For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

50ఏళ్ళ మహిళలకు తప్పనిసరిగా అవసరం అయ్యే విటమిన్స్ అండ్ మినిరల్స్

By Super
|

సహజంగా మహిళలు 50ఏళ్ళు దాటిన తర్వాత శరీరంలో అనేక మార్పులు వస్తాయి . ఈ వయస్సులో ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన న్యూట్రీషియన్స్ ఎక్కువగా అవసరం అవుతాయి. మహిళలు 50ఏళ్ళు దాటిన తర్వాత వారికి అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్ ను లిస్ట్ అవుట్ చేయడం జరిగినది .

మరి ఈ విటమిన్స్ మరియు మినిరల్స్ 50 ఏళ్లు పైబడ్డ వారి రెగ్యులర్ డైట్ లో ఏవిధంగా చేర్చుకోవాలన్న విషయంను తెలుసుకుందాం...

పొటాషియం

పొటాషియం

మహిళల్లో వయస్సు పెరిగేకొద్ది అనేక ఆనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి.అలాంటి వాటిలో ఇన్ఫ్లమేషన్, బ్లడ్ ప్రెజర్ తగ్గించుకోవడానికి, శరీరంలో వాటర్ ను బ్యాలెన్స్ చేయడానికి పొటాషియం అధికంగా అవసరం అవుతుంది. అలాగే హార్ట్ , కిడ్నీ, మజిల్స్, మరియు నాడీవ్యవస్థ జీవక్రియలు క్రమంగా పనిచేయాలంటే పొటాషియం ముఖ్య పాత్ర వహిస్తుంది. మహిళలు తీసుకొనే సప్లిమెంట్స్ లో అత్యవసరమైనది పొటాషియం. లేదా కాంటిలోప్, మొలకలు, బ్రొకోలీ, స్వీట్ పొటాటో మరియు పెరగులో పుష్కలంగా ఉండే ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

విటమిన్ డి

విటమిన్ డి

విటమిన్ డి శరీరంలో కొన్ని ముఖ్యమైన పనులకు ఉపయోగపడుతుంది. ఇది హెల్తీ హార్మోన్ ఉత్పత్తికి, ముఖ్యంగా మోనోపాజ్ తర్వాత అవసరం అయ్యే హార్మోనుల ఉత్పత్తికి అవసరంఅవుతుంది. వదులైయ్యే చర్మానికి సూర్య రశ్మి నుండి వెలువడే విటమిన్ డి ఎంతో అవసరం అవుతుంది . అది తక్కువే అయినా అది కూడా మోనోపాజ్ వారికి కొద్దోగొప్పో సహాయపడుతుంది. కాబట్టి, డి విటమిన్ అధికంగా ఉండే ఫ్యాటీ ఫిష్, ఫోర్టిఫైడ్ మిల్క్ మరియు జ్యూస్, లేదా సప్లిమెంట్ ద్వారా విటమిడిని పొందవచ్చు

మెగ్నీషియం

మెగ్నీషియం

మోనోపాజ్ లో ఉండే మహిళలకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ ఒకటి మెగ్నీషియం. ఇది క్యాల్షియం గ్రహించడానికి చాలా అవసరం . వివిధరకాల వ్యాధుల నుండి రక్షించడానికి అవసరం అయ్యే వ్యాధినిరోధకశక్తిపెంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. హార్ట్ రిథమ్ ను క్రమబద్దంచేసే మెగ్నీషియం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, పాలు, త్రుణధాన్యాలు మరియు నట్స్ లో పుష్కలంగా ఉన్న ఆహారాలను రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవడం లేదా సప్లిమెంట్ తీసుకోవడం మంచిది.

సెలీనియం:

సెలీనియం:

సెలీనియంలో యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి సెల్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది . దాంతో వివిధ రకాల క్యాన్సర్ల నుండి రక్షణ కల్పిస్తుంది . కాబట్టి మోనోపాజ్ మహిళలు ప్రతి రోజూ తీసుకొనే డైట్లో కొద్దిగా సెలీనియం ఉండే ఆహారాలను తీసుకోవాలి .

జింక్

జింక్

జింక్ వాసన గుర్తించే లక్షణాలను కలిగి ఉంటుంది . వయస్సు ఎంత పెరిగినా, వాసన తెలుసుకొనేందుకు, వ్యాధినిరోధకశక్తి పెంచుకోవడానికి మరియు గాయాలను నయం చేసుకోవడానికి జింక్ చాలా అవసరం అవుతుంది. కాబట్టి, జింక్ అధికంగా ఉండే సీఫుడ్స్, గుడ్లు, బీన్స్, ఉల్లిపాయలు, మరియు సీడ్స్ రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా చేర్చుకోవాలి..

కాల్షియం:

కాల్షియం:

క్యాల్షియం దంతాలు మరియు ఎముకలు స్ట్రాంగ్ గా ఉండటానికి , జీర్ణాశయ వ్యాదులు నుండి రక్షించుకోవడానికి , ఓస్ట్రియో ఫోసిస్ నుండి రక్షణ పొందడానికి క్యాల్షియం చాలా అవసరం అవుతుంది . మరియు ఇది హార్ట్ బీట్ ను నార్మల్ గా ఉంచుతుంది మరియు గాయపడినప్పుడ హెల్తీ బ్లడ్ క్లాట్స్ కు సహాయపడుతుంది. క్యాల్షియం డైరీప్రొడక్ట్స్, ఆకుకూరలు, కేలా, మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి, వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

విటమిన్ కె

విటమిన్ కె

విటమిన్ కె ఎముకల ఆరోగ్యానికి , ఫ్రాక్చర్ నుండి తిరిగి కోలుకోవడానికి సహాయపడుతుంది . మరియు శరీరంలో బ్లడ్ క్లాట్ నార్మల్ గా డిజాల్వ్ అవ్వడానికి సహాయపడుతుంది . ప్లాంట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె లేదా సన్ ఫ్లవర్ ఆయిల్ తో తయారుచేసే వంటలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి . ఇంకా గ్రీన్ లీఫ్, క్యాబేజ్, మరియు కాలీఫ్లవర్ లో పుష్కలంగా అందుతుంది .

విటమిన్ బి 12

విటమిన్ బి 12

విటమిన్ బి12 నాడీవ్యవస్థను, హెల్తీ రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది మాంసాహరం, సీఫుడ్, మరియు డైరీప్రొడక్ట్స్ లో పుష్కలంగా ఉంటుంది. ఇవి స్టొమక్ యాసిడ్స్ ను తగ్గుతాయి. దాంతో శరీరం బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ కారణంగా 50ఏళ్లు దాటిని మహిళలకు బి12 సప్లిమెంట్ తీసుకోమని చాలా మంది డాక్టర్లు సలహాలిస్తుంటారు.

విటమిన్ ఎ

విటమిన్ ఎ

విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది. మరియు డ్రై ఐస్ ను నివారిస్తుంది. మరియు ఇది హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి సహాయపడుతుంది. దంత మరియు చర్మ ఆరోగ్యానికి, నార్మల్ సెల్ గ్రోత్ కు సహాయపడుతుంది. విటమిన్ ఎ మీ రెగ్యులర్ డైట్ లోచేర్చుకోవాలి. బ్రొకోలీ, ఆకుకూరలు, ఆరెంజ్ వెజిటేబుల్స్ క్యారెట్ లేదా స్వీట్ పొటాటో, మరియు బ్రైట్ ఫ్రూట్ పింక్ గ్రేఫ్ ఫ్రూట్ లేదా ఆప్రికాట్ వంటి ఆహారాలు తీసుకోవాలి.

విటమిన్ ఇ

విటమిన్ ఇ

విటమిన్ ఇ ఒక యాంటీఆక్సిడెంట్, అంటే క్యాన్సర్ మరియు ఇతర వ్యాధుల వల్ల సెల్ డ్యామేజ్ జరగకుండా సహాయపడుతుది . మరియు ఇది స్కిన్ హెల్త్ కు కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఏజింగ్ బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి. మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది . సీడ్స్ అండ్ నట్స్ లో చాలా వరకూ విటమిన్ ఇ అధికంగా కనుగొనడం జరగుతున్నది . అదే విధంగా మామిడి, బ్రొకోలీ, టమోటోల్లో, స్పినాచ్, మరియు కివిలను తీసుకోవచ్చ.

English summary

10 Vitamins and Minerals Women Over 50 Need

10 Vitamins and Minerals Women Over 50 Need, As you age, your body needs more of certain nutrients in order to function at a healthy level. We’ve rounded up ten of the most important vitamins and minerals for women over 50, as well as tips for how you can incorporate them into your diet.
Story first published:Saturday, December 26, 2015, 12:01 [IST]
Desktop Bottom Promotion