For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలోని ప్రతి అవయవానికి శక్తినిచ్చే ఆహారాలు

By Nutheti
|

ఆరోగ్యంగా ఉండటానికి రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాం. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు. ప్రతి ఒక్కరూ చక్కటి ఆరోగ్యాన్నే కోరుకుంటారు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా.. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా గడపాలంటే.. తీసుకునే ఆహారం సరైనది అయి ఉండాలి. సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవాలి. హానికారక పదార్థాలకు దూరంగా ఉంటూ, మేలు చేసే ఆహారాన్ని డైట్ లో చేర్చుకోవాలి.

తాజా పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. ఉపవాసాల సమయంలో ఎక్కువగా పండ్లు, పండ్ల రసాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకో తెలుసా ? ఇవి శరీరంలో పేరుకున్న మలినాలన్నింటినీ బయటకు పంపుతాయి. ఆరోగ్యానికి హాని కలిగించే వ్యర్థాలను తొలగిస్తాయి. అది ఫ్రూట్స్ లో ఉన్న హీలింగ్ పవర్. తాజా పళ్ల రసాలు శరీరంలో ఎక్కడ ఏ లోపమున్నా వెంటనే సరిచేస్తాయి. మనం తినే ఆహారం ఎలా ఉపయోగపడుతుందో ఎప్పుడైనా గ్రహించారా ? ఇప్పుడు అదే తెలుసుకుందాం. ఆరోగ్యానికి మంచి చేసే సూపర్ ఫుడ్స్ ఏంటి ? శరీరంలోని ఏ భాగాన్ని ఏ పదార్థం హీల్ చేస్తుంది ?

నిమ్మరసం

నిమ్మరసం

ఇది రోగ నిరోధక వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది. చర్మ గ్రంథులను టైట్ చేసి నిగారింపు రావడానికి సహాయపడుతుంది. రోజంతా నీటిలో నిమ్మకాయను నానపెట్టి ఆ నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

యాపిల్స్

యాపిల్స్

రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదు అని వింటూ ఉంటాం. యాపిల్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఇది శరీరంలో ఉన్న అధిక టాక్సిన్స్ ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. రక్తప్రసరణ మెరుగ్గా జరగడానికి యాపిల్స్ ఉపయోగపడతాయి.

ద్రాక్ష

ద్రాక్ష

ద్రాక్ష బ్లడ్ కి, పెద్ద పేగు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఉదయం టిఫిన్ తో పాటు గ్రేప్ జ్యూస్ తాగడం మంచిది.

అవకాడో

అవకాడో

అవకాడోలో ఒమేడా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ బి, ఈ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. ఇది కురులకు మాయిశ్చరైజర్ లా, కండిషనర్ లా పనిచేస్తాయి.

దోసకాయ

దోసకాయ

హైడ్రేటింగ్ పవర్ దోసకాయల్లో మెండుగా ఉంటాయి. అలాగే చర్మ సౌందర్యానికి ఇవి సహాయపడతాయి. దోసకార తొక్కలో సిలికా ఉంటుంది. ఇది జుట్టు, చర్మం, గోళ్లకు చాలా అవసరం.

పైనాపిల్స్

పైనాపిల్స్

పైనాపిల్స్ అలర్జీలు, శ్వాస సంబంధిత వ్యాధులను నివారిస్తాయి. అలాగే కంటిచూపు మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి.

క్యారట్స్

క్యారట్స్

క్యారట్స్ లో క్యారటనాయిడ్స్, బెటా క్యారటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం గ్లోయింగ్ గా మారడానికి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

బొప్పాయి

బొప్పాయి

జీర్ణవ్యవస్థను శుభ్రం చేయడానికి బొప్పాయి పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఇందులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బొప్పాయి ద్వారా డైజెషన్ బాగా జరుగుతుంది.. దీనివల్ల చర్మం కూడా నిగారింపు సంతరించుకుంటుంది.

పుచ్చకాయ

పుచ్చకాయ

హైడ్రేటింగ్, క్లెన్సింగ్ వంటి గుణాలు వాటర్ మిలాన్ లో ఎక్కువగా ఉంటాయి. ఒక పుచ్చకాయలో 28 గ్రాముల పోషకాలు, 7 గ్రాముల మోనో అన్ స్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఆరంజ్

ఆరంజ్

ఆరంజెస్ శరీరం మొత్తానికి మంచి ప్రయోజనాలు కలిగిస్తాయి. ఉదయాన్నే కాఫీకి బదులు ఆరంజ్ జ్యూస్ తాగి చూడండి.. అద్భుతమైన తేడా మీకే తెలుస్తుంది.

చెర్రీస్

చెర్రీస్

ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ చెర్రీ జ్యూస్ ని వారానికి ఒకసారైనా తీసుకోవడం వల్ల కండరాలు బలంగా మారతాయి.

English summary

Superfoods that heal your entire Body in telugu

Do you know why many people prefer juice fasting over any other method when it comes to detoxifying the body? Well, the reason is the the healing power of fruits! Are fruits healthy? Yes fruits heal. They enhance your health.
Story first published: Friday, November 27, 2015, 15:27 [IST]
Desktop Bottom Promotion