For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తెలుసుకోవాల్సిన ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్లకి సంబంధించిన ఆరోగ్య రిస్క్ లు

|

ఇప్పుడు యువతరంలో ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్లు చాలా పాపులర్ అవుతున్నాయి. ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్లు బరువు తగ్గడానికి చాలా ప్రభావం చూపించే డైట్లుగా ప్రసిద్ధమయ్యాయి. ఈ డైట్లలో సాధారణంగా రోజూ తినాల్సిన మొత్తం క్యాలరీలలో 30 నుంచి 50శాతం వరకూ ప్రొటీన్ పదార్థాలనుంచే వస్తాయి.

ఈ రకపు డైట్లలో ప్రొటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలైన మాంసం, చేపలు, గుడ్లు, జున్ను ఇంకా పాల ఉత్పత్తులు మరియు కార్బొహైడ్రేట్లు ఉండని ఆహారపదార్థాలను వాడతారు.

The Health Risks Of A High-Protein Diet You Should Know

హై ప్రొటీన్ డైట్లు మీకు గుండె జబ్బులను తెచ్చిపెట్టి ప్రాణాంతకం కావచ్చు ఎందుకంటే మీరు ప్రొటీన్ ఎక్కువ ఉండే ఉన్న ఆహారపదార్థాలను తీసుకున్నప్పుడు గుండెపై వత్తిడి పడుతుంది. అలాగే మీ భోజనంలోంచి కార్బొహైడ్రేట్లను తీసేయడం వలన కూడా శరీరానికి శక్తి అందదు. ఎందుకంటే మీరు కేవలం ప్రొటీన్ ఎక్కువ ఉన్న ఆహారాన్నే తింటున్నారు కాబట్టి.

ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ వలన వచ్చే ఆరోగ్య రిస్క్ ల గురించి వివరంగా ఇక్కడ చదివి తెలుసుకోండి.

ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ అంటే ఏముంటాయి?

ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ అంటే ఏముంటాయి?

ఈ ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్, డ్యుకన్ డైట్ ఇంకా తక్కువ కార్బొహైడ్రేట్ డైట్ లకి సారూప్యంగానే ఉంటుంది. ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ లో మీరు ఆకలి ఎక్కువసమయం వేయకుండా కడుపు నింపే ప్రొటీన్ ఎక్కువ ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవచ్చు. అంటే మీ రోజువారీ క్యాలరీల భోజనంలో 20-25 శాతం ఆహారపదార్థాలు ఎక్కువ ప్రొటీన్ కలిగి ఉండాలి.

ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ వలన క్యాన్సర్ వస్తుందా?

ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ వలన క్యాన్సర్ వస్తుందా?

యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన పరిశోధనలో తేలింది ఏమంటే ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ పాటించే నడివయస్సు వారు తక్కువ ప్రొటీన్ తినేవారికంటే నాలుగు రెట్లు ఎక్కువగా క్యాన్సర్ బారినపడుతున్నారు. మీ ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ లో భాగంగా మీరు ఎర్ర మాంసాన్ని అదేపనిగా తింటే, మీకు క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతోందన్నట్లే.

బరువు తగ్గటానికి మంచిదా?

బరువు తగ్గటానికి మంచిదా?

ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ ల వలన కడుపు నిండుగా ఉండి ఆకలివేయదు కానీ మీరు ఇక క్రమంగా ఎక్కువ తినలేరు కూడా. పరిశోధనల ప్రకారం ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ పాటించేవారి మెదడుకి తక్కువ స్థాయిలో ఉన్న ఆకలి హార్మోన్లు మాత్రమే అందుతాయి, దానివలన మీకు ఆకలి వేయదు ఇంకా ఏమీ తినాలనిపించదు. ఇదే బరువు తగ్గినట్లు అన్పించే స్వల్పకాలిక ఫలితం.

ఇది అధిక కొలెస్ట్రాల్ ను పెంచగలదు

ఇది అధిక కొలెస్ట్రాల్ ను పెంచగలదు

కొన్ని ప్రొటీన్ పదార్థాలే అంటే మాంసంలో కొవ్వు భాగాలు, సంపూర్ణమైన పాల ఉత్పత్తులు ఇంకా ఇతర కొవ్వు పదార్థాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. ఇది గుండె జబ్బులు వచ్చే అవకాశాలను పెంచుతుంది. అందుకని మీరు ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ ను పాటిందాలి అనుకుంటే, ఇంకోసారి ఆలోచించండి.

అది ఆస్టియోపోరోసిస్ కు దారితీస్తుంది

అది ఆస్టియోపోరోసిస్ కు దారితీస్తుంది

మాంసం కూడా తినే ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ లో ముఖ్యంగా 65 ఏళ్ళు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలలో ఎముకల్లో సాంద్రత తీవ్రంగా తగ్గటానికి కారణమవుతుంది. మాంసం తినని స్త్రీలలో ఎముకల సాంద్రత తక్కువగా తగ్గుతుంది. ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ వలన శరీరం కాల్షియం పీల్చుకునే శక్తి తగ్గుతుంది, ఇది ఒక చెడ్డ దుష్ప్రభావం.

అది కిడ్నీ సమస్యలను కలిగిస్తుంది

అది కిడ్నీ సమస్యలను కలిగిస్తుంది

మీరు ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్లో ఉంటే మీ కిడ్నీలపై ఒత్తిడి పెరిగి వాటి పనితీరు దెబ్బతినవచ్చు. కిడ్నీలు ప్రొటీన్ ను వడబోయటం మొదలుపెడతాయి కాబట్టి ఈ పని కిడ్నీలపై అదనంగా మరింత వత్తిడిని, శ్రమను పెంచుతుంది.ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ ను పాటించే బాడీబిల్డర్లు అందుకే ఎక్కువగా కిడ్నీల పనితీరు సమస్యలతో బాధపడతారు.

అది డయాబెటిస్ ను కలిగిస్తుంది

అది డయాబెటిస్ ను కలిగిస్తుంది

మీరు ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ పాటించాలనుకుంటున్నారా? అయితే ఆగండి, ఇది చదవండి! ఎక్కువ ప్రొటీన్ ఉన్న ఆహారపదార్థాలు తినటం వలన డయాబెటిస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కార్బొహైడ్రేట్లు తినడం వలన మీ శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి డయాబెటిస్ కి దారితీస్తుంది.

ఇతర అనారోగ్య రిస్క్ లు

ఇతర అనారోగ్య రిస్క్ లు

ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ వలన కేవలం క్యాన్సర్, డయాబెటిస్ మాత్రమే రావు. అది గుండె కొట్టుకోవడంలో సమస్యను తెచ్చి గుండెజబ్బులకి, గుండెపోటు, స్ట్రోక్ కి కూడా దారితీయవచ్చు. ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ లో సాచ్యురేటడ్ కొవ్వు ఎక్కువగా ఉండటం వలన ఇతర దుష్ప్రభావాలైన వికారం, మలబద్ధకం, దుర్వాసన, అలసట కూడా వస్తాయి.

ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ లో ఇతర పదార్థాలను కూడా జత చేయండి

ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ లో ఇతర పదార్థాలను కూడా జత చేయండి

మంచి ఆరోగ్యకరమైన ప్రొటీన్లను ఎంచుకుని తినటం అవసరం, ముఖ్యం కూడా. మీరు చికెన్ బ్రెస్ట్, చేప వంటి సన్నని ప్రొటీన్ మాంసం తినవచ్చు, అంతేకానీ మొత్తం కొవ్వుతో నిండివుండే ప్రొటీన్ పదార్థాలు కావు. ఎర్రమాంసం, ప్రాసెస్డ్ పదార్థాలు పరిమితంగా తీసుకోండి, వాటి బదులు చిక్కుళ్ళు, నట్లు, విత్తనాలు, గుడ్లు, పెరుగు మీ భోజనంలో జతపర్చుకోండి.

ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ మీకు సరైనదేనా?

ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ మీకు సరైనదేనా?

ప్రొటీన్ ఎక్కువ ఉండే డైట్ పాటించాలనుకుంటుంటే, మీ డాక్టర్ ను సంప్రదించి మీ శరీరం దానికి అనువైనదో కాదో నిర్థారించుకోండి. మీరు సన్నని ప్రొటీన్ మాంసాహార పదార్థాలతో పాటు పండ్లు, కూరలు కూడా తీసుకుని మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుని, రోగాలను నివారించవచ్చు.

ఈ ఆర్టికల్ షేర్ చేయండి!

English summary

The Health Risks Of A High-Protein Diet You Should Know

The Health Risks Of A High-Protein Diet You Should Know,High-protein diets could kill you of heart disease and other diseases as well. Know about the health risks of a high-protein diet here in details.
Story first published:Friday, March 2, 2018, 18:13 [IST]
Desktop Bottom Promotion