For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కింగ్ ఆఫ్ స్పైస్ అయిన వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తింటే ఏమవుతుంది ?

By Swathi
|

వెల్లుల్లిని కింగ్ ఆఫ్ స్పైసెస్ అని పిలుస్తారు. ఇది లేకుండా.. ఎలాంటి ఆహారం ఉండదంటే అతిశయోక్తి కాదు. మంచి సువాసన, ఘాటైన రుచి, అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇమిడి ఉన్న వెల్లుల్లిని ట్రెడిషనల్ స్పైస్ గా చెప్పవచ్చు. కూరలైనా, చారులైనా, చట్నీలైనా, సాంబారైనా, పప్పు అయినా, పులుసు అయినా.. వెల్లుల్లి ఘాటు తగలాల్సిందే అంటారు.

వెల్లుల్లిని 5 వేల సంవత్సరాల క్రితం నుంచి పండిస్తున్నారు. వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. పురాతన కాలం నుంచి వెల్లుల్లికి వంటింట్లో అద్భుతమైన స్థానం ఉంది. అయితే వెల్లుల్లిని ఉదయాన్నే పరగడపున తీసుకోవాలని మీకు తెలుసా ? నిజమే ఉదయాన్నే ఒక ముక్క వెల్లుల్లి తీసుకోవడం వల్ల లెక్కలేనన్ని హెల్త్ బెన్ఫిట్స్ పొందవచ్చట.

పచ్చి అల్లం తినడం వల్ల శరీరంలో జరిగే అద్భుత మార్పులు..

ఒక రెబ్బ వెల్లుల్లిలో 5 ఎమ్ జీ క్యాల్షియం, 12 ఎమ్ జీ పొటాషియం, 100 పైగా సల్ఫరిక్ ఉంటాయి. ఇన్ని గొప్ప గుణాలున్న వెల్లుల్లిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అందుకే వెల్లుల్లిని ఉదయాన్ని ఆస్వాదించాలని స్టడీస్ చెబుతున్నాయి. ఉదయాన్నే పరకడుపున వెల్లుల్లి తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం..

ఇన్ఫెక్షన్స్

ఇన్ఫెక్షన్స్

చాలా మంది ఇన్ఫెక్షన్స్ నివారించడానికి వెల్లుల్లి పేస్ట్ అప్లై చేస్తూ ఉంటారు. చేతులపై వచ్చే ఇన్ఫెక్షన్స్, మరే ఇన్ఫెక్షన్ నైనా నివారించడానికి వెల్లుల్లి చక్కటి పరిష్కారమని కొన్ని రకాల అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉదయాన్నే ఒక రెబ్బ వెల్లుల్లి తీసుకుంటే.. ఇన్ఫెక్షన్స్ దరిచేరవు.

బ్లడ్ ప్రెజర్

బ్లడ్ ప్రెజర్

వెల్లుల్లి హైపర్ టెన్షన్ ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వెల్లుల్లి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగకుండా కాపాడుతుంది.

ఇన్ల్ఫమేషన్

ఇన్ల్ఫమేషన్

వెల్లుల్లిలో కొన్ని రకాల నొప్పులు, వాపులను నివారించే గుణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.

బ్లడ్ క్లాట్

బ్లడ్ క్లాట్

వెల్లుల్లి రక్తాన్ని పలుచగా మార్చి.. బ్లడ్ క్లాట్స్ రిస్క్ ని తగ్గిస్తుందని స్టడీస్ వివరిస్తున్నాయి. కాబట్టి ఉదయాన్నే వెల్లుల్లి తీసుకోవడం మంచిది.

జలుబు, ఫ్లూ

జలుబు, ఫ్లూ

వెల్లుల్లిలో ఇన్ఫెక్షన్లను దూరం చేసే గుణం ఉంది కాబట్టి. . ఉదయాన్నే పరకడుపున వెల్లుల్లి రెబ్బ తీసుకుంటే.. జలుబు, ఫ్లూ వంటివి రాకుండా ఉంటాయి.

నరాలకు

నరాలకు

ఉదయాన్నె వెల్లుల్లి తీసుకోవడం వల్ల.. నరాల వ్యవస్థకు సంబంధించిన సమస్యలు రావు. ఒకవేళ మీరు నరాల సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే తగ్గిపోతాయి.

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్

వెల్లుల్లి బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి రోజుని వెల్లుల్లి తినడంతో ప్రారంభించండి.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది.

English summary

Here’s What Happens When You Eat Garlic On An Empty Stomach…

Here’s What Happens When You Eat Garlic On An Empty Stomach. In many cultures, garlic was revered as the “king of spices,” not just because it’s delicious, but because of the numerous health benefits it brings.
Story first published:Wednesday, April 20, 2016, 16:48 [IST]
Desktop Bottom Promotion