Just In
- 5 hrs ago
పురుషుల్లో ప్రారంభంలోనే స్ఖలనం? నయం చేయడానికి చిట్కాలు!
- 7 hrs ago
అత్యాచారానికి పాల్పడిన వారిపై అత్యంత క్రూరమైన శిక్షలు వేసే దేశాలివే..
- 8 hrs ago
మీరు ఎంత టెన్షన్ లో ఉన్నా..వీటిలో ఒక్కటి తినండి చాలు..మీ టెన్షన్ మాయం..!!
- 9 hrs ago
వివాహానికి ముందు ఈ చిట్కాలు పాటించండి... ఒత్తిడికి గుడ్ బై చెప్పండి...
Don't Miss
- News
Disha case encounter: అందుకే ఎన్కౌంటర్ చేయగలిగారు: ఆయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు
- Sports
తొలి టీ20 టీమిండియాదే: కోహ్లీ 94 నాటౌట్, మూడు టీ20ల సిరిస్లో 1-0 ఆధిక్యం
- Finance
కుబేరులనూ వదలని ఆర్థిక మాంద్యం: బిజినెస్ జెట్స్ కు గుడ్ బై!
- Movies
అలాంటి కామెంట్లు పెట్టారో అంతే సంగతి.. వారికి థ్యాంక్స్ చెప్పిన అనసూయ, చిన్మయి
- Technology
5జీ కోసం జియో,ఫ్లిప్కార్ట్,అమెజాన్లతో జట్టుకట్టిన క్వాల్కామ్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సూచించబడిన 8 ఉత్తమ ఆహార ప్రణాళికలు
కొలెస్ట్రాల్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది –LDL మరియు HDL కొలెస్ట్రాల్. అధిక LDL(చెడు) కొలెస్ట్రాల్, ధమని గోడలలో కొలెస్ట్రాల్ నిల్వలను పెంచుతుంది. అథెరోస్క్లెరోటిక్ ఫలకాలు మరియు HDL(మంచి) కొలెస్ట్రాల్ శరీరంలోని ఇతర భాగాల నుండి కాలేయానికి కొలెస్ట్రాల్ను తరలిస్తుంది, క్రమంగా ఇది శరీరం నుంచి ప్రేగుల ద్వారా తొలగించబడుతుంది. ఈవ్యాసంలో, అధిక కొలెస్టరాల్ సమస్యను ఎదుర్కొనడానికి సూచించబడిన ఉత్తమమైన ఆహారప్రణాళికల గురించి పొందుపరుస్తున్నాము.
అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి ? ఇది అన్ని జంతువుల కణాల ద్వారా తయారైన లిపిడ్ రకం(లిపిడ్ ప్రొఫైల్). ప్రధానంగా కణత్వచ నిర్మాణాత్మక సమగ్రతను కాపాడేందుకు, మరియు నీటిసాంద్రతను పెంచుటకు అవసరమైన, ముఖ్యమైన భాగంగా కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇక్కడ కొవ్వును కాలేయం ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా హార్మోన్లు, పైత్యరసం మరియు విటమిన్-డి ఉత్పత్తిలో కూడా కాలేయం కీలకపాత్ర పోషిస్తుంది.
మీరు ఆహారపదార్ధాల నుండి అదనపు కొలెస్ట్రాల్ సంగ్రహిస్తున్న ఎడల, మీ శరీరం సహజంగానే ఆ అదనపు కొలెస్ట్రాల్ మొత్తాలను తగ్గించడం ద్వారా జీవక్రియలను క్రమబద్దీకరిస్తుంది. అదేవిధంగా, మీరు తక్కువ కొలెస్ట్రాల్ తీసుకుంటున్న ఎడల, మీ శరీరం మరికొంత అదనపు కొలెస్ట్రాల్ ఉత్పత్తికి పూనుకుంటుంది.
కానీ, కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది? మీ శరీరం బరువు పెరుగుతుంది మరియు కరోనరీ-ఆర్టరీ వ్యాధితో సహా పలువ్యాధులకు కారణంగా పరిణమిస్తుంది.
కావున, కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి మరియు అదనపు బరువును కోల్పోవడానికి మీరు అనుసరించవలసిన ఉత్తమ ఆహార ప్రణాళికలను ఇక్కడ పొందుపరచబడ్డాయి.

1. మెడిటెర్రానియన్ ఆహార ప్రణాళిక :
మీరు ఆహార ప్రణాళికల గురించి తరచుగా వింటున్న వారైతే మెడిటెర్రానియన్ ఆహార ప్రణాళికకు పెరుగుతున్న ప్రజాదరణ గురించి వినే ఉంటారు. ఈ ఆహార ప్రణాళిక పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కాయలు మరియు చిక్కుళ్ళు వంటి మొక్క-ఆధారిత ఆహార పదార్ధాలతో పుష్కలంగా నిండి ఉంటుంది. ఇది ఆలివ్ నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో వెన్నని భర్తీ చేస్తుంది, ఉప్పుకు బదులుగా ఆహారానికి సువాసన జోడించడం కోసం మూలికలు మరియు సుగంధద్రవ్యాలను ఉపయోగించడం జరుగుతుంది. మరియు రెడ్ మీట్ పరిమితంగా వినియోగించబడుతుంది.
శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, ఈ ఆహార ప్రణాళిక మీ హృదయ ఆరోగ్యానికి ముఖ్యంగా సూచించబడుతుంది. మరియు అనేక మంది వైద్యులు దీనిని అధిక కొలెస్ట్రాల్ కలిగిన వ్యక్తులకు ఆహార ప్రణాళికగా సూచిస్తుంటారు కూడా. ఈ ప్రణాళిక ఎటువంటి దుష్ప్రభావాలను కలిగి ఉండకపోగా, రుచికరంగా కూడా ఉంటుంది.

2. డాష్ డైట్ :
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, డాష్ ఆహార ప్రణాళిక, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు, రక్తపోటును సైతం తగ్గిస్తుందని నిరూపించబడింది. మరియు ఇది మీ గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఈ ఆహార ప్రణాళికలో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, తక్కువ కొవ్వు గల పాల ఉత్పత్తులు, లీన్ మాంసాలు, కొవ్వు తొలగించిన లేదా కొవ్వు లేని చేపలు, రెడ్ మీట్ వంటివి ఉంటాయి.
ఈ ఆహార ప్రణాళిక వేగంగా పని చేస్తుంది కూడా.

3. శాఖాహార ఆహార ప్రణాళిక :
శాఖాహార లేదా వేగన్ ఆహార ప్రణాళికను సాధారణంగానే అనేక మంది ప్రముఖులు సైతం అనుసరిస్తుంటారు. దీనికి కారణం ఈ ఆహార ప్రణాళికలో ఉండే మొక్క-ఆధారిత ఆహారాల కారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుముఖం పట్టడమే కాకుండా, అనేక రకాలుగా మీ శరీరానికి ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ ఆహార ప్రణాళికలో మాంసం, గుడ్లు మరియు పాల ఉత్పత్తులను మినహాయించి, అన్ని రకాల శాకాహార పదార్ధాలను తీసుకోవడం జరుగుతుంది.
శాకాహారులు మాంసాహారులతో పోల్చినప్పుడు, తక్కువ సంఖ్యలో రక్తపోటు మరియు హృదయ సంబంధిత వ్యాధులను కలిగి ఉన్నారని అనేక అధ్యయనాలు సైతం సూచిస్తున్నాయి, ఎందుకంటే సంతృప్త కొవ్వులు లేదా కొలెస్ట్రాల్ ఈ ఆహార ప్రణాళికలో ఉండదు కాబట్టి.
Most Read: విరాట్ కోహ్లీ శాకాహారిగా మారాడు. శాకాహారిగా మారడం వలన కలిగే ప్రయోజనాలేమిటి?

4. TLC (థెరపాటిక్ లైఫ్స్టైల్ చేంజెస్) డైట్ :
ఆహారం, శారీరక శ్రమ మరియు బరువు నిర్వహణ ఆధారితంగా నిర్ధారించబడిన మూడు అంశాల ప్రణాళిక ఈ TLC ఆహార ప్రణాళిక. ఈ ఆహార ప్రణాళిక ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారికి 20 నుండి 30 శాతం వరకు తగ్గిస్తుంది. TLC డైట్, కొవ్వు నుండి శరీరం సంగ్రహించే కేలరీల శాతాన్ని పరిమితం చేయడమే కాకుండా, సోడియం మరియు ఆహారంలో కొలెస్ట్రాల్ మొత్తాలను కూడా పరిమితం చేస్తుంది.

5. మాయో క్లినిక్ డైట్ :
మాయో క్లినిక్ ఆహార ప్రణాళిక, మిమ్ములను పండ్లు మరియు కూరగాయల మీద ప్రధానంగా దృష్టి సారించేలా చేస్తుంది. క్రమంగా పోషకాహారంతో కూడిన, సమతుల్య ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. అనగా, మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు, చేపలు, గింజలు మరియు ఆలివ్ నూనెలను జోడించడం జరుగుతుంది. ఈ ఆహార ప్రణాళికలో వ్యాయామం కూడా ఒక భాగంగా ఉంటుంది.

6. ఫ్లెక్సిటేరియన్ డైట్ :
ఫ్లెక్సిటేరియన్ ఆహార ప్రణాళిక, ఆహారంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఈ ఆహార ప్రణాళిక ఒక శాఖాహార ఆహార ప్రణాళికను పోలి ఉంటుంది, కానీ ఇందులో మాంసం తినడానికి అనుమతి ఉంటుంది. అందుకే దీనికి ఫ్లెక్సిటేరియన్ ప్రణాళిక అని పిలుస్తారు. ఈ ఆహార ప్రణాళిక పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, చిక్కుళ్ళు మరియు లీన్ ప్రోటీన్ల కలయికగా ఉంటుంది. కూరగాయలు, మరియు లెగ్యూమ్స్ లో ఉన్న డైల్యూటెడ్ ఫైబర్, సహజంగానే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

7. వెయిట్ వాచర్స్ ఆహార ప్రణాళిక :
కొలెస్ట్రాల్ తగ్గించడం మరియు బరువును నిర్వహించాలనుకునే వారికి ఈ ఆహార ప్రణాళిక గొప్పదిగా సూచించబడుతుంది. వెయిట్ వాచర్స్ ఆహార ప్రణాళికను సమతుల్య ఆహార ప్రణాళికగా పరిగణిస్తారు, ఇది మీకు సంతృప్తికరమైన ఆహారాన్ని అందివ్వడమే కాకుండా, పూర్తిగా కడుపు నిండిన అనుభూతికి లోనుచేస్తుంది. క్రమంగా మీరు ఈ ఆహార ప్రణాళికకు కట్టుబడి ఉండేలా చేస్తుంది. ఈ ఆహార ప్రణాళికలో, స్కిన్లెస్ చికెన్ బ్రెస్ట్, బీన్స్, గుడ్లు మరియు చేపలు, మరియు తక్కువ కార్బోహైడ్రేట్లు మరియు క్రొవ్వు పదార్ధాలు కలిగిన ఆహార పదార్ధాలు ఉంటాయి.

8. డీన్ ఆర్నిష్ డైట్ :
డీన్ ఆర్నిష్ ఆహారప్రణాళికలో, బీన్స్, చిక్కుళ్ళు, పండ్లు, ధాన్యాలు మరియు కూరగాయలు మరియు తక్కువ కొవ్వు కలిగిన పాలఉత్పత్తులు ఉంటాయి. మీ కేలరీల్లో 10శాతం మాత్రమే కొవ్వు నుండి తీసుకోవాలి. ఈ ఆహారప్రణాళికకు డాక్టర్ ఓర్నిష్ మరియు అతని పరిశోధనల ఆధారితంగా పేరు పెట్టబడినది. మరియు మొక్క ఆధారిత ఆహారాలు కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా హృద్రోగాలు తగ్గుతాయని చెప్పబడింది.