For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకో కోడిగుడ్డు తినేవారిలో గుండె వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది

రోజుకో కోడిగుడ్డు తినేవారిలో గుండె వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది

|

ప్రతి రోజూ కోడిగుడ్డును తీసుకునేవారిలో (రోజుకి ఒక గుడ్డు) హీమొరాజిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 26 శాతం తక్కువవుతుంది. అలాగే హీమొరాజిక్ స్ట్రోక్ తో మరణం సంభవించే ప్రమాదం 28 శాతం తగ్గుతుంది. కార్డియోవాస్క్యూలర్ డిసీజ్ బారిన పడి మరణించే ప్రమాదం 18 శాతం తక్కువని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

గుడ్డులోని హై కొలెస్ట్రాల్ కంటెంట్ వలన గుడ్లను తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిది కాదేమోనని మీరు ఇప్పటి వరకు భావిస్తున్నట్టయితే మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన సమయమిది. ప్రతి రోజూ ఒక గుడ్డును తీసుకుంటున్న వారిలో గుండెవ్యాధులకు గురయ్యే ప్రమాదం గణనీయంగా తగ్గుతోంది.

An egg a day may keep heart diseases away

గుడ్డును తీసుకోవడం వలన కార్డియాక్ ఈవెంట్ రేట్స్ తగ్గుతాయని ఈ రెండిటి మధ్య అనుసంధానం ఉందని ప్రస్తుత అధ్యయనం స్పష్టం చేస్తోందని అధ్యయన రచయితలూ తెలుపుతున్నారు.

గుడ్డులో డైటరీ కొలెస్ట్రాల్ సమృద్ధిగా లభిస్తుంది

గుడ్డులో డైటరీ కొలెస్ట్రాల్ సమృద్ధిగా లభిస్తుంది

గుడ్డులో డైటరీ కొలెస్ట్రాల్ సమృద్ధిగా లభిస్తుందని అలాగే హై క్వాలిటీ ప్రోటీన్ కూడా లభిస్తుందని, వీటితో పాటు విటమిన్స్ మరియు ఫోస్ఫోలిపిడ్స్ మరియు కెరోటినాయిడ్స్ వంటి బయో యాక్టివ్ కాంపోనెంట్స్ పుష్కలంగా లభిస్తాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

కార్డియోవాస్క్యూలర్ డిసీజ్

కార్డియోవాస్క్యూలర్ డిసీజ్

కార్డియోవాస్క్యూలర్ డిసీజ్ వలన మరణంతో పాటు వైకల్యం సంభవించే ప్రమాదం ఉందని, ముఖ్యంగా ఇస్చేమిక్ హార్ట్ డిసీజ్ మరియు స్ట్రోక్ (హీమొరాజిక్ మరియు ఇస్చేమిక్ స్ట్రోక్) తో ఈ ప్రమాదాలు ఎక్కువని తెలుస్తోంది.

జర్నల్ హార్ట్ లో ప్రచురితమైన అధ్యయనం

జర్నల్ హార్ట్ లో ప్రచురితమైన అధ్యయనం

జర్నల్ హార్ట్ లో ప్రచురితమైన అధ్యయనం కోసం బీజింగ్ లోని పేకింగ్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ కి చెందిన చెంక్సీ కిన్ మరియు అతని కొలీగ్స్ గుడ్డుని రోజూ తీసుకోవడానికి గుండె వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి గల సంబంధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ విషయాల్ని ఈ జర్నల్ లో పొందుబరచారు. గుడ్డుని రోజూ తీసుకోవడం వలన కార్డియోవాస్క్యూలర్ వ్యాధులు, ఇస్చేమిక్ హార్ట్ డిసీజ్, ప్రాణాపాయ కొరోనరీ ఈవెంట్స్, హీమొరాజిక్ స్ట్రోక్ మరియు ఇస్చేమిక్ స్ట్రోక్ ల బారిన పడే ప్రమాదం తగ్గడానికి మధ్యనున్న అనుసంధానం గురించి వీరు అధ్యయనం చేశారు.

చైనా కదూరీ బయో బ్యాంక్

చైనా కదూరీ బయో బ్యాంక్

చైనా కదూరీ బయో బ్యాంక్ (CKB) కి చెందిన డేటాను వీరు పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో చైనాలో వివిధ భౌగోళిక ప్రాంతాలలో నివసించే దాదాపు ఐదు లక్షల మంది (512,891 ) 30 నుంచి 79 ఏళ్ళ వయసున్న వారిని పరిగణలోకి తీసుకున్నారు.

ప్రయర్ క్యాన్సర్, కార్డియోవాస్క్యూలర్ డిసీజ్ (CVD) మరియు డయాబెటిస్ వంటి సమస్యలు లేని 416,213 పార్టిసిపెంట్లపై పరిశోధకులు దృష్టిపెట్టారు.

గుడ్లను తీసుకోని వారితో రోజూ గుడ్డును తీసుకుంటున్న

గుడ్లను తీసుకోని వారితో రోజూ గుడ్డును తీసుకుంటున్న

గుడ్లను తీసుకోని వారితో రోజూ గుడ్డును తీసుకుంటున్న వారిని పోల్చుతూ రూపొందించబడిన అనాలిసిస్ లో గుడ్డును రోజూ తీసుకోవడం ద్వారా గుండె వ్యాధుల బారిన పడే ప్రమాదం కొంతవరకూ తగ్గించుకోవచ్చని తేలింది.

ముఖ్యంగా, ప్రతి రోజూ కోడిగుడ్డును తీసుకునేవారిలో

ముఖ్యంగా, ప్రతి రోజూ కోడిగుడ్డును తీసుకునేవారిలో

ముఖ్యంగా, ప్రతి రోజూ కోడిగుడ్డును తీసుకునేవారిలో (రోజుకి ఒక గుడ్డు) హీమొరాజిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 26 శాతం తక్కువ. అలాగే హీమొరాజిక్ స్ట్రోక్ తో మరణం సంభవించే ప్రమాదం 28 శాతం తక్కువ. కార్డియోవాస్క్యూలర్ డిసీజ్ బారిన పడి మరణించే ప్రమాదం 18 శాతం తక్కువని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

గుడ్డును రోజూ తీసుకునే వారిలో

గుడ్డును రోజూ తీసుకునే వారిలో

అంతేకాక, గుడ్డును రోజూ తీసుకునే వారిలో ఇస్చేమిక్ హార్ట్ డిసీజ్ బారిన పడే ప్రమాదం గుడ్డును అస్సలు ముట్టుకొని వారి కంటే లేదా తక్కువగా గుడ్డును తీసుకునే వారి కంటే 12 శాతము తగ్గుతుందని తేలింది.

ఇది అబ్సర్వేషనల్ స్టడీ మాత్రమే. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి స్పష్టమైన కంక్లూజన్ కు రాలేము. అయితే, అధ్యయనకర్తలు అన్ని విధాలా పరిశోధన చేసి తాము కనుగొన్న విషయాలను ఈ జర్నల్ లో పొందుబరచారు.

English summary

An egg a day may keep heart diseases away

Daily egg consumers (up to one egg per day) had a 26 per cent lower risk of haemorrhagic stroke, a 28 per cent lower risk of haemorrhagic stroke death and an 18 per cent lower risk of cardiovascular diseases death.If you thought eating eggs is bad for your heart due to their high cholesterol content, think again. A large study has now shown that people who consume an egg every day could significantly reduce their risk of cardiovascular diseases.
Story first published:Thursday, May 24, 2018, 11:22 [IST]
Desktop Bottom Promotion