For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనం ఫాలో అవుతున్న అన్ హెల్తీ డేంజ‌ర్ హ్యాబిట్స్..!!

By Swathi
|

హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవడం చాలా సాధారణం. కానీ కొన్ని మంచి అలవాట్లు.. ఎక్కువగా చేయడం వల్ల అనారోగ్యకరంగా మారుతాయి. అదేంటి అనుకుంటున్నారా ? అవును దేనికైనా పరిమితి ఉంటుంది. అంతకుమించి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

ఆరోగ్యకరమైన అలవాట్లు ఫాలో అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ తప్పులు చేయకూడదు అనేదానిపై అవగాహన ఉండాలి. కాబట్టి ఆరోగ్యకరమే అయినా.. ఆరోగ్యానికి కారణమయ్యే.. ఆ అలవాట్లు, వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఓ సారి చూద్దాం.

Healthy Habits That Are Extremely Unhealthy

నీళ్లు తాగడం
పెద్దవాళ్లు రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. కానీ అంతకంటే ఎక్కువ తాగడం మంచిది కాదు. 8 గ్లాసుల కంటే ఎక్కువ తాగడం వల్ల కిడ్నీలపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ అలవాటు మానుకోండి. అలాగే బాటిల్స్ లో నిలువ ఉంచుకుని నీళ్లు తాగడం కూడా మంచిది కాదు.

Healthy Habits That Are Extremely Unhealthy

మార్నింగ్ హ్యాబిట్స్
ఉదయాన్నే వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కాబట్టి సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

సప్లిమెంట్స్
చాలా వరెస్ట్ హెల్తీ హ్యాబిట్ ఇది. ఎందుకంటే పోషకాలు పొందడానికి తీసుకునే ట్యాబ్లెట్స్ మీరు ఆహారం ద్వారా పొందే న్యూట్రియంట్స్ ని పీల్చేస్తాయి. కాబట్టి పోషకాలు పొందడానికి ట్యాబ్లెట్స్ తీసుకోవడం కంటే.. డైట్ తీసుకోవడం మంచిది.

Healthy Habits That Are Extremely Unhealthy

భోజనం మానేయడం
భోజనాన్ని మాత్రం మానేయకండి. అలా మీల్స్ తినకపోవడం వల్ల బరువు పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాదు గ్యాస్ర్టిక్ ప్రాబ్లమ్స్, పొట్టలో సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఇలాంటి అల‌వాట్ల‌ను వెంట‌నే మానుకోవ‌డం వ‌ల్ల మీరు చాలా హెల్తీగా ఉండ‌వ‌చ్చు.

English summary

Healthy Habits That Are Extremely Unhealthy

Healthy Habits That Are Extremely Unhealthy. We have been taught that healthy habits are a must to follow. But, what if today we told you that there are some healthy habits which are actually unhealthy for you.
Story first published:Wednesday, July 27, 2016, 15:29 [IST]
Desktop Bottom Promotion