For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల ఛాతీ తగ్గించే 8 అద్భుత వ్యాయామాలు!

By Super
|

మీరు పురుషులా ? చాతీ వదులుగా వుండి రొమ్ములు వేలాడుతూ సమస్యలతో బాధ పడుతున్నారా ? అద్దంలో మీ శరీరాన్ని చూసుకొని మీరే అసహ్యంచు కుంటున్నారా ? ఇతరులు మీ చాతీ చూసి ఎగతాళి చేస్తున్నారా ? ఈ ప్రశ్నలకు మీ సమాధానం అవును అయితే, మీరు ఈ సమస్యలన్నిటికీ గుడ్ బై చెప్పాల్సిందే. వేలాడే మీ రొమ్ములు ఎలా బిగువు చేసుకోవాలి , అందుకు అవసరమైన వ్యాయామాలు ఏమిటి అనేవి మేము వివరిస్తున్నాం. చాతీ రొమ్ములు వేలాడుతున్నాయంటే అనేక కారణాలు వుంటాయి. కారణం మీరు వాడిన మెడిసిన్ ల సైడ్ ఎఫెక్ట్ లు కావచ్చు, అధిక ఆహారం కావచ్చు, లేదా పుటుక తో వచ్చిన సమస్య కావచ్చు. అంత మాత్రం చేత దీనికి నివారణ లేదు అనుకోకండి. సరైన వ్యాయామాలతో మీ వేలాడే చాతీని బిగువు చేసికొనవచ్చు.

ఈ ఆర్టికల్ లో మేము మీకు వేలాడే చాతీని ఏ రకం వ్యాయామంతో ఎలా బిగువు చేసికొనవచ్చు , ఎలా ఆకర్షనీయం చేసుకొనవచ్చు అనేది తెలియ చేస్తున్నాం. అయితే, ఈ వ్యాయామాలు, మీరు నూనె వస్తువులు, ఇతర జంక్ ఆహారాలు, అధిక ఆహారం తినటం, స్వీట్ లు తినటం వంటివి చేయనంతవరకూ పని చేస్తాయి. వ్యాయామాలు కూడా సరైన రీతిలో చేయాలి. లేదంటే, మీ కృషిలో మీకు 40 శాతం ఫలితాలు మాత్రమే లభిస్తాయి.

రన్నింగ్ లేదా పరుగు

రన్నింగ్ లేదా పరుగు

ఛాతీపై వేలాడే రొమ్ములు కల మీకు కేలరీలు తగ్గించటం ప్రధానం. దీనికి గాను మీరు రెగ్యులర్ గా పరుగు పెడుతూ మీ లోని అదనపు కొవ్వును కరిగించాలి. పొట్ట, చాతీ రొమ్ముల నుండి కొవ్వు కరిగేందుకు ఇది తోడ్పడుతుంది. రన్నింగ్ లో మీ శరీరంలోని వెంట్రుకలనుండి కాలి వేళ్ళ వరకూ వేగంగా కదులుతాయి. ఈ పరుగు మీ కొవ్వును 70 నుండి 80 శాతం వరకు కరిగిస్తుంది. ప్రతి రోజూ కనీసం రెండు కి.మీ.ల దూరం పరుగు పెట్టాలి. పరుగు మధ్యలో సమస్య అనిపిస్తే వెంటనే జాగింగ్ కు మారండి. నడక గురించి మాత్రం ఆలోచించకండి.

రోప్ స్కిప్పింగ్ లేదా తాడు ఆట

రోప్ స్కిప్పింగ్ లేదా తాడు ఆట

వేలాడే మీ చాతీని బిగువు చేసేటందుకు రోప్ స్కిప్పింగ్ మరొక మంచి వ్యాయామం. చాతీ, ఇతర శరీర భాగాలనుండి ఈ వ్యాయామం నూటికి నూరు శాతం కొవ్వు తగ్గిస్తుంది. ఈ వ్యాయామం కనుక ఒక నెల రోజుల పాటు ఖచ్చితంగా చేస్తే, ఫలితాలు అద్భుతం. దీనిని మీరు రన్నింగ్ తర్వాత చేయవచ్చు. లేదా రోప్ స్కిప్పింగ్ మాత్రమే రోజుకు రెండు సార్లు చేయవచ్చు. లేదా రన్నింగ్ తర్వాత ఒకసారి , మరో మారు మీకు సమయం దొరికినపుడు చేసి ఫలితం పొందవచ్చు. రోప్ స్కిప్పింగ్ లో మీకు సమస్య వుంటే, సింపుల్ గా జంప్ చేయండి. జుంపింగ్ కనీసం 90 -150 సార్లు అయినా చేయాలి. తర్వాత దానిని పెంచాలి. రెండు లేదా మూడు మార్లుగా ఈ జంపింగ్ ప్రతి రోజూ చేస్తే ఫలితాలు బాగుంటాయి.

పుష్ అప్ లు

పుష్ అప్ లు

మీ చాతీ కి కండలు పట్టాలంటే, పుష్ అప్ లు తప్పక సహకరిస్తాయి. ఈ వ్యాయామం కొంచెం కష్టమే. కాని అసాధ్యం కాదు. పుష్ అప్ లు ఛాతీకి సరైనవి. చాతీలో కొవ్వు కరిగిస్తాయి. మొదట్లో సమస్యలు ఉన్నప్పటికీ, క్రమేనా సరైన రీతిలో చేసి ఫలితం పొందవచ్చు. ఈ వ్యాయామాన్ని మీరు రన్నింగ్ లేదా రోప్ స్కిప్పింగ్ ల తర్వాత చేయవచ్చు. పుష్ అప్ లు చేయాలంటే, ముందుగా శరీరాన్ని కొంచెం వేడి చేయాలి లేదంటే, సమస్యలు వస్తాయి.

చిన్ అప్ లు

చిన్ అప్ లు

చిన్ అప్ లు అధిక శ్రమ కలిగిస్తాయి. చేయటం కొద్దిపాటి కష్టం కూడాను. అధిక బరువు కలవారు చేయలేరు. కాని ఈ వ్యాయామం మీకు కండ పట్టించి, ఆకర్షణీయంగా చేస్తుంది. వీటిని చేయాలంటే, మీరు మొదట్లో ఇతరుల సహాయం తీసుకోండి. మీ మోకాళ్ళ నుండి మిమ్మల్ని సహాయకుడు పైకి ఎత్తతంలో సహకరిస్తాడు. కొద్ది నెలల తర్వాత మీ చేతులు బలం పొంది మీ బరువును ఎత్త గలిగినపుడు మీ అంతట మీరు వీటిని చేయగలరు.

డంబ్ బెల్ ఎత్తుడు

డంబ్ బెల్ ఎత్తుడు

డంబ్ బెల్ ఎత్తటం కూడా మీ ఛాతీకి కండ పట్టిస్తుంది. మీ చాతీ వెడల్పు పెరుగుతుంది. చాతీ ఆకర్షనీయం అవుతుంది. వీటిని చేయాలంటే, మీకు ఒక టేబుల్ మరియు డంబ్ బెల్ ల అవసరం వుంటుంది. బాలన్స్ తప్పకుండా దీనిని చేయాలి. డంబ్ బెల్ వ్యాయామం చేసేందుకు గాను యు ట్యూబ్ లో కల ట్యుటోరియల్ తప్పక చూసి శిక్షణ పొందండి.

బెంచ్ ప్రెస్

బెంచ్ ప్రెస్

చాతీ కొవ్వును కరిగించేందుకు మరొక మంచి వ్యాయామం బెంచ్ ప్రెస్. ఈ వ్యాయామం ఛాతీకి మంచి కండ పట్టించి ఆకర్షణీయంగా చేస్తుంది. బెంచ్ ప్రెస్ లలో ఇంక్లైన్, డిక్లైన్, స్ట్రెయిట్ వంటి రకాలు కలవు. ఈ వ్యాయామం పూర్తిగా చాతీ కొరకు డిజైన్ చేయబడింది. వేలాడే మీ చాతీ సరి చేసికోనేందుకు అన్నీ లేదా కొన్ని రకాలు చేసికొనవచ్చు.

టక్ జంప్

టక్ జంప్

టక్ జంప్ వ్యాయామంలో మీ ఛాతీకి మోకాలు బలంగా తగిలించాలి. కొత్తగా మొదలు పెట్టె వారికి ఈ వ్యాయామం కష్టం. అయితే, జంపింగ్ లేదా రోప్ స్కిప్పింగ్ ప్రతి రోజూ చేస్తే, ఈ ఎక్సర్ సైజు తేలికగా చేయవచ్చు. ఇది కష్టం అయినప్పటికీ, ఫలితాలు అద్భుతంగా వుంటాయి. ప్రతి రోజూ మూడు మార్లుగా 30 టక్ జంప్ ల వరకూ చేస్తే, మీ కొవ్వు కనీసం 20 శాతం ఒక నెల రోజులలో తగ్గుతుంది. వీటి సంఖ్య అధికం చేసే కొలదీ ఫలితాలు అధికంగా వుంటాయి.

మెన్ బ్రా

మెన్ బ్రా

ఈ మెన్ బ్రా ను మరీ అధికంగా వాదులు రొమ్ములు చాతీ పై కల పురుషులు ధరించాలి. మీ చాతీ రొమ్ములు బాగా వేలాడుతూ మీ వ్యాయామాలు చేయటం కష్టం గా వుంటే, ఈ మెన్ బ్రా ధరించండి. ఇది కొంచెం వింతగా ఉన్నప్పటికీ, మీకు సౌకర్యం, ప్రయోజనం కలిగించి, వ్యాయామాలు చేసుకునేలా చేస్తుంది. కనుక మొదట్లో కనీసం రెండు లేదా మూడు నెలలు దీనిని ధరించి వ్యాయామాలు చేయండి. చాతీ కొవ్వు కరిగి కండ పట్టి బిగువు ఏర్పడగానే బ్రా తొలగించి ఆకర్షణీయ చాతీ తో గర్వంగా తిరగండి.

గమనిక :

పురుషుల వేలాడే రొమ్ములు అరికట్టాలంటే, మొదటి మూడు వ్యాయామాలు చాలా ప్రధానం. తక్కువ సమయంలో అధిక ఫలితాలు రావాలంటే, ప్రతి రోజూ తప్పక ఈ వ్యాయామాలు చేసి ఫలితాలు సాధించండి.

English summary

8 effective exercises to reduce man boobs

Are you a man? Are you suffering from problem of saggy chest? Are feel shame when you see your body in mirror? Are people teasing you? If your answer is yes, then this is time to change and say bye to your all problems.
Story first published: Friday, January 24, 2014, 13:15 [IST]
Desktop Bottom Promotion