For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రౌన్ కలర్ గుడ్లు లేదా (లేదా) తెల్లని గుడ్లు, వీటిలో ఏది ఆరోగ్యకరమైనది?

|

గుడ్లు ఆరోగ్యకరమైనవిగా భావించబడతాయి, ప్రత్యేకించి వ్యాయామం కోసం వెళ్లేవారికి. అలాగే మనలో చాలా మంది మెదడులో గోధుమ రంగు గుడ్లు, తెలుపు రంగు గుడ్లు కంటే ఆరోగ్యకరమైనవిగా ఉంటాయని కాబట్టి, మార్కెట్ లో గోధుమ రంగు గుడ్లను వెతికి, వాటిని పట్టుకోడానికి మనము చూస్తాము.

ఇంకా బాగా చెప్పాలంటే, కొత్త పరిశోధన ప్రకారం ఇది సరైనది కాదు.

నిజానికి, గుడ్లు చాలా రంగులలో వస్తాయి. వేర్వేరు గుడ్ల రంగు, కోళ్ళు ఉత్పత్తి చేసే వర్ణద్రవ్యాల (పిగ్మెంట్లు) నుండి వస్తుంది. అందువల్ల, తెలుపు మరియు గోధుమ రంగు గుడ్లు రెండూ ఒకే పోషక విలువలను కలిగి, ఆరోగ్యకరమైనవి ఉంటాయి.

గుడ్డు తినండి గుడ్ గా ఉండండి: వరల్డ్ ఎగ్ డే 2015 స్పెషల్

సౌమ్య శతాక్షి, ప్రముఖ సీనియర్ న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్, హీల్తియన్స్ "గుడ్లు శాట్యురేటెడ్ కొవ్వును తక్కువగా కలిగి ఉండి, ట్రాన్స్ కొవ్వు లేకుండా, కొంత మోతాదులో కొలెస్ట్రాల్లను కలిగి ఉంటుంది. కోడిగుడ్లలో ఉండే మంచి ("అన్-శాట్యురేటెడ్") కొవ్వును మన ఆరోగ్యానికి అవసరమైనదిగా ఉంటుందని, తెలిపారు.

Brown Eggs Or White Eggs

ఇది కోడిగుడ్ల గురించి ఒక్క వాస్తవం మాత్రమే. కోడిగుడ్లకు అదనంగా మరియు వాస్తవాలతో సంబంధం ఉన్న ఇతర చరిత్రను గురించి మరిన్నింటిని తెలుసుకుందాం.

అపోహలు : గుడ్లు, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి కాబట్టి వాటిని వాడకూడదు.

వాస్తవం : గుడ్లు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచదు. అందులో ప్రోటీన్ అనే అద్భుతమైన మూలాధారమును కలిగి ఉన్నందున, దానిని వాడకంలో మినహాయించవద్దు. మనం తీసుకునే ఆహార పదార్థాల ప్రభావం కారణంగా మన శరీర రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను లెక్కించడానికి శాట్యురేటెడ్-కొవ్వును మరియు ట్రాన్స్-కొవ్వు ( 'చెడు' కొవ్వులు)ల యొక్క స్థాయిలను ఖాతాలోకి తీసుకోవాలి.

Brown Eggs Or White Eggs

అపోహలు : గుడ్లను ఉపయోగించే ముందు కడగడం వల్ల దానిపై ఉన్న సాల్మొనెల్లా బ్యాక్టీరియాను తొలగించవచ్చు.

నిజానికి : మనలో చాలామందికి రిఫ్రిజిరేటర్లో గుడ్లను నిల్వ ఉంచే ముందు వాటిని కడగడం అలవాటు. ఇంకా బాగా చెప్పాలంటే, సాల్మొనెల్లా బాక్టీరియా అనేది గుడ్డు లోపలి భాగంలో ఉంటుంది. అంతేగానీ గుడ్లు ఉపరితలంపైన (లేదా) గుడ్డు పెంకుల మీద గానీ ఉండవు. అందువల్ల, గుడ్లు కడగడం వల్ల బ్యాక్టీరియాను తొలగించడంలో నిజంగా సహాయం చెయ్యలేదు.

అపోహలు : ఒక రోజులో చాలా అధికంగా గుడ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చెడ్డది.

నిజానికి : ప్రతిదానిని చాలా ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచదికాదు, కాబట్టి మోస్తరు స్థాయిలో వినియోగించే ఆరోగ్యానికి ఏదైనా మంచిదే. రోజుకు మూడు గుడ్లను వినియోగించడం ప్రజల ఆరోగ్యానికి సంపూర్ణ సురక్షితమని శాస్త్రీయంగా తెలుపబడింది.

Brown Eggs Or White Eggs

అపోహలు : తినే గుడ్లు హృదయ వ్యాధులకి కారణం కావచ్చు.

నిజానికి : గుండె జబ్బులకు మరియు గుడ్లు తినడానికి అస్సలు సంబంధం లేదు. కానీ మీరు ఎలా తింటున్నారో అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. కోడిగుడ్లలో ఉండే మంచి ("అన్-శాట్యురేటెడ్") కొవ్వును మన ఆరోగ్యానికి అవసరమైనదిగా ఉంటుందని, దానివల్ల గుండె సమస్యలకు హానికరం కాదని తెలిపారు.

ఎగ్ వైట్(గుడ్డు తెల్లసొన)లోని గొప్ప ప్రయోజనాలు

అపోహలు : తినే గుడ్లు అంధత్వం నివారించడంలో సహాయపడుతుంది.

నిజానికి : వయస్సు సంబంధితంగా వచ్చే అంధత్వం నుండి కళ్ళను పరిరక్షించడానికి సహాయపడుతుంది ఎందుకంటే గుడ్డులో వివిధ రకాల పోషకాలన్నీ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి.

గుడ్డులో ల్యూటీన్ మరియు జియాక్సాంటీన్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి, ఇది కళ్లకు చాలా మంచివి.

అపోహలు : పచ్చిగుడ్డు సొనలో మాత్రమే సాల్మోనెల్లా బాక్టీరియా కనబడుతుంది, కాబట్టి గుడ్లులోని తెలుపు భాగాన్ని మాత్రమే తినడం సురక్షితం.

నిజానికి : సాల్మోనెల్లా బాక్టీరియా ఎక్కువగా గుడ్డు యొక్క పచ్చసొనలో కనబడుతుంది కానీ దానివల్ల గుడ్డులో ఉండే తెలుపు కూడా కలుషితం అవుతున్నాయి. కనుక ఇలాంటి పచ్చ గుడ్లను, పండని గుడ్లును తినడం మంచిది కాదని సలహా ఇవ్వబడింది.

అపోహలు : స్థానిక రైతుల నుండి గుడ్లు కొనటం - కిరాణా దుకాణం నుండి కొనుగోలు చేసిన వాటి కంటే సురక్షితం.

నిజానికి : గుడ్లు అనేవి కోళ్లు నుండి వస్తాయి, మరియు కోళ్లు 'సాల్మోనెల్లా బాక్టీరియాకు' నిలయంగా ఉంటుంది. కాబట్టి కిరాణా దుకాణం పోలిస్తే రైతు బజారులోనే కొనడం సురక్షితమైనగా భావించడానికి ఎలాంటి గారెంటీ లేదు.

English summary

Brown Eggs Or White Eggs, Which Is Healthy?

This is just one of the fact about eggs. In addition to this lets learn about few other myths associated with eggs and the facts.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more