For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెసలతో పొందే ప్రయోజనాలెన్నో..

By Nutheti
|

పాయసంగా.. పొంగలిగా.. మొలకెత్తిన గింజలు.. సున్నండలు.. పెసరట్టు.. ఎలా తీసుకున్నా.. పెసల రుచి అమోఘంగా ఉంటుంది. కమ్మని రుచి.. సువాసనతో తింటుంటే తినాలిపిస్తాయి పెసల వంటకాలు. రకరకాల వంటకాల్లో, చర్మ సౌందర్య సాధనాల్లో ఉపయోగించే పెసలు.. ఆరోగ్య ప్రయోజనాల గనిగా చెప్పవచ్చు.

READ MORE: వేసవిలో సన్ టాన్ నివారిస్తుంది, చర్మం తెల్లగా మార్చుతుంది

భారతీయ సంప్రదాయ ఆహారాల్లో పెసలు ఒకటి. పూర్వం నుంచి ఎక్కువగా పెసలు వాడుతూ వస్తున్నాం. ఇప్పుడు మూంగ్ దాల్ అంటూ వచ్చిన స్నాక్ ఐటమ్ చిన్నా, పెద్దా అందరికి ప్రియమే. ఈ ఇష్టమైన పెసలలో చాలా ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీస్ తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అంతేకాదు సూర్యుని నుంచి వచ్చే అతినీలిలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యల నుంచి కాపాడటానికి పెసలు సహకరిస్తాయి. ఇంతేనా పెసలలో ఇంకా చాలా హెల్త్ బెన్ఫిట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం..

పోషకాలు

పోషకాలు

పెసలు పోషకాల సమ్మేళనం. వీటిలో విటమిన్ ఎ, బి, సి, ఈ, ఖనిజ లవణాలు, క్యాల్షియం, ఇనుము, పొటాషియంతోపాటు మాంసకృత్తులు, పీచు ఉంటుంది.

బీపీ

బీపీ

పెసలు తరచుగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. దీనివల్ల గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ. పెసలు తింటే ఆరోగ్యంతో పాటు యాక్టివ్ గా ఉండటానికీ సహకరిస్తాయి.

రక్తహీనత

రక్తహీనత

పెసలలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజు వారీ ఆహారంలో పెసల్ని చేర్చుకుంటే.. అనీమియా సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

బరువు తగ్గాలనుకునే వారికి పెసలు మంచి పరిష్కారం. రైస్ మాత్రమే కాకుండా.. బియ్యంతో పాటు కాసిన్ని పెసలు జోడించి వండుకుని తినడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్

డయాబెటిస్

పెసల్లో రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గించే గుణం ఉంది. కాబట్టి మీ డైట్ లో పెసలను చేర్చుకోవడం వల్ల.. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. క్యాన్సర్ బారిన పడకుండా చేస్తాయి. వీటిని తరచుగా తీసుకునే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కు అవకాశముండదు.

జీర్ణశక్తి

జీర్ణశక్తి

పెసలు తీసుకోవడం వల్ల జీర్ణం సులువుగా అయ్యేట్లు సహాయపడతాయి. అంతేకాదు పెసలు ఇమ్యూనిటీ శక్తి పెంచుతాయి. కాబట్టి ఇన్‌ఫెక్షన్స్‌ దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి.

నొప్పులకు

నొప్పులకు

పెసలు తినటం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినదు. కండరాల నొప్పి, తలనొప్పి, నీరసాన్ని తగ్గించి చురుకుగా ఉంచడానికి పెసలు తోడ్పడతాయి.

ఐరన్

ఐరన్

ఐరన్ లోపంతో బాధపడేవాళ్లు పెసలు తప్పకుండా తీసుకోవాలి. వెజిటేరియన్స్ లో ఎక్కువగా ఐరన్ లోపం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రోజు వారీ ఆహారంలో పెసలను చేర్చుకోవడం వల్ల అవసరమైన ఐరన్ ను ఈజీగా పొందవచ్చు.

చర్మ సమస్యలకు

చర్మ సమస్యలకు

పెసలు శరీరంలో వేడిని తగ్గిస్తాయి. ఇవి వడదెబ్బ కొట్టినప్పుడు, చెమట కాయలు, దురదలు దద్దుర్లు వచ్చినప్పుడు వాడితే మంచి ఫలితం ఉంటుంది. కాలిన గాయాలు, ఎప్పటికీ మానని పుండ్లతో బాధపడే వాళ్లకు, ఆపరేషన్లు అయిన వారికీ పెసలు వంటలు పెట్టడం వల్ల ఉపశమనం కలుగుతుంది. సున్నిపిండిలో కూడా పెసలను వాడుతారు. దీనిని వాడినా.. చర్మం ముడతలు పడకుండా.. నిగారింపు సంతరించుకుంటుంది.

English summary

Why green gram or moong dal is good for health in telugu

Green gram is one of the best vegetarian superfoods that has been praised for its amazing health benefits. It is known as moong dal in India and is basically a tiny circular shaped bean that is green in colour. It is loaded with vitamins has an edible taste.
Story first published: Thursday, November 5, 2015, 10:45 [IST]
Desktop Bottom Promotion