For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లెమన్ జ్యూస్ త్రాగుతున్నారా? ఐతే అందులోని సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి...

|

సాధారణంగా చాలా వరకూ డాక్టర్లు మరియు ఆహార నిపుణులు, స్పెషలిస్టులు ‘విటమిన్ సి' అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోమని సలహాలిస్తుంటారు. వారి అభిప్రాయం ప్రకారం, ఈ ఆహారాలను మన శరీరాన్నిఆరోగ్యంగా ఉంచుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. మానవ శరీరాలకు అత్యంత అవసరమైన ఒక పోషకాహారం ఈ ‘విటమిన్ సి' మన శరీరం విటమిన్ సి 8 అనుబంధ విటమిన్స్ గా మార్పు చెంది మన శరీర ఆరోగ్యానికి సహాయపడుతుందని అంటారు.

విటమిన్ సిలో ఆస్కోర్బిక్ యాసిడ్ కలిగి ఉంటుందని, ఇది ఫుడ్ యాడిటివ్ గా తీసుకోవడం వల్ల యాక్సిడేషన్ ను నివారిస్తుందని చెబుతారు. ఈ విటమిన్ సి తాజాగా ఉండే ఆరెంజ్, మరియు నిమ్మ వంటి వాటిలో అత్యధికంగా ఉన్న విషయం తెలిసిందే. నిజానికి విటమిన్ సి దంత ఆరోగ్యానికి కూడా చాలా ఆరోగ్యకరమైనది. వివిధ రకాల కారణాల చేత విటమిన్ సి మన శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ, విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మరసంలో కూడా కొన్ని దుష్ప్రభావాలు దాగి ఉన్నాయి. అవేంటంటే...

దంతాలు సలుపడం:

దంతాలు సలుపడం:

విటమినస్ సి అధికంగా ఉండే నిమ్మరసం దంతాలకు తగిలిన వెంటనే అందులో ఉండే అసిడిక్ కంటెంట్ వల్ల దంతాల మీద ఎండే ఎనిమిల్ ను తగ్గించేస్తుంది మరియు దంతాలను మరింత సెన్షిటివ్ గా మార్చేస్తుంది. కాబట్టి, లెమన్ జ్యూస్ ను నేరుగా అలాగే తీసుకోకుండా లెమన్ జ్యూస్ కు మరేదైనా మిక్స్ ఫ్రూట్ జ్యూస్ మిక్స్ చేసి తీసుకోవాలి.

హార్ట్ బర్న్:

హార్ట్ బర్న్:

విటమిన్ సి అధికగా ఉన్న నిమ్మరం త్రాగడం వల్ల హార్ట్ బర్నింగ్ గా అనిపిస్తుంది. అలాగే అసిడిక్ ఫుడ్స్ మరియు డ్రింక్స్ హార్ట్ బర్న్ లక్షణాలను నివారిస్తుంది . కాబట్టి, నిమ్మరసంను మితంగా తీసుకోవాలి.

స్టొమక్ అప్ సెట్ అవుతుంది:

స్టొమక్ అప్ సెట్ అవుతుంది:

ఎక్కువగా నిమ్మరసం త్రాగడం వల్ల స్టొమక్ అప్ సెట్ అవుతుంది. నిమ్మరసంలో అసిడిక్ లెవల్స్ అధికంగా ఉండటం వల్ల మ్యూకస్ మెంబరేన్ కు చిరాకు కలిగిస్తుంది. దాంతో పొట్టనొప్పి మరియు అసిడిక్ రిఫ్లెక్షన్ కలిగిస్తుంది లేదా హార్ట్ బర్న్ కు గురిచేస్తుంది . లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల ఇది ఒక సైడ్ ఎఫెక్ట్.

ఫ్రీక్వెంట్ యూరినేషన్ మరియు డీహైడ్రేషన్:

ఫ్రీక్వెంట్ యూరినేషన్ మరియు డీహైడ్రేషన్:

నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ న్యూట్రీషియన్ ఫుడ్ లో డ్యూరియాటిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి కిడ్నీలో యూరిన్ ప్రొడక్షన్ పెంచుతుంది). అందువల్ల శరీరంలోని అదనపు ఫ్లూయిడ్స్ మరియు సోడియం తగ్గిపోవడానికి కారణం అవుతుంది . లెమన్ జ్యూస్ త్రాగిన తర్వాత కూడా డీహైడ్రేషన్ ఫీలైతే, వెంటనే లెమన్ జ్యూస్ త్రాగడం మానేయాలి.

డయేరియా:

డయేరియా:

చాలా కేసుల్లో విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల చాలా మందిలో ఎదురయ్యే ఒక మేజర్ సమస్య డయేరియా. అధికమోతాదులో విటమిన్ సి తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది.

అల్సర్:

అల్సర్:

GERD గ్యాస్ట్రియో ఫాజల్ రిఫ్లెక్స్ డిస్ ఆర్డర్ కు గురి కావల్సి వస్తుంది. ముఖ్యంగా హార్ట్ బర్న్, వికారం, మరియు వాంతులు లక్షణాలు కనబడుతాయి. ఈ లక్షణాలు, స్పైసీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, అసిడిక్ ఫుడ్స్, విటమిన్స్ సి అధికంగా ఉండే నిమ్మరసం వంటి వాటి వల్ల ఈ లక్షనాలు కనబడుతాయి.

గాల్ బ్లాడర్ సమస్యలు:

గాల్ బ్లాడర్ సమస్యలు:

నిమ్మరసంలోని ఆక్సలేట్స్ బాడీలో అధికంగా ఫ్లూయిడ్స్ ఉత్పత్తి అవ్వడానికి కారణం అవుతాయి. అంతే కాదు ఇవి, ఘనంగా మారడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు గురి కావల్సి వస్తుంది. ఆ కారణం వల్ల చికిత్సనందివ్వలేని కిడ్నీ, లేదా గాల్ బ్లాడర్ సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . కాబట్టి, లెమన్ జ్యూస్ ను నివారించడం మంచిది

English summary

7 Side Effects Of Drinking Lemon Juice: Health Tips in Telugu

Drinking lemon juice is a common remedy to detoxify our body. It is mainly used in weight loss plans. We often drink lemon juice early morning to cleanse our digestive system and to make our skin look better. Lemon juice contains nutrients like vitamin C, potassium and fibre that are essential for our body. However, this beverage may also cause side effects if you drink too much of it.
Story first published: Thursday, November 5, 2015, 18:21 [IST]
Desktop Bottom Promotion