For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హార్ట్ అటాక్, డయాబెటిస్ వంటి రిస్క్ లకు చెక్ పెట్టే బాదం...

|

బాదం: బాదంలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందని, బాదం తింటే బరువు పెరుగుతారని అపోహపడుతుంటారు. కానీ నిజనానికి బాదం తినడం వల్ల కొన్ని అదనపు పౌండ్ల బరువును తగ్గించుకోవచ్చు.

హెల్తీ స్నాక్స్ లో బాదం ఒక బెస్ట్ సూపర్ ఫుడ్ .ఎందుకంటే బాదంలో చెప్పలేనన్ని న్యూట్రీషియన్స్ దాగి ఉంటాయి. అలాగే బాదంలోని ఆరోగ్య ప్రయోజనాలు కూడా చెప్పలేనన్ని సంఖ్యలో ఉంటాయి. బాదంలోని ఆరోగ్య ప్రయోజనాలను లెక్క పెట్టలేము. ఆరోగ్య పరంగా, శ్వాససంబంధిత సమస్యలను, మలబద్దకం, దగ్గు, హార్ట్ అటాక్, అనీమియా, లైంగిక సమస్యలు, డయాబెటిస్ మరియు బాడీ వెయిట్ కంట్రోల్ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది . అంతకాదు, స్కిన్ మరియు హెయిర్ కేర్ విషయంలో కూడా చాలా గ్రేట్ గా పనిచేస్తుంది.

ఇంకా బాదం దంత సంరక్షణలో కూడా ఉపయోగిస్తుంటారు మరియు గ్రేట్ మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటాయి. వీటిని 3,4 తింటే చాలు పొట్ట నిండినట్లు ఉంటుంది. అయితే ఏవి కూడా మితంగా తిన్నప్పుడే ఎక్కువ ప్రయోజనాలుంటాయి.

బాదంలో విటమిన్ ఇ, క్యాల్షియం, ఫాస్పరస్, జింక్, కాపర్, సెలీనియం, ఐరన్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ గుప్పెడు బాదంలు తినడం వల్ల మన శరీర ఆరోగ్యానికి అవసరం అయ్యేన్ని న్యూట్రీషియన్స్ ను పొందవచ్చు. మరి బాదం వల్ల పొందే మరికొన్ని ప్రయోజనాలను క్రింది స్లైడ్ లో...

హార్ట్ హెల్త్:

హార్ట్ హెల్త్:

బాదంలో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ మరియు పొటాషియం, పుష్కలంగా ఉన్నాయి . కాబట్టి, బాదం హార్ట్ కు చాలా మేలు చేస్తాయి . బాదంలో ఉండే విటమిన్ ఇ హార్ట్ డిసీజ్ లను తగ్గిస్తాయి మరియు మెగ్నీషీయం హార్ట్ అటాక్ ను నివారిస్తుంది మరియు హార్టరీ డ్యామేజింగ్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

ఎనర్జీ అందిస్తుంది:

ఎనర్జీ అందిస్తుంది:

గుప్పెడు బాదం తినడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. మ్యాంగనీస్, కాపర్ మరియు రిబోఫ్లోవిన్ లు ఎనర్జీని అందివ్వడానికి మరియు మెటబాలిక్ రేట్ పెంచడానికి సహాయపడుతాయి.

కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తాయి:

కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తాయి:

బాదంలో ఉండే విటమిన్ ఇ మరియు క్యాల్షియం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

బ్రెయిన్ ఫుడ్:

బ్రెయిన్ ఫుడ్:

బాదం జ్ఝాపకశక్తి పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుందని భావిస్తారు. మెమరీ పవర్ ను పెంచుతుంది. బాదం తినడం వల్ల మెదడకు కావల్సిన శక్తిని పెంచుతుంది. బాదంలో ఉండే రెబోఫ్లెవిన్ మరియు ఎల్ కార్నిటిన్ బ్రెయిన్ యాక్టివిటీస్ ను పెంచుతుంది. మరియు మతిమరుపు నివారిస్తుంది.

బోన్ హెల్త్:

బోన్ హెల్త్:

బాదంలో ఉండే విటమిన్స్, మినిరల్స్, మరియు ఫాస్పరస్ బోన్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతాయి . ఎముకకు బలాన్ని అందివ్వడం మాత్రమే కాదు, దంతసంరక్షణకు కూడా సహాయపడుతుంది . ఓస్టిరియోఫోసిస్ ను నివారిస్తుంది.

 వ్యాధి నిరోధకత పెంచుతుంది:

వ్యాధి నిరోధకత పెంచుతుంది:

బాదంలో ఆల్కలైన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటిని పెంచుతాయి మరియు విటమిన్ ఇ మరియు పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల అన్ని రకాల మేజర్ హెల్త్ సమస్యలను నివారిస్తుంది.

 బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేస్తుంది:

బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేస్తుంది:

బాదంలో ఉండే పొటాషియం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

క్యాన్సర్ నివారిస్తుంది:

క్యాన్సర్ నివారిస్తుంది:

కోలన్ క్యాన్సర్ రిస్క్ నుండి మనల్ని రక్షిస్తుంది .

డయాబెటిస్:

డయాబెటిస్:

రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది, దాంతో డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది. బోజనం తర్వాత గుప్పెడు బాదం తింటే ఇన్సులిన్ లెవల్స్ తగ్గిస్తుంది.

English summary

Reasons To Eat Almonds Everyday: Health Benefits in Telugu

Reasons To Eat Almonds Everyday: Health Benefits in Telugu, There is a misconception that almonds are full of fats and contributes weight gain. But in reality almonds actually help to shed those extra pounds. Almonds are one of the best super foods that can be considered as a healthy snack.
Story first published: Friday, October 30, 2015, 18:15 [IST]
Desktop Bottom Promotion