For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నానబెట్టిన మెంతిగింజలు మీ ఆరోగ్యాన్ని ఏవిధంగా సంరక్షిస్తాయి ?

|

టాడ్కా అనే భారతీయ సంప్రదాయ కూరలో ఉపయోగించిన పదార్థాలలో మెంతిగింజలు కూడా ఉంటాయి. మంచి రుచిని కలిగి ఉన్న చాలా రకాల మసాలా దినుసులు కంటే ఇవి అతి తక్కువ రుచిని కలిగి ఉన్నందువల్ల చాలామంది వారి వంటకాలలో ఇవి ముఖ్యమైనవి కావని భావిస్తారు. కానీ ఈ మెంతిగింజలు మానవ శరీరానికి చాలా రకాల లాభాలను చేకూర్చగలదు.

ఈ మొక్కకు శాస్త్రీయంగా 'త్రిగోనెల్ల ఫూయమ్-గ్రేకుమ్' అనే పేరు ఉన్నది, త్రిగోనెల్ల అనే పదం పూల ఆకారంలో ఉన్న త్రిభుజాన్ని సూచిస్తుంది. మొక్కలలో ఎక్కువ భాగమును వంటలలోనూ (లేదా) గృహ నివారణ చిట్కాలలో ఉపయోగిస్తారు, ఈ వ్యాసం ప్రత్యేకంగా మెంతి గింజల ప్రయోజనాల గూర్చి మాట్లాడబడుతుంది.

మీరు చేయవలసినది ఏమిటంటే, రాత్రిపూట 2 -3 టీస్పూన్ల మెంతి గింజలను (విత్తనాలు) తీసుకొని, అరకప్పు నీటిలో వీటిని బాగా కలిపి, రాత్రంతా నానబేట్టేలా ఉంచండి. మరుసటి రోజు ఉదయం, మీరు ఈ విధంగా నానబెట్టిన గింజలను నమలవచ్చు (లేదా) అలా నానబెట్టిన నీటితోనే ఆ గింజలను మింగేయవచ్చు.

అంతేకాకుండా, మీరు అలా నానబెట్టిన నీటిని కూడా త్రాగటం వల్ల మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేయవచ్చు.

మీరు నానబెట్టిన మెంతిగింజలను తినాలనిపించినప్పుడు ముందురోజు రాత్రి వాటిని నానపెట్టడం మరిచిపోతే, మీరు ఏ మాత్రం బాధపడకండి. మరిగించిన ఒక కప్పు నీటిలో ఈ గింజలను 5 - 10 నిమిషాల వరకు నానబెట్టండి. ఇప్పుడు మీరు తినడానికి మెంతిగింజలు సిద్ధంగా ఉన్నాయి.

ఇలా నానబెట్టిన మెంతిగింజలను తినడం వల్ల, ఇవి మృదువుగా ఉండటం వల్ల సులభంగా జీవనం కాగలవు, అలాగే వాటిలో ఉన్న పోషకాలను కూడా మన శరీరం త్వరగా గ్రహించగలదు. వాటితోపాటుగా,

1. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది :

1. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది :

ఈ మెంతి గింజలు అన్ని రకాల జీర్ణ సమస్యలను అధిగమించగలదు. అంతేకాకుండా మీ ఆకలిని పెంచడానికి, మీ జీర్ణవ్యవస్థను పటిష్టం చేయడానికి సహాయపడుతుంది. వాటిలో ఉన్న ఫైబర్ కంటెంట్ మీ మలబద్ధకానికి చాలా మంచిది. డయేరియా వంటి సమస్యలను కూడా నివారించగలదు ఎందుకంటే, మెంతిగింజలలో ఉండే లక్షణాలు పాయువు నుంచి బయటకు పోయే అదనపు నీటిని అరికడతాయి.

వాటిలో ఉండే ఫైబర్ కంటెంట్లు అల్సర్, వాపులు, హార్ట్ బర్న్ వంటి సమస్యల నుంచి ప్రేగుల గోడల చుట్టూ ఉన్న రక్షిత పొరకు త్వరగా ఉపశమనాన్ని కలుగజేస్తాయి.

2. డయాబెటిస్ & కొలెస్ట్రాల్ :

2. డయాబెటిస్ & కొలెస్ట్రాల్ :

రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచేందుకు మెంతులు బాగా ఉపయోగపడతాయి (ముఖ్యంగా, స్వల్ప డయాబెటిస్ రోగులలో). ఇన్సులిన్ నిరోధకతపై ఇది బాగా పని చేస్తుంది, కొన్ని ఇతర పదార్ధాలతో కలిపి ఉన్నప్పుడు ఈ గింజలు మరింత బాగా పని చేస్తుంది. మీరు సరైన మోతాదును అనుకరించడం కోసం తక్షణమే డాక్టర్ను సంప్రదించాలి.

ఇది చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడం ద్వారా మీ కొవ్వు పదార్థాల స్థాయిలను మెరుగుపరుస్తుంది. వీటిలో ఉండే చోలిన్ అనే సమ్మేళనం, ధమనులలో చొరబడిన కొవ్వును తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

3. శరీర బరువును తగ్గిస్తుంది :

3. శరీర బరువును తగ్గిస్తుంది :

మీ జీర్ణక్రియను మెరుగుపరచటం, శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం వల్ల మీ శరీర బరువు తగ్గించే వీలును కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో చెప్పబడినట్లుగా, మెంతిగింజలు తాపన లక్షణాలను కలిగి ఉండటం వల్ల మీ శరీర బరువును తొందరగా కోల్పోయేందుకు సహాయపడుతుంది.

Most Read:భర్త సుఖం అందించడం లేదంది, నా పక్కన పడుకుంటానంది, రోజూ తనకు నచ్చినట్లుగా చేయించుకునేది #mystory235

4. వృద్ధాప్యం :

4. వృద్ధాప్యం :

మెంతిగింజలు ఆపేక్షిత అనామ్లజనకాలను కూడా కలిగి ఉంటాయి, ఇవి ఆక్సీకరణం ద్వారా కణాలకు మరియు కణజాలాలకు నష్టం వాటిల్లకుండా కాపాడతాయి తద్వారా, వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తాయి.

5. ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తుంది :

5. ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తుంది :

ఈ మెంతిగింజలు స్త్రీ, పురుషులిద్దరిలో కామేచ్ఛను పెంచుతుంది. ఇది ముఖ్యంగా పురుషులలో అకాల స్ఖలనం & తక్కువ సెక్స్ డ్రైవ్ వంటి వాటికి చికిత్సను అందించుటలో ఉపయోగిస్తారు. అలాగే మహిళలు ఉపయోగించే గర్భ నిరోధక సాధనాల వంటి ఉత్పత్తిలో మెంతులను అనేక ఔషధ సంస్థలు ఉపయోగిస్తున్నాయి.

ఎలాంటి రుజువులు లేనప్పటికీ కూడా, మెంతిగింజలు రొమ్ముల పెరుగుదలలో సహాయపడతాయి - స్త్రీలలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్గా ఉండేటటువంటి డయోజెన్జైన్ అనే పదార్థమును ప్రేరేపిస్తాయి. పాలిచ్చే తల్లులలో పాలు ఉత్పత్తిని పెంచడానికి కూడా ఈ మెంతులు బాగా ఉపయోగపడతాయి.

పిరియడ్స్ ముందుగా వచ్చే ప్రీ-మెన్స్ట్రల్ సిండ్రోమ్ లక్షణాలను అధిగమించడానికి, రక్త ప్రవాహాన్ని పెంచుతుంది మరియు పిరియడ్స్లో గర్భాశయ సంకోచాలను ప్రేరేపించడానికి పాలు & చెక్కరతో మెంతిగింజలను తీసుకోవడం మంచిదని ఆయుర్వేదంలో చెప్పబడింది.

6. చర్మం & జుట్టు :

6. చర్మం & జుట్టు :

మీ ముఖం & చర్మంపై మెంతిగింజలతో చేసిన ఫేస్ ప్యాక్ను అప్లై చేసుకోవచ్చు. ఈ మెంతిగింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి చర్మాన్ని శుభ్రపర్చడానికి మరియు ఉపశమనానికి అనుకూలంగా ఉంటాయి.

వాపులు, మంటలు, కాలిన గాయాలు, చర్మపు పూతలు & శోథ పరిస్థితుల కోసం, దూది పింజను వాడి మెంతి ముద్దను ఒక లేపనంగా ఉపయోగించవచ్చు. ఈ మెంతి ముద్ద మోటిమల చికిత్సలో కూడా బాగా ఉపయోగపడతాయి. అదనంగా చర్మంపై ఉత్పత్తయ్యే శ్లేష్మము & ధూళి చర్మ రంధ్రాలకు అడ్డుపడిన కారణంగా మొటిమలు ఏర్పడతాయి.

ఈ మెంతులలో సాల్సిలిక్ యాసిడ్ వంటి లక్షణాలను కలిగి ఉన్న కారణంగా, మీ చర్మంపై అట్టకట్టినట్టుగా ఉన్న వ్యర్ధాలను నివారించడంలో మీ చర్మానికి ఎలాంటి హాని వాటిల్లకుండా చూడగలదు.

ఈ మెంతులను పేస్ట్ రూపంలో తీసుకునేటప్పుడు, వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ పేస్టును చర్మంపై దరఖాస్తు చేసినప్పుడు లోలోపల నుంచి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఈ పేస్ట్ కు మరిన్ని పదార్థాలను జతచేసి హెయిర్ ప్యాక్గా ఉపయోగించేటప్పుడు చుండ్రును నివారించి, హెయిర్ ఫాల్ను చికిత్స చేయగలదు.

అలా ఈ మెంతిగింజలు లోలోపల నుండి మిమ్మల్ని బలోపేతం చేయడమే కాకుండా, బయట వైపు నుంచి మీ అందాన్ని సంరక్షించేదిగా పనిచేస్తుంది.

Most Read:చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే...

7. ఇతర ప్రయోజనాలు:

7. ఇతర ప్రయోజనాలు:

మీ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడమే కాకుండా, మీ ఆలోచనా శక్తి నశించకుండా చేయటంలో ఈ మెంతిగింజలు బాగా సహాయపడుతాయి. ఈ మెంతిగింజలను తేనె, పుదీనా, బాసెల్ & నిమ్మరసం వంటి పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనల నుంచి మీకు త్వరగా ఉపశమనమును కలగజేస్తుంది. ఈ మెంతిగింజలతో టీని తయారుచేసుకుని త్రాగటం వల్ల గొంతు మంట, గొంతు దురదలతో పోరాడే మిమ్మల్ని శాంత పరుస్తుంది.

ముఖ్యమైన గమనిక

ముఖ్యమైన గమనిక

ముందుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఏ మెంతిగింజలను ఉపయోగించడం వల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలను కలుగచేయగలవు. ఇవి నీటిని సంగ్రహించే లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి వీటిని మీరు ఉపయోగించిన తరువాత మిమ్మల్ని మీరు హైడ్రేట్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇవి శరీరంలో ఉన్న ఐరన్ను శోషించుగలవు కాబట్టి అనేమియా (రక్తహీనత) తో బాధపడే వ్యక్తులు వీటి వినియోగానికి దూరంగా ఉండాలి.

English summary

Methi Seed Benefits: 7 Ways How Soaked Fenugreek Seeds Boost Your Health

The traditional ingredients in an Indian curry tadka include an item called methi seeds. Although less known than mustard seeds, having a taste less pleasing than most spices, and also deemed by many people as a non-essential part of their recipes, methi or fenugreek seeds do have a lot of benefits for the human body.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more