For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గరం-మసాలా దినుసులు & వాటి ఆరోగ్య ప్రయోజనాలు !

గరం-మసాలా దినుసులు & వాటి ఆరోగ్య ప్రయోజనాలు !

|

భారతీయులు వండే అనేక వంటకాలలో మసాలా మిక్స్గా గరం-మసాలాను ఉపయోగిస్తారు. గరం మసాలా అనేది కొత్తిమీర, యాలకులు, జీలకర్ర, దాల్చినచెక్క, ఆవాలు, లవంగం, సోపు, మిరియాల & మెంతులు వంటి సుగంధ ద్రవ్యాల సమ్మేళనం. ఈ వ్యాసంలో, గరం మసాలా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గూర్చి మీరు తెలుసుకుంటారు.

ప్రత్యేకించి ఇంట్లో తయారుచేసే గరం మసాలా - దుకాణాలలో కొన్న గరం మసాలా కంటే ఎక్కువ రుచిని అందిస్తుంది. మీ వ్యక్తిగత రుచి & మీ నివాస ప్రాంతంలో లభించే సుగంధ ద్రవ్యాలపై ఆధారపడినందున గరం మసాలా తయారీకి సరైన పద్ధతి అంటూ ఏమీలేదు.

Garam Masala Ingredients & Their Health Benefits

ఆయుర్వేదం ప్రకారం, గరం మసాలా మన శరీరంలో వేడిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని ప్రత్యేకంగా పేరు పెట్టబడింది. సరైన మోతాదులో గరంమసాలాను కలిగి ఉండి మీకు బాగా వేడి చేసే ఆహారాలను నిర్ణీతలమైన మొత్తంలో తీసుకోవడం వల్ల అది మీ జీర్ణక్రియను సరిగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది.

గరం మసాలా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, మీరు మసాలలో వాడే దినుసుల వల్ల చేకూరే ఆరోగ్య ప్రయోజనాల ద్వారా చేకూరేవిగా ఉంటాయి.


గరం మసాలా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు మనము చూద్దాం.

1. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది :-

1. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది :-

గరం మసాలా శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది, తత్ఫలితంగా జీవక్రియను పెంచుతుంది. ఇది నెమ్మదించిన మీ జీర్ణ ప్రక్రియను నిరోధించడమే కాక శరీరంలో విష వ్యర్ధాల నిర్మాణాన్ని కూడా అడ్డుకుంటుంది. అంతేకాకుండా ఇది ఆకలిని ప్రేరేపిస్తుంది & త్వరగా జీర్ణమయ్యే శక్తిని కూడా కలిగిస్తుంది. గరం మసాలాలో ఉండే లవంగాలు & జీలకర్ర, అజీర్ణమును & అసిడిటీని మీకు దూరంగా ఉంచుతుంది. జీర్ణాశయాన్ని మెరుగుపరచడంలో సహాయపడే మిరియాలు & ఏలకులు గరంమసాలాలో వాడబడుతున్నాయి.

2. కొలెస్ట్రాల్ & బ్లడ్ షుగర్ను తగ్గిస్తుంది :-

2. కొలెస్ట్రాల్ & బ్లడ్ షుగర్ను తగ్గిస్తుంది :-

గరం మసాలాలో ఉపయోగించే లవంగాలు, మిరియాలు, ఏలకులు & దాల్చిన చెక్క వంటి పదార్ధాలు శరీరంలో ఉన్న చెడ్డ కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గిస్తాయి. దాల్చిన చెక్క, టైప్ 2 మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది, అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది & గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, వీటిలో యాంటీ క్యాన్సర్ లక్షణాలను కూడా కలిగి ఉంది. కొత్తిమీర కూడా రక్తంలో కొలెస్ట్రాల్ & చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

3. మలబద్దకమును నిరోధిస్తుంది :-

3. మలబద్దకమును నిరోధిస్తుంది :-

గరం మసాలా చేకూర్చే ప్రయోజనాల్లో ఒకటి మిమ్మల్ని మలబద్ధకం నుండి బయట పడేయడం. గరం మసాలాని తీసుకోవటం వల్ల సమర్థవంతమైన జీర్ణక్రియకు దారి తీస్తుంది, అంతిమంగా శరీరంలోని వ్యర్థాలను బయటకు తొలగించడానికి దారితీస్తుంది.

4. డయాబెటిస్తో పోరాడుతుంది :-

4. డయాబెటిస్తో పోరాడుతుంది :-

గరం మసాలాలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలుగచేసే దాల్చినచెక్కను కలిగి ఉంటుంది. ఈ మసాలా మధుమేహాన్ని సహజంగా నిర్మూలించేందుకు రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను సహజంగానే నియంత్రించే సామర్ధ్యమును కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి అవసరమైన ఇన్సులిన్ హార్మోన్ను మెరుగుపరుస్తుంది.

5. వాపులతో పోరాడుతుంది :-

5. వాపులతో పోరాడుతుంది :-

గరం మసాలా పొడిలో జీలకర్ర అనేది చాలా ముఖ్యమైన పదార్థాలలో ఒకటి. ఇది జీర్ణశక్తిని పెంచి, మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది & మీ హృదయ స్పందన రేటును క్రమబద్ధీకరించే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. జీలకర్రలో ఐరన్ కూడా సమృద్ధిగా లభించడం వల్ల మీ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.

6. జీవక్రియను పెంచుతుంది :-

6. జీవక్రియను పెంచుతుంది :-

గరం మసాలాలోని ఉండే పదార్థాలలో ఫైటో ట్యూయురెంట్స్లో పుష్కలంగా ఉంటాయి, ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. శరీర జీవక్రియను బాగా మెరుగుపరచడంలో మిరియాలు సహాయపడతాయి. గరంమసాలాలో ఉన్న అన్ని పదార్థాలు శరీరంలో ఉన్న వివిధ అవయవాల పనితీరును వృద్ధి చేయడంలో కూడా బాధ్యతగా ఉంటాయి.

7. నోటి దుర్వాసనను తొలగించి - దంతాలను బలపరుస్తుంది :-

7. నోటి దుర్వాసనను తొలగించి - దంతాలను బలపరుస్తుంది :-

గరం మసాలాలో ఉన్న లవంగాలు మరియు ఏలకులు చెడ్డ శ్వాసతో పోరాడడంలో చాలా ప్రభావవంతమైనవి పనిచేస్తాయి. దంతక్షయం మరియు ఇతర పంటి సమస్యలకు వచ్చినప్పుడు లవంగాలు ఉత్తమంగా పనిచేస్తుంటాయి. లవంగాలలో కాల్షియం, విటమిన్లు & ఒమేగా 6 కొవ్వు ఆమ్లాల వంటి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లకు మూలంగా ఉంది.

8. కడుపు ఉబ్బరాన్ని నివారిస్తుంది :-

8. కడుపు ఉబ్బరాన్ని నివారిస్తుంది :-

గరం మసాలా జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపు ఉబ్బరం, వికారం & అపానవాయువు వంటి సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది ఆహారనాళమును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

9. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది :-

9. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది :-

వయస్సు కారణంగా వచ్చే వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు గరంమసాలాలో ఉండే మిరియాలు & జీలకర్ర వంటి పదార్ధాలకు సహకరించినందుకు గానూ మనం ప్రత్యేకమైన కృతజ్ఞతలను వాటికి చెప్పాలి. మిరియాలలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్ & యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉన్న కారణంగా ఇవి అద్భుతమైన యాంటీ-ఏజింగ్లా పనిచేస్తూ మీకు మంచి ప్రయోజనాలను అందిస్తాయి.

మీ ఇంట్లోనే గరం మసాలాను ఎలా తయారు చేయాలి ?

మీ ఇంట్లోనే గరం మసాలాను ఎలా తయారు చేయాలి ?

ఇంత వరకూ మీరు గరంమసాలా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు గరంమసాలా తయారీ విధానాన్ని కూడా తెలుసుకోండి.

గరంమసాలా తయారీకి కావలసినవి :-

గరంమసాలా తయారీకి కావలసినవి :-

¼ కప్పు కొత్తిమీర విత్తనాలు

2 టేబుల్ స్పూన్ల మిరియాలు

2 టేబుల్ స్పూన్ల లవంగాలు

2 టేబుల్ స్పూన్ల ఏలకులు

1 టేబుల్ స్పూన్ జీలకర్ర

3-4 స్టార్ సొంపు

1-ఇంచ్ గల దాల్చిన చెక్క

2 పలావు ఆకులు

½ జాజికాయ

తయారీ విధానం:

తయారీ విధానం:

ఒక స్పిల్లెట్లో అన్ని సుగంధ ద్రవ్యాలను వేసి, వాటిని 5 నిమిషాలు బాగా వేపినట్లుగా కాల్చండి.

అలా వేయించిన పదార్థాలన్నింటిని పొడిగా అయ్యే వరకు అన్ని మసాలా దినుసులను ఒక మిక్సీలో బాగా గ్రైండ్ చేయాలి.

ఇప్పుడు, మీరు వంటలలో ఉపయోగించడం కోసం గరంమసాలా సిద్ధంగా ఉంది.

English summary

Garam Masala Ingredients & Their Health Benefits

Garam masala is a mix of spices like coriander, cardamom, cumin, cinnamon, mustard seeds, clove, fennel, peppercorns, and fenugreek. The health benefits of garam masala include delayed ageing, improved digestion, preventing constipation, fighting diabetes, boosting metabolism, lowering cholesterol and blood sugar etc.
Desktop Bottom Promotion