టాప్ 12 విటమిన్ B2 రిచ్ ఫుడ్స్ మరియు వాటి ఆరోగ్య ప్రయోజనాలు!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మన శరీరం యొక్క సరైన పనితీరుకు విటమిన్లు చాలా అవసరమవుతాయి. కాబట్టి మన రోజువారీ జీవితంలో విటమిన్లు పుష్కలంగా వున్న ఆహారపదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరం. అందులోనూ జీవక్రియ కోసం అవసరమైన వివిధ రకాల విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ B2, ఇది ఎన్నో రకాల సెల్యులార్ ఫంక్షన్ల ను విడుదల చేస్తుంది.

విటమిన్ B2, లేదా రిబోఫ్లావిన్ అనేది మూత్రపిండాలు, కాలేయం మరియు గుండెలలో కనిపించే నీటిలో కరిగే విటమిన్లు. ఈ విటమిన్లు గుండెకి సంబంధిన వ్యాధులు, ఉదాహరణకి: స్ట్రోక్, క్యాన్సర్, పార్కిన్సన్, అల్జీమర్స్ మరియు ఇతర ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఒకవేళ ఈ విటమిన్ B2 లేదా రిబోఫ్లావిన్ యొక్క లోపం గాని వున్నట్లైతే, పెదవులు ఎర్రబడటం,శోర్ త్రోట్, మంటపుట్టడం, మరియు కళ్ళ దురద, చర్మపు దద్దుర్లు, నోరు దుర్వాసన రావడం మరియు రక్తహీనత వంటి వ్యాధులకు దారితీస్తుంది. మైగ్రేన్ మరియు తలనొప్పి అనేవి విటమిన్ B2 లోపం వలన కలిగే అత్యంత సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ గా చెప్పవచ్చు.

అందువల్ల, సరైన ఆరోగ్య నిర్వహణ కోసం రిబోఫ్లావిన్ ఎంతో అవసరం. దీనికోసం మీరు చేయవలసిందల్లా విటమిన్ B2 సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడమే!

ఇక్కడ విటమిన్ B2 అధికంగా ఉండే ఆహార పదార్ధాల జాబితా మరియు దాని ఆరోగ్య ప్రయోజనాలను ఈ విటమిన్ లోపంను అధిగమించడానికి మీ కోసం తెలియజేస్తున్నాము.

విటమిన్ B2 ఆహారపదార్థాలు

Top 12 Vitamin B2 Rich Foods And Their Health Benefits

1. మాంసం

ఎరుపు మాంసం, గొర్రె మాంసం లేదా గొడ్డు మాంసం వంటి వాటిలో విటమిన్ B2 అధికంగా ఉంటుంది. రోజువారీ ప్రతిపాదికలో విటమిన్ B2, 12 శాతం కంటే ఎక్కువ విటమిన్లను కలిగివున్న మాంసం ని మీకు సిఫార్సు చేయబడుతుంది. మీ రిబోఫ్లావిన్ అవసరాన్ని తీర్చడానికి మీ డైట్ లో లివర్ ని కూడా చేర్చండి.

2. నట్స్

2. నట్స్

నట్స్, విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉన్న పోషక సాంద్రత కలిగిన ఆహారాల పదార్థాలు. విటమిన్ B2 యొక్క ఉత్తమ మూలాలు బాదంపప్పులు, రోజువారీ సిఫార్సు విలువలో 60 శాతం మీకు అందిస్తాయి. చిన్న మొత్తాలలో ఈ విటమిన్ను కలిగి ఉన్న ఇతర గింజలు జీడిపప్పులు మరియు పిస్తాపప్పులు, ఇవి విటమిన్ మీ శరీరానికి అవసరమైన B2 ని 4 శాతం వరకు అందిస్తాయి.

3.పుట్టగొడుగులు

3.పుట్టగొడుగులు

పుట్టగొడుగులు విటమిన్ B2 సమృద్ధిగా ఉంటాయి మరియు రోజువారీ లో వీటిని తినడం వలన మీ శరీరంలోని విటమిన్ శాతం పెరుగుతుంది. 100 గ్రాముల పుట్టగొడుగుల లో మీకు 29 శాతం మీకు విటమిన్ B2 ని అందిస్తుంది. మీరు కావాలంటే రిబోఫ్లావిన్ అధిక మొత్తంలో ఉన్న వైట్ బటన్ పుట్టగొడుగులను తీసుకోవచ్చు.

రిలేటెడ్: వైట్ పుట్టగొడుగుల యొక్క ప్రయోజనాలు, వైట్ పుట్టగొడుగుల వలన కలిగే 11 ఆరోగ్య ప్రయోజనాలు

4. ఫిష్

4. ఫిష్

మేకరెల్, కాట్లా మరియు రోహు వంటి జిడ్డు చేపలు విటమిన్ B2 యొక్క గొప్ప వనరులు గా చెప్పవచ్చు వీటి 85 గ్రాముల మాంసం 0.49 MG ల విటమిన్ ని మీకు అందిస్తాయి. స్మోక్డ్ సాల్మొన్, ట్యూనా మరియు హెర్రింగ్ వంటి ఇతర జిడ్డు చేపల లో కూడా విటమిన్ B2 అధికంగా ఉంటుంది. సో, విటమిన్ B2 ని పెంచడానికి ఒక వారం లో కనీసం ఒకసారి ఈ చేపల్ని తినడానికి ప్రయత్నించండి.

5. గుడ్లు

5. గుడ్లు

గుడ్లు ప్రోటీన్ మరియు ఇతర పోషకాల కి అద్భుతమైన మూలం. కేవలం ఒక్క ఉడికించిన గుడ్డు లో 15 శాతం వరకు విటమిన్ B2 కలిగి ఉంది. అదేవిధంగా, పచ్చి, వేయించిన లేదా గిలకొట్టిన గుడ్డు లో 13 శాతం విటమిన్ B2 ఉంటుందని మరియు రోజువారీ సిఫార్సు విలువలో జతచేయబడింది.

6.బ్రోకలీ

6.బ్రోకలీ

బ్రోకలీ అనేది అవసరమైన విటమిన్ల కి మరియు అనామ్లజనకాలు యొక్క మంచి మూలం. 100 గ్రాముల బ్రోకలీలో 10 శాతం విటమిన్ B2 ని కలిగి ఉంటుంది. మిగిలిన ఆకుపచ్చని ఆకుకూరలతో పోలిస్తే బ్రోకలీ లో అధిక క్యాలోరీలను కలిగివుంది.

7. సీసమ్ విత్తనాలు

7. సీసమ్ విత్తనాలు

విటమిన్ B2 యొక్క అత్యంత ధనిక మూలం గా సెసేమ్ గింజల ను చెప్పవచ్చు, 100 గ్రాముల విత్తనాలలో 27 శాతం విటమిన్లని అందిస్తుంది. విత్తనాలు కూడా మోనోసంత్సాహితమైన కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి మరియు ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు సెలీనియం వంటి ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి. విటమిన్ B2 కలిగివున్న ఇతర విత్తనాలు పొద్దుతిరుగుడు విత్తనాలు, చియా గింజలు మరియు గుమ్మడికాయ విత్తనాలు.

8. చీజ్

8. చీజ్

చీజ్ కూడా విటమిన్ B2 కి మంచి మూలం. గోట్ చీజ్, ఫెటా ఛీజ్ మరియు పర్మేసన్ జున్ను వంటి జున్ను రకాల అన్నింటిలో విటమిన్ B2 కలిగి ఉంటుంది. 100 గ్రాముల జున్ను రోజువారీ సిఫార్సు విలువలో 81 శాతం అందిస్తుంది.

9. మిల్క్ (పాలు)

9. మిల్క్ (పాలు)

పాలు కూడా విటమిన్ B2 మరియు ఇతర B- సంక్లిష్ట విటమిన్ల యొక్క మంచి మూలం. ఒక కప్పు పాలలో మొత్తం 26 శాతం రిబోఫ్లావిన్ ని కలిగి ఉంది. మీరు కొవ్వు తక్కువగా వున్న పాలు మరియు ఇతర పాల ఉత్పత్తులకు కూడా విటమిన్ B2 కోసం మంచి వనరులుగా ఎంచుకోవచ్చు.

10.క్యాన్సర్ ని నిరోధిస్తుంది

10.క్యాన్సర్ ని నిరోధిస్తుంది

క్యాన్సర్ నివారణకు అనుసంధానించబడిన ఆక్సీకరణ నష్టం నివారించడంలో రిబోఫ్లావిన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ B2 యొక్క తగినంత మొత్తంలో ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తుంది మరియు అందువల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

11. మైగ్రెయిన్ తలనొప్పికి చికిత్స

11. మైగ్రెయిన్ తలనొప్పికి చికిత్స

రిబోఫ్లావిన్ మైగ్రెయిన్ లేదా తలనొప్పిని నివారించడంలో సహాయపడుతుంది. తల నొప్పి సమస్యల ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి విటమిన్ B2 ని అధిక మొత్తంలో తీసుకోవడాన్ని సిపార్సు చేయబడింది. కాబట్టి,

ఇకముందు మీరెప్పుడైనా మైగ్రెయిన్ తలనొప్పి తో బాధపడుతుంటే, మీ ఆహారంలో విటమిన్ B2 అధికంగా ఉన్న ఆహార పదార్థాలను జత చేసుకోండి.

12. హెయిర్ మరియు స్కిన్ రూపురేఖలను మెరుగుపరుస్తుంది

12. హెయిర్ మరియు స్కిన్ రూపురేఖలను మెరుగుపరుస్తుంది

విటమిన్ బి 2 కొల్లాజెన్ స్థాయిల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది, ఇది చర్మం మరియు జుట్టు ఆకృతిని పెంచుతుంది. కొల్లాజెన్ నిర్మాణాన్ని నిర్వహించడానికి మరియు చర్మంపై ముడుతలను నిరోధించడానికి అవసరం.

English summary

Top 12 Vitamin B2 Rich Foods And Their Health Benefits

Vitamin B2 is one of the essential vitamins required for proper energy metabolism. Eating foods rich in riboflavin will let you overcome the riboflavin deficiency symptoms. Read on to know more about the vitamin B2-rich foods and the health benefits of the vitamin.
Subscribe Newsletter