For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాగా పండిన అరటిపండ్లు, వాటి పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు.

|

అరటి పండు అంటే మీకు అభిమానం ఉండవచ్చు కానీ, అది పండిన అరటి పండు కాకపోవచ్చు. మనం అరటి పండ్లు తెచ్చినప్పుడు తాజాగా కనిపించినా, ఒకటి రెండు రోజుల తర్వాత వాటి మీద నల్లటి మచ్చలు ఏర్పడడం గమనించవచ్చు. ఈవిధంగా నల్లటి మచ్చలు ఏర్పడి ఉన్న ఎడల, దానిని పండిన అరటి పండుగా గుర్తించబడుతుంది. ఈ మచ్చలు అధికంగా కనిపిస్తే ఖచ్చితంగా పారవేస్తూ ఉంటారు. అవునా ?. వాస్తవానికి, వాటి మృదుత్వం మరియు రంగులో మార్పులు చోటు చేసుకుంటున్న కారణాన అవకాశం తీసుకోకుండా పారవేయడం జరుగుతుంటుంది. కానీ ఈ పండిన అరటి పండ్ల వలన కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పబడుతుంది.

అరటి పండు బాగా పండిన తరువాత, దాని పోషక విలువల స్థాయిలు మారుతాయి. అంతేకానీ, పోషక ప్రయోజనాలను పూర్తి స్థాయిలో కోల్పోయిందని అర్థం కాదు. అరటి పండు పండినా కూడా మీ శరీరానికి అత్యంత లాభదాయకంగా ఉంటుందని కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హ్యూమన్ ఎకాలజీ వారు చెప్తున్నారు.

Bananas

పొటాషియం, మాంగనీస్, ఫైబర్, రాగి, విటమిన్ సి, విటమిన్ B6 మరియు బయోటిన్ సమృద్ధిగా ఉన్న ఈ అరటి పండు ఆస్థమా, క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, అజీర్తి, అలాగే జీర్ణ సమస్యలను నిరోధించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా బాగా పండిన అరటి పండులో కూడా ఈ పోషకాలన్నీ కొనసాగుతాయి. కావున, ఈసారి అరటి పండు మీద గోధుమ రంగు మచ్చలు కనపడితే, వాటిని దూరంగా పారవేయకండి! మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

బాగా పండిన అరటి పండులోని పోషకాలు :

పండిన అరటి పండులోని పోషకాలు మామూలు పండులో ఉన్నంత పరిమాణంలో ఉండవు. అరటి పండులో ఉండే సంక్లిష్ట పిండి పదార్థాలు పక్వానికి వచ్చే కొలదీ, స్టార్చ్ నుండి సాధారణ చక్కెరలవలె మార్పులకు గురవుతుంది. ఏదిఏమైనా క్యాలరీల సంఖ్య మాత్రం అదేవిధంగా ఉంటుంది. కానీ నీటిలో కరిగే స్వభావం ఉండే విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ మరియు థయామిన్ వంటి విటమిన్లు తగ్గుదలకు గురవుతాయి.

బాగా పండిన అరటి పండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు :

వాస్తవానికి దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన ఆహారంగా పరిగణించడం జరుగుతుంది. అరటి పండులో విటమిన్లు మరియు పోషకాలు అధికంగా ఉంటాయి. బాగా పండిన అరటి పండులో టన్నుల కొద్దీ పోషకాలు ఉంటాయి. శరీరానికి సరైన జీవక్రియలను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

1. కణ నష్టాన్ని నివారిస్తుంది :

1. కణ నష్టాన్ని నివారిస్తుంది :

యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న కారణాన, కణ నష్టాన్ని నిరోధిస్తుంది. అంతర్గత డ్యామేజీలు మరియు ఫ్రీ రాడికల్స్ వలన కలిగే కణాల నష్టాన్ని తగ్గించడానికి బాగా పండిన అరటి పండు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇది వ్యాధులబారిన పడే ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

2. రక్తపోటును తగ్గించడంలో :

2. రక్తపోటును తగ్గించడంలో :

అరటి పండ్లలో, రక్తపోటును తగ్గించడంలో సహాయపడే పొటాషియం నిల్వలు అధికంగా ఉంటాయి. మరియు ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. తరచుగా పండిన అరటి పండ్లను తీసుకోవడం మూలంగా రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. అంతేకాకుండా ధమనుల్లోని అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది. క్రమంగా మీ రక్త ప్రసరణ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేస్తూ, స్ట్రోక్ మరియు హార్ట్ అటాక్ సమస్యలు తలెత్తకుండా చూస్తుంది.

3. గుండె మంటను తగ్గిస్తుంది :

3. గుండె మంటను తగ్గిస్తుంది :

అరటి పండు బాగా పక్వానికి వచ్చినప్పుడు ఉత్తమమైన యాంటాసిడ్ వలె పనిచేస్తుంది. గోధుమ మచ్చలతో కూడుకున్న అరటిపండు కడుపులో చికాకు నుండి ఉపశమనానికి సహాయపడుతుంది. క్రమంగా స్వాంతన చేకూరుస్తుంది.

4. రక్త హీనత సమస్యను నివారించడంలో :

4. రక్త హీనత సమస్యను నివారించడంలో :

పండిన అరటి పండ్లలో ఐరన్ అధికంగా ఉన్న కారణాన అనీమియా సమస్యను నివారిస్తుంది. పండిన అరటి పండ్లను తినడం వల్ల మీ రక్త స్థాయిలను సహజ సిద్దంగా పెంచడానికి సహాయపడుతుంది. అనీమియా చికిత్సకు గల ఉత్తమ నివారణలలో ఇది కూడా ఒకటి.

5. శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది :

5. శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది :

బాగా పండిన అరటి పండులో ఉండే అధిక కార్బోహైడ్రేట్స్ మరియు షుగర్ కంటెంట్ సహజ సిద్దమైన ఎనర్జీ బూస్టర్స్ వలె పనిచేస్తాయి. క్రమంగా శారీరిక శక్తి స్థాయిలు మెరుగవుతాయి. బాగా పండిన రెండు అరటి పండ్లను తినడం వలన 90 నిమిషాల పాటు లాంగ్ వర్కౌట్ చేయగలిగినంత శక్తి స్థాయిలు శరీరానికి లభిస్తాయని చెప్పబడుతుంది. ఒకవేళ శరీరం డస్సిపోయిన అనుభూతికి లోనవుతూ ఉంటే, ఒకటి లేదా రెండు బాగా పండిన అరటి పండ్లను తీసుకోండి.

6. క్యాన్సర్ సమస్యను నివారిస్తుంది :

6. క్యాన్సర్ సమస్యను నివారిస్తుంది :

బాగా పండిన అరటి పండులో ఉండే ప్రయోజనాలలో ముఖ్యమైనది క్యాన్సర్తో పోరాడే సామర్థ్యం. అరటి పండు చర్మంపై కనిపించే ముదురు మచ్చలు, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ (TNF) ఏర్పాటు చేస్తాయి, ఇవి క్యాన్సర్ మరియు శరీరంలో పేర్కొన్న అసంబద్ద కణాలను చంపే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

7. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

7. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

పైన చెప్పినట్లు, అధికంగా పండిన అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. మరియు సోడియం నిక్షేపాలు తక్కువగా ఉంటాయి. ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి లాభదాయకంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ గుండె వ్యాధుల ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా కాపర్ మరియు ఐరన్ కంటెంట్ శరీరంలోని రక్తం మరియు హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి.

8. అల్సర్స్ తగ్గించడంలో :

8. అల్సర్స్ తగ్గించడంలో :

అరటి పండ్లు అల్సర్స్ సమస్యతో బాధపడుతున్న వారికి, అత్యంత లాభదాయకమైన పండుగా ఉంటుంది. మరియు అల్సర్ సమస్యతో ఉన్న వ్యక్తి నిస్సంకోచంగా ఈ పండిన అరటి పండును తీసుకొనవచ్చు. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేనిదిగా ఉండడమే కాకుండా, బాధ నుండి ఉపశమనాన్ని అందివ్వడంలో సహాయం చేయగలదు. అరటి పండ్ల యొక్క మృదుత్వం కారణంగా కడుపులో పేగు వ్యవస్థను సవ్యంగా జరిగేలా చూస్తూ, అల్సర్స్ నుంచి యాసిడ్లు ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది.

9. మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది :

9. మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది :

బాగా పండిన అరటి పండ్లలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయం చేయగలదు. అవి మీ ప్రేగు ఉద్యమాన్ని మెరుగుపరచి, మీ జీర్ణ వ్యవస్థ నుండి వ్యర్థ పదార్థాలను బయటకు తరలించడాన్ని సులభతరం చేస్తుంది. క్రమంగా మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

10. PMS లక్షణాలను అదుపులో ఉంచుతుంది :

10. PMS లక్షణాలను అదుపులో ఉంచుతుంది :

బాగా పండిన అరటి పండ్లలో ఉండే విటమిన్ B6, PMS లక్షణాల చికిత్సలో లాభదాయకంగా ఉంటుంది. వివిధ అధ్యయనాల ప్రకారం ప్రెసెసివ్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించడంలో విటమిన్ B6 ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది.

11. డిప్రెషన్ చికిత్సలో :

11. డిప్రెషన్ చికిత్సలో :

బాగా పండిన అరటి పండులో ట్రిప్టోఫాన్ యొక్క అధిక స్థాయిల కారణంగా, వినియోగం మీద సెరోటోనిన్ హార్మోన్ వలె మారడం జరుగుతుంది. సెరోటోనిన్, మీరు మంచి అనుభూతికి లోనయ్యేలా చేసి, మీ నాడీ వ్యవస్థ ఉధృతిని తగ్గించి, తద్వారా మీ మానసిక స్థాయిలను సావధాన పరుస్తుంది. క్రమంగా ఆరోగ్యకరమైన మానసిక స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.

బాగా పండిన అరటి పండుతో అనుసరించదగిన రెసిపీలు :

బాగా పండిన అరటి పండుతో అనుసరించదగిన రెసిపీలు :

1. బనానా ఓట్మీల్ బ్రేక్ ఫాస్ట్ స్మూతీ :

కావలసిన పదార్ధాలు :

• ¼ కప్పు ఓట్స్

• ¾ కప్పు పాలు

• 1 టీస్పూన్ లో-ఫాట్ పీనట్ బట్టర్

• 1 బాగా పండిన అరటి పండు, చిన్న ముక్కలుగా కోయాలి

• 4-5 ఐస్ క్యూబ్స్

అనుసరించదగిన విధానం :

ఒట్మీల్, పాలు, పీనట్ బట్టర్, బాగా పండిన అరటి పండు, మరియు ఐస్ క్యూబ్స్ అన్నీ ఒక బ్లెండర్ కి జోడించి సుమారు 1 నిమిషం పాటు మృదువుగా మిశ్రమంగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి.

2. పాలియో బనానా జుచిని మఫ్ఫిన్స్ :

కావలసిన పదార్ధాలు :

• 1 కప్పు చిదిమిన జుచ్చినీ (1 మీడియం జుచ్చిని)

• ½ కప్పు చిదిమిన అరటి పండు(1 మీడియం బాగా పండిన అరటి పండు)

• ¾ కప్పు లో-ఫాట్ కాజు బట్టర్

• ¼ కప్పు తాజా మాపుల్ సిరప్

• 2 గుడ్లు

• 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్

• ½ కప్పు కొబ్బరి పొడి

• 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా

• ¼ టేబుల్ స్పూన్ ఉప్పు

అనుసరించాల్సిన విధానం :

ఓవెన్ను 350 ° F దగ్గర ముందుగానే వేడి చేసి ఉంచాలి. పేపర్ టవల్ వినియోగించి అదనపు తేమను తొలగించి, జుచ్చిని పిండి తీసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో జుచ్చినీ, అరటి పండు, లో-ఫాట్ కాజు బట్టర్, మాపుల్ సిరప్, గుడ్లు, మరియు వెన్నెలా ఎక్స్ట్రాక్ట్ కలపండి. మృదువుగా అయ్యే వరకు మిక్స్ చేసి, తరువాత కొబ్బరి పొడి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపండి. తర్వాత 22 నుండి 27 నిమిషాల వరకు బేక్ చేసి బయటకు తీయండి. మఫ్ఫిన్స్ టాప్స్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ రంగులో ఉందని నిర్ధారించుకోండి.

3. చియా, క్వినోవా మరియు బనానా గ్రనోలా బార్స్ :

కావలసిన పదార్ధాలు :

• 1 కప్పు గ్లూటెన్ ఫ్రీ ఓట్స్

• ½ కప్పు వండని క్వినోవా

• 2 స్పూన్స్ చియా విత్తనాలు

• ¼ టీస్పూన్ ఉప్పు

• 1 టీస్పూన్ దాల్చిన చెక్క

• 2 బాగా పండిన గుజ్జు చేసిన అరటి పండ్లు

• ½ టీస్పూన్ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్

• ¼ కప్పు తురిమిన బాదం

• ¼ కప్పు తరిగిన పెకాన్స్

• ⅓ కప్పు డ్రై ఫ్రూట్స్

• ¼ కప్పు సహజ సిద్దమైన లో-ఫాట్ క్రీమీ ఆల్మండ్ బట్టర్

• 2 టేబుల్ స్పూన్ల తేనె

అనుసరించదగిన విధానం :

ఒవెన్ను 350 ° F వద్ద ముందుగానే వేడి చేయండి. పట్టీలు అతుక్కోకుండా నిరోధించడం కొరకు పార్చ్మెంట్ పేపర్ వినియోగించి బేకింగ్ పాన్ను లైన్ చేయండి. ఒక గిన్నెలో ఓట్స్, ఉడికించిన క్వినోవా, ఛియా విత్తనాలు, ఉప్పు, దాల్చిన చెక్క పొడి వేసి మిశ్రమంగా కలపండి. గుజ్జుచేసిన అరటి పండు మరియు వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసి మరలా కలపండి. దీనికి బాదం, పెకాన్స్, డ్రై ఫ్రూట్స్ చేర్చండి. తక్కువ వేడి మీద చిన్న సాస్-పాన్ ఉంచండి. దీనిలో లో-ఫాట్ ఆల్మండ్ బట్టర్ మరియు తేనెను చేర్చి, కొద్దిగా వెచ్చగా అయ్యే వరకు, ఆల్మండ్ బట్టర్ కరిగే వరకు స్టిర్ చేయండి. దీనిని గ్రనోలా బార్ మిశ్రమంలో వేసి బాగుగా కలపండి. ఈ మొత్తాలను తయారుచేసిన పాన్లోనికి పోయండి మరియు చేతులతో లేదా సంబంధిత గరిటెలతో గట్టిగా నొక్కండి. 25 నిముషాలపాటు, అంచులు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. కత్తిరించే ముందు పూర్తిగా చల్లబడనివ్వండి.

పండిన అరటి పండ్ల మూలంగా తలెత్తే దుష్ప్రభావాలు :

అధిక చక్కెరలు ఉన్న కారణంగా, బాగా పండిన అరటి పండును మధుమేహ రోగులకు సిఫారసు చేయబడదు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Surprising Health Benefits Of Eating Overripe Bananas

Rich in potassium, manganese, fibre, copper, vitamin C, and vitamin B6, overripe banana improves digestion, PMS symptoms & cardiovascular health. Regularly consuming them can aid in regulating the proper flow of blood as well as in clearing out any blockages in the arteries. They can naturally help increase your blood levels and can kill cancerous and abnormal cells.
Story first published: Tuesday, March 26, 2019, 15:27 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more