For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్ గా తీసుకోవాల్సిన తక్కువ క్యాలరీలు ఉండే వెజిటబుల్స్..!

By Swathi
|

ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఆకలిని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. కానీ.. ఆకలిగా ఉన్నప్పుడు ఏది పడితే అది తినేస్తారు. క్యాలరీలు, ఫ్యాట్ గురించి పట్టించుకోకుండా.. ఆకలి తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ.. ఆకలితో పోరాడటం ఎలా అనేది చాలా మందికి తెలియదు.

ఆకలితో ఇబ్బందిపడేవాళ్లు.. ఏది పడితే అది తినకుండా.. లో క్యాలరీ వెజిటబుల్స్ తీసుకోవడం చాలామంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా లోక్యాలరీ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల బరువు పెరగడాన్ని అరికట్టవచ్చు. అలాగే ఎక్కువ మొత్తంలో తీసుకున్నా.. ఎలాంటి సమస్యా రాకుండా ఉంటుంది. సలాడ్స్, పచ్చి కూరగాయలు తినడానికి ఎవరూ ఇష్టపడరు. అలాంటివాళ్లకు.. ఇక్కడో అద్భుతమైన ఐడియా ఉంది. ఆకలిగా ఉన్నప్పుడు.. తక్కువ క్యాలరీలు ఉండే వెజిటబుల్స్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

స్ప్రౌట్స్

స్ప్రౌట్స్

చిన్నగా క్యాబేజీల్లా ఉండే వీటిని స్ప్రౌట్స్ అంటారు. వీటిల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ కె, సి ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి ఆకలిగా అనిపించినప్పుడు వీటిని తీసుకుంటే.. క్యాలరీల భయం ఉండదు. బరువు పెరుగుతామనే బెంగ ఉండదు.

టొమాటో

టొమాటో

టమోటాల్లో పొటాషియం, విటమిన్ సి ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం మంచిది.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

ఉల్లిపాయలు లేకుండా ఏ వంటకం పూర్తికాదు. టేస్ట్ కి తగ్గట్టే ఇవి హెల్త్ కి మంచిది. వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. 100 గ్రాముల ఉల్లిపాయల్లో కేవలం 9 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.

క్యాలీఫ్లవర్

క్యాలీఫ్లవర్

క్యాలీఫ్లవర్ లో కేవలం 5 గ్రాముల కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఫోలేట్, విటమిన్ కే, సి ఉంటాయి. క్యాలీఫ్లవర్ ని డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది.. హెల్తీగానూ ఉంటారు.

బ్రొకోలి

బ్రొకోలి

బ్రొకోలిలో విటమిన్ కే, సి ఎక్కువగా ఉంటాయి. ఇది క్యాన్సర్ నివారిస్తుంది. అలాగే.. కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ గా తీసుకోవచ్చు.

ఆస్పారగస్

ఆస్పారగస్

ఇందులో విటమిన్ కే, సిలతోపాటు ఫోలేట్, ఫైబర్ కూడా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకున్నా ఏమీ కాదు. ఎందుకంటే.. లో క్యాలరీలు ఉంటాయి కాబట్టి.. వీటిని డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది.

English summary

6 Low-Calorie Veggies To Munch Regularly

6 Low-Calorie Veggies To Munch Regularly. The problem is: when you are hungry you feel like eating a lot. Controlling your cravings at that time is a very big challenge.
Story first published:Monday, June 27, 2016, 16:34 [IST]
Desktop Bottom Promotion