For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకు రెండు అరటిపండ్లను తింటే ఏమవుతుంది?

రోజుకు రెండు అరటిపండ్లను తింటే ఏమవుతుంది?

|

ఉదయాన్నే తినే అల్పాహారంలో ముఖ్యమైన భాగమైన తృణధాన్య పదార్థాలు, ప్యాన్ కేక్ లు మరియు స్మూతీలకు, అరటిపండు గొప్ప రుచిని మరియు పోషకాలను జత చేస్తుంది. ఈ వ్యాసంలో, మీరు రోజుకు రెండు అరటి పండ్లను తింటే ఏమి జరుగుతుందో తెలియజేయబోతున్నాము.

మనం అధికంగా వాడే పండ్లలో అరటిపండు అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇది రుచితో పాటు రకరకాల ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిలో 110 కేలరీలు, 5 గ్రాముల కొవ్వు, 27 గ్రాముల పిండిపదార్ధం, 3 గ్రాముల పీచుపదార్ధం, 14 గ్రాముల చక్కెర, 25 శాతం విటమిన్ బి6, ప్రోటీన్ 1 గ్రాము, 16 శాతం మాంగనీస్, 14 శాతం విటమిన్ సి, 12 శాతం ఫైబర్, 10 శాతం బయోటిన్, 10 శాతం రాగి మరియు 8 శాతం మెగ్నీషియం ఉంటాయి.

రోజుకు రెండు అరటి పండ్లను తింటే ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి చదవండి ఇక!

1. రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది.

1. రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది.

మీరు తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నట్లైతే, రోజుకు రెండు అరటిపండ్లని తినడం వలన మీ రక్తపోటు సాధారణ స్థాయికి చేరుతుంది. దీనిలో సుమారు 420 గ్రాముల పొటాషియం ఉంటుంది. ఉప్పు వినియోగం వలన కలిగే ప్రతికూల ప్రభావాలను సమతుల్యం చేయడం ద్వారా పొటాషియం మీ రక్తపోటును తగ్గిస్తుంది.

2. మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

2. మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మీ జీర్ణాశయంలోని అసౌకర్యాన్ని నివారించి,మీ జీర్ణశక్తిని మెరుగుపరిచే సామర్ధ్యం అరటిపండు కలిగి ఉంటుంది. అరటిపండ్లలో ఉండే కొన్ని రకాల పిండి పదార్ధాలు, అంత సులభంగా జీర్ణం కావు. ఇవి పెద్ద ప్రేగులను చేరి, ఆరోగ్యకరమైన బాక్టీరియా యొక్క పెరుగుదలకు సహకరిస్తాయి. అలాగే, మీరు అజీర్ణం లేదా గుండెమంటతో బాధపడుతున్నట్లయితే, అరటి పండు దీనిని నివారిస్తుంది. అతిసారవ్యాధి వలన కోల్పోయిన ఖనిజాలను పునరుద్ధరించడానికి అరటిపండ్లు ఉపయోగపడతాయి.

3. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

3. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

మీరు ప్రతిరోజు, రెండు చిన్న అరటిపండ్లని తింటే బరువు తగ్గించవచ్చు. ఇది అధిక పీచుపదార్ధం కలిగి ఉన్నందున, ఇది జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుంది. దీని వలన కడుపు ఎక్కువ సమయం పాటు నిండి ఉన్న భావన కలుగుతుంది. అరటిపండు త్వరగా జీర్ణం కాని పిండిపదార్థాలను కలిగి ఉన్నందున ఆకలి తగ్గి తద్వారా బరువు పెరగకుండా చేస్తుంది. మీరు రోజులో ఏ సమయంలో అరటి పండును తింటున్నారనేదానిపై, మీరు తగ్గే బరువు ఆధారపడి ఉంటుంది.

4. రక్తహీనతను తగ్గిస్తుంది.

4. రక్తహీనతను తగ్గిస్తుంది.

రక్తప్రవాహంలో తగినంత ఇనుము లోపించడం వలన రక్తహీనత కలుగుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిన కారణంగా అలసట మరియు నీరసం కలుగుతాయి. రోజుకు రెండు అరటిపండ్లను తినడం చేత ఎర్ర రక్త కణాల సంఖ్య అధికమై, ఇనుము స్థాయి పెరుగుతుంది.

5. విటమిన్ లోపాలను తొలగిస్తుంది.

5. విటమిన్ లోపాలను తొలగిస్తుంది.

విటమిన్ బి6 లో అరటిపండ్లలో పుష్కలంగా ఉంటుంది. అరటిపండు 20 శాతం విటమిన్ బి6ను కలిగి ఉంటుంది. ఈ విటమిన్ హిమోగ్లోబిన్, ఇన్సులిన్, మరియు అమైనో ఆమ్లాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అరటిపండ్లలో, హానికరమైన ఫ్రీ రాడికల్స్ తటస్థీకరణకు ఉపయోగపడే విటమిన్ సి, 15 శాతం మేరకు ఉంటుంది.

6. మీ మూడును ఉత్తేజితం చేస్తుంది.

6. మీ మూడును ఉత్తేజితం చేస్తుంది.

అరటిపండ్లు మీలో ఒత్తిడి స్థాయిని తగ్గిస్తాయి. అంతేకాకుండా, మీ మూడ్ ను ఆహ్లాదపరిచే ట్రిప్టోఫాన్ కలిగి ఉంటాయి. మన శరీరం సెరోటోనిన్ అనే సంతోషపరచే హార్మోన్ ఉత్పత్తి చేయడానికి ట్రిప్టోఫాన్ అవసరం. అరటిపండులో నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడే మెగ్నీషియం కూడా 27 మిల్లీగ్రాములు ఉంటుంది.

7. శరీరంలో శక్తిని పెంపొందిస్తుంది.

7. శరీరంలో శక్తిని పెంపొందిస్తుంది.

మీకు పని చేయడానికి బద్దకం అనిపిస్తుందా? మీ అల్పాహారంలో రెండు అరటిపండ్లను తీసుకుంటే, అది మీకు శక్తిని అందిస్తుంది. అరటిపండులో ఉండే పొటాషియం, మీ శరీరానికి శక్తిని అందిస్తుంది. వ్యాయామానికి ముందు మరియు తరువాత తినడానికి అరటిపండు మంచి చిరుతిండి.

మీరు గుర్తుపెట్టుకోవలసిన కొన్ని విషయాలు:

మీరు గుర్తుపెట్టుకోవలసిన కొన్ని విషయాలు:

బాగా పండిన అరటి పండులో, 90 శాతం సుక్రోజ్ మరియు 7 శాతం పిండి పదార్ధాలు ఉంటాయి కనుక వీటిని తినండి. సుక్రోజ్ అనేది గ్లూకోజ్ మరియు ఫ్రూక్టోజ్ కలయిక వలన ఏర్పడుతుంది కనుక ఇది శరీరంలోకి త్వరగా శోషింపబడుతుంది. ఇది ఇన్సులిన్ మరియు గ్లైసెమియాపై అధిక ప్రభావం చూపుతుంది.

అరటి పండు ముగ్గి, పసుపు రంగులోకి మారినప్పుడు దానిలోని యాంటీఆక్సిడెంట్ల స్థాయి పెరుగుతుంది. ఇవి క్యాన్సర్ మరియు హృద్రోగాల నుండి మీ శరీరాన్ని రక్షిస్తాయి.

English summary

What Happens If You Eat 2 Bananas A Day?

Bananas are one of the most widely consumed fruits. Apart from being tasty, they also offer a wide array of benefits for the body. They contain 110 calories, 5 grams of fat, 27 grams of carbohydrates, 3 grams of fibre, etc. Eating 2 bananas a day will improve digestion, lower blood pressure, lower the chances of anemia, boost mood, etc.
Desktop Bottom Promotion