరీర కణాలను నష్టపరచి మరియు వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే రాడికల్స్ యొక్క ప్రతికూల ప్రభావాలను, ఈ వాల్నట్ ఆయిల్ లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు సమర్థవంతంగా ఎదుర్కోగలవు.

అటువంటి అద్భుత ప్రయోజనాలను కలిగి ఉన్న ఈ వాల్నట్ ఆయిల్ను మీ వస్తువుల జాబితాలో తప్పనిసరిగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.

English summary

7 Health Benefits Of Walnut Oil

Walnuts are a very good source of omega-3 fatty acids. Walnut oil has numerous benefits for the skin, hair and health as well. Have a look at the health benefits of walnut oil.
Story first published:Tuesday, January 30, 2018, 17:51 [IST]
Desktop Bottom Promotion