For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇందుకే, ఆవ గింజలను తినడం మంచిదని అంటారు!

|

ఆవగింజలను హిందీలో 'సార్సో' అని కూడా పిలుస్తారు ఇది సుమారుగా 5000 సంవత్సరాల క్రితం నుండి ఉన్నాయి. వీటిని ఎక్కువగా భారతీయ వంటకాలలో ఉపయోగిస్తారు. ఇది తెలుపు, నలుపు, గోధుమ రంగులలో మనకు అందుబాటులో ఉంది. ఈ వ్యాసంలో, ఆవగింజలను వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మేము రాశాము.

ఆవగింజలు ఘాటుతో పాటు వెచ్చని ఉష్ణమును కూడా కలిగి ఉంటాయి, వీటిని వంటకాలలో ఉపయోగించడం వల్ల వేరువేరు రుచులను కలిగిస్తాయి.

Health Benefits Of Chewing Raw Mustard Seeds

ఈ ఆవగింజలు మీ ఆరోగ్యానికి ఎందుకు మంచిది ?

ఇవి ఆరోగ్య ప్రోత్సాహకమైన గ్లూకోసినోలేట్ అనే సిద్ధమైన సమ్మేళనమును కలిగి ఉంటుంది, ఇది విత్తనాలు ఉన్న ఎంజైమ్ ద్వారా ఐసోథియోసైనేట్లోకి విచ్ఛిన్నమవుతుంది. ఈ సమ్మేళనాలు కఠినమైన రుచిని మనకు అందిస్తుంది. అంతేకాక, ఈ కాంపౌండ్స్ ముఖ్యంగా పెద్దప్రేగులో, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిలిపివేయవచ్చని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఈ ఆవగింజలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, సెలీనియం, మాంగనీస్, మెగ్నీషియం, విటమిన్ B1, ఫాస్పరస్, కాల్షియం, ప్రొటీన్, డైటరీ ఫైబర్ & జింక్ వంటి వాటికి అద్భుతమైన మూలముగా ఉంది.

ఆవగింజలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం !

1. మీ బరువును తగ్గిస్తుంది :-

1. మీ బరువును తగ్గిస్తుంది :-

మన బరువు తగ్గడానికి ఆవగింజలు చాలా మంచివి ఎందుకంటే, అవి తక్కువ కెలరీలను కలిగి ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ ఆవగింజలలో 32 కేలరీలను మాత్రమే కలిగి ఉంటుంది. ఇతర మసాలా దినుసుల కంటే వీటితోనే కొంచెం తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. 1 టేబుల్ స్పూన్లో సుమారు 1.8 గ్రాముల కార్బోహైడ్రేట్లను మాత్రమే కలి ఉంటాయి, ఇవి మీ బరువును తగ్గించడానికి బాగా ఉపయోగకరంగా ఉంటాయి.

2. సెలీనియం & మెగ్నీషియములు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలుగా పనిచేస్తాయి :-

2. సెలీనియం & మెగ్నీషియములు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలుగా పనిచేస్తాయి :-

ఆస్తమా & రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి తీవ్ర రుగ్మతలను తగ్గించడానికి ఈ పోషక పదార్ధం సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ గింజలలో ఉండే మెగ్నీషియం, రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది, మెనోపాజ్ మహిళల్లో సాధారణ నిద్రను తిరిగి ప్రేరేపిస్తుంది, మరియు పార్శ్వపు నొప్పి (మైగ్రేన్) యొక్క తీవ్రతను తగ్గిస్తుంది.

3. సోరియాసిస్ను నివారిస్తుంది :-

3. సోరియాసిస్ను నివారిస్తుంది :-

సోరియాసిస్ అనేది ఒక క్రిటికల్ ఇన్ఫ్లమేటరీ ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఆవగింజలు సోరియాసిస్కు సంబంధించిన మంట & గాయాలకు చికిత్స చేస్తాయి. ఈ గింజలతో మీరు వాడే మందులను తీసుకోవడం వల్ల సూపర్ ఆక్సైడ్ డిస్మ్యుటస్, గ్లూటాతియోన్ పెరాక్సిడేస్ & ఉత్ప్రేరకమైన ఎంజైములు సోరియాసిస్తో సహా ఏ అనారోగ్య కారకాల నుంచి రక్షణను అందివ్వడమే కాకుండా చికిత్సను కూడా చేస్తుంది.

 4. శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనం :-

4. శ్వాసకోశ వ్యాధుల నుండి ఉపశమనం :-

ఈ ఆవగింజల వల్ల కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే జలుబును & ఫ్లూ మీద ప్రభావాన్ని చూపుతుంది. ఈ గింజలు వాయునాళాలకు అడ్డుగా ఉన్న శ్లేష్మమును తొలగించడంలో సహాయపడుతుంది. ఒకవేళ మీరు శ్వాసకోశ సమస్యలను కలిగి ఉంటే, ఆవగింజలను నమలడం ద్వారా వెలువడే తాపము మీ సమస్యను వేగంగా నయం చేస్తుంది.

5. జీర్ణక్రియను పెంపొందిస్తుంది :-

5. జీర్ణక్రియను పెంపొందిస్తుంది :-

ఈ గింజలు ఫైబర్కు మంచి మూల వనరుగా ఉంది, ఇవి జీర్ణక్రియను & జీర్ణ-సంబంధిత సమస్యలను మెరుగుపరుస్తాయి. ఇందులో కరిగే గుణాన్ని కలిగి ఉన్న ఫైబర్ మీ ప్రేగుల కదలికలను మెరుగుపరచి మలబద్దక సమస్య నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచడమే కాకుండా మీ శరీర జీవక్రియ మొత్తమును పెంపొందిస్తుంది.

6. మెనోపోజల్ లక్షణాల నుండి ఉపశమనం :-

6. మెనోపోజల్ లక్షణాల నుండి ఉపశమనం :-

ఋతుస్రావం నిలిచిపోయిన సమయంలో ఆవగింజలను తినడం వల్ల మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఎముకలకు నష్టం వాటిల్లే అవకాశం సర్వసాధారణంగా ఉంటుంది. ఈ ఆవగింజలు, శరీరంలోని కాల్షియం & మెగ్నీషియం వంటివి వారిని నష్టపోనివ్వకుండా నిరోధించబడతాయి. కాల్షియం & మెగ్నీషియమ్ అనే ఈ రెండూ కూడా ఎముకలకు బలాన్ని & దృఢత్వాన్ని అందజేస్తుంది.

7. జీర్ణశయా క్యాన్సర్ను ఆడుకుంటుంది :-

7. జీర్ణశయా క్యాన్సర్ను ఆడుకుంటుంది :-

ఆవగింజలు ఎక్కువ మొత్తంలో గ్లూకోసినోలట్స్ & మైరోసినాస్ ఎంజైమ్లను కలిగి ఉంటుంది ఇవి గ్లూకోసినోలేట్లను ఐసోథియోసైనేట్స్లోకి విచ్ఛిన్నం చేస్తాయి. జీర్ణశయములో వాటిల్లే పెద్దప్రేగు క్యాన్సర్ను ఐసోథియోసైనేట్స్ నిరోధించగలదని ఒక పరిశోధనలో కనుగొనబడింది. ఈ ఐసోథియోసైనట్లు ఇప్పటికే ఉన్న క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుని & ఇటువంటి కణాల ఏర్పాటును పర్యవేక్షిస్తున్నట్లుగా కూడా నిరూపించబడ్డాయి.

8. వెన్నునొప్పిని తగ్గిస్తుంది :-

8. వెన్నునొప్పిని తగ్గిస్తుంది :-

మీరు వెన్నునొప్పి (లేదా) కండరాల నొప్పితో బాధపడుతున్నట్లయితే, ఆవాలను చప్పరించడం వల్ల మీకు వెంటనే ఉపశమనం కలిగించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. బిగుతుగా (లేదా) గాయముతో ఉన్న కండరాలను చికిత్స చేయడానికి మీరు ఈ ఆవగింజలను ఉపయోగించవచ్చు.

English summary

Health Benefits Of Chewing Raw Mustard Seeds

Mustard seeds are widely used in Indian cooking; it's available in white, brown and black varieties. These seeds are an excellent source of omega-3 fatty acids, selenium, manganese, magnesium, vitamin B1, phosphorous, calcium, zinc. Mustard seeds protect against cancer, treat respiratory problems, treat cold and flu, etc.
Story first published: Wednesday, August 8, 2018, 8:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more