రోజూ గుడ్డులోని తెల్లసొనను తినడం వల్ల కలిగే ఉన్నతమైన 10 ఆరోగ్య ప్రయోజనాలు

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

అత్యధిక నాణ్యతతో కూడిన ప్రోటీన్స్ కలిగి అందుబాటులో ఉన్న ఏ ఆహారపదర్ధంలో నైనా గుడ్డు ఒకటి. ప్రోటీన్స్ మాత్రమే కాకుండా, గుడ్లలో 18 రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. దీనిలో కోలిన్, లుటిన్, జేక్సాంతిన్ వంటి మైక్రో పోషకాలు కూడా ఉన్నాయి.

గుడ్లు బహుముఖమైనవి, వీటిని అనేక రకాలుగా వండుకోవచ్చు. కానీ, గుడ్డు తెల్లసొన ఆరోగ్యానికి చాలా మంచిది, దీనిని మీ రోజువారీ ఆహరం నుండి తొలగించ కూడదని మీకు తెలుసా? గుడ్డులోని ప్రోటీన్లు గుడ్డులోని తెల్లసోనలో సగం కంటే ఎక్కువ ఉంటాయి.

health benefits of eating egg whites

గుడ్డు తెల్లసొన రిబోఫ్లేవిన్, సేలేనియం కి మంచి వనరులు. ఇవి 54 మిల్లీగ్రాముల పొటాషియం, 55 మిల్లీగ్రాముల సోడియంని కూడా కలిగి ఉంటాయి. గుడ్డు లోని పచ్చసోన కేవలం 17 క్యాలరీలను కలిగి ఉంది, సాచురేటేడ్ కొవ్వు లేదా కొలెస్ట్రాల్ కలిగి ఉండదు.

గుడ్డు తినండి గుడ్ గా ఉండండి: వరల్డ్ ఎగ్ డే 2015 స్పెషల్

గుడ్డు తెల్లసొన మధుమేహం కలవారికి లేదా గుండె జబ్బులతో బాధపడే వారికి, ప్రతి ఒక్కరికీ చాలా మంచిది. ఇది రుచిని కలిగి ఉండడమే కాకుండా మంచి పోషకాలను కూడా మెండుగా కలిగి ఉంటుంది.

గుడ్డు లోని తెల్లసొనను తినడం వల్ల కలిగి 10 ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి: ఒకసారి చూడండి.

1.ఆరోగ్యకరమైన గర్భధారణకు చికిత్స

1.ఆరోగ్యకరమైన గర్భధారణకు చికిత్స

ఒక గుడ్డులోని తెల్లసొన నలుగు గ్రాముల ప్రోటీన్ తో సమానం. గర్భధారణ స్త్రీ గర్భధారణ సమయంలో గుడ్డులోని తెల్లసొన ఎక్కువ తింటే ఎక్కువ శక్తి వచ్చి త్వరగా అలసిపోకుండా ఉంటారు. అంతేకాకుండా ప్రీ-మెచ్యూర్ తో బిడ్డ పుట్టడం, తక్కువ బరువుతో పుట్టడం వంటి వాటిని కూడా నివారించవోచ్చు.

2.ఆకలిని ప్రోత్సహిస్తుంది

2.ఆకలిని ప్రోత్సహిస్తుంది

అల్పాహారం కింద ఉడకపెట్టిన ఒక కోడిగుడ్డు మొత్తాన్నీ తిన్నట్టయితే, భోజనం సమయం వరకు కడుపు నిండుగా ఉంటుంది. ఇదులో ఉండే అధిక ప్రోటీన్ల వల్ల ఆకలి వేయకుండా తక్కువ స్నాక్ తో కడుపు నిండుగా ఉండి, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకుండా నిరోధిస్తుంది.

3.కండరాలు మెరుగుపడతాయి

3.కండరాలు మెరుగుపడతాయి

బలమైన కండరాలకు ప్రోటీన్లు చాలా అవసరం, ఇది గుడ్డు తెల్లసొన తినడంవల్ల మాత్రమే కలుగుతుంది. మీరు నిత్యం వ్యాయామం చేసే వారయితే, మీ వ్యాయామం పూర్తి అయిన తరువాత కోడిగుడ్డు తెల్లసొన ను తినడం చాలా అవసరం, ఇది మీ కండరాల శక్తిని మెరుగుపరుస్తుంది.

4.నరాలు, మెదడు పనితీరుకు మంచిది

4.నరాలు, మెదడు పనితీరుకు మంచిది

గుడ్డులోని తెల్లసోనలో కోలిన్ అనే మైక్రో పోషకం ఉండడం వల్ల ఇది DNA ఏర్పాటులో పాల్గొనే మితైలేషన్ విధానంలో బాగా సహాయపడుతుంది. గుడ్డు తెల్లసొన నరాలు, మెదడు పనితీరుకు అండగా ఉండి, దిటాక్సిఫీకేషన్ లో కూడా సహాయపడుతుంది.

5.ఇది విటమిన్లను కలిగి ఉంటుంది

5.ఇది విటమిన్లను కలిగి ఉంటుంది

గుడ్డు తెల్లసొన మైగ్రేన్ సంబంధిత తలనొప్పులు, ఐ క్యాటరాక్ట్ లు వంటి కొన్ని పరిస్ధితులను నియంత్రించడానికి సహాయపడే రిబోఫ్లేవిన్ ని తగినంత మోతాదులో కలిగి ఉంటుంది. గుడ్డులోని తెల్లసొన గుండె జబ్బులు, డైమేన్షియా, ఎములకు సంబంధించిన వ్యాధులను కూడా అరికడుతుంది.

బ్రౌన్ కలర్ గుడ్లు లేదా (లేదా) తెల్లని గుడ్లు, వీటిలో ఏది ఆరోగ్యకరమైనది?

6.కొలెస్ట్రాల్ ఉండదు

6.కొలెస్ట్రాల్ ఉండదు

గుడ్డులోని తెల్లసొన జీరో కొలెస్ట్రాల్ ని కలిగి ఉంటుంది. మీరు బరువు తగ్గాలి అనుకుంటే మీ ఆహారంలో ఎక్కువ గుడ్డులోని తెల్లసొనను జతచేయండి. గుడ్డు తెల్లసొన కొలెస్ట్రాల్, కొవ్వు, క్యాలరీస్ వంటి సమస్యలకు ఒక ఆహార పరిష్కారంగా పరిగణించబడింది.

7.చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది

7.చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది

గుడ్డులోని తెల్లసొన బైట పొరలో కోల్లెజేన్ ఉంటుంది. కాబట్టి, మీ చర్మ౦ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే, మీ ఆహారంలో కోడిగుడ్డు తెల్లసొనను ఎక్కువగా జతచేయండి. ఇది ముడతలను నివారించడమే కాకుండా మీ చర్మానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది.

8.అలసటను తగ్గిస్తుంది

8.అలసటను తగ్గిస్తుంది

గుడ్డులోని తెల్లసొన లో ఉండే అనేక ముఖ్యమైన మినరల్స్ మీ శరీరానికి మంచి ప్రయోజనాలను అందిస్తాయి. మీకు అలసటగా, నీరసంగా అనిపిస్తే, ఏదొకరూపంలో గుడ్డు తెల్లసొనను తీసుకోండి. ఉడికించి తీసుకోవచ్చు లేదా బేక్ చేసి తీసుకోవచ్చు.

9.ఎలక్ట్రోలైట్ స్థాయిలను సహాయపడుతుంది

9.ఎలక్ట్రోలైట్ స్థాయిలను సహాయపడుతుంది

గుడ్డు తెల్లసొన లో ఉండే పొటాషియం శరీరానికి సరిపడినంత ఎలక్ట్రోలైట్స్ ని అందిస్తుంది. ఇది సాధారణ కండరాల పనితీరులో చికిత్సః పనిచేసి, గుండెజబ్బులు, ఇతర గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది. అంతేకాకుండా, ఎలక్ట్రోలైట్స్ ద్రవాలను సమతుల్యం చేయడం ద్వారా శరీరంలో కణాలను రక్షిస్తుంది.

10.రక్తపోటును తగ్గిస్తుంది

10.రక్తపోటును తగ్గిస్తుంది

ప్రతిరోజూ మీరు తీసుకునే ఆహారంలో గుడ్డులోని తెల్లసొనను చేర్చడం వల్ల అధిక రక్తపోటు పెరిగే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇది RVPSL (ప్రోటీన్ కాంపోనెంట్) అనే అమైనో ఆమ్లాలు రక్తపోటును తగ్గించి, రక్తపోటు సాధారణ స్ధాయిలో ఉండేట్టు చేస్తాయి.

ఈ ఆర్టికిల్ ని షేర్ చేయండి!

ఈ ఆర్టికిల్ ని మీరు చదవడానికి ఇష్టపడితే, మీ స్నేహితులకు కూడా దీన్ని షేర్ చేయండి.

English summary

Top10 Health Benefits Of Eating Egg Whites Daily

Egg whites are good sources of riboflavin and selenium. Also, they contain 54 mg of potassium and 55 mg of sodium. Egg whites are also low in calories with just 17 calories and contain no saturated fat or cholesterol. Egg whites are good for everybody, for those with diabetes or who are suffering from heart diseases.
Story first published: Thursday, January 4, 2018, 10:30 [IST]