For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉదయం పరకడుపుతో బార్లీగంజి తాగితే పొందే అద్భుత ప్రయోజనాలు!

By Super Admin
|

బార్లీ వాటర్ ఒక హెల్తీ డ్రింక్ , బార్లీని నీటితో మిక్స్ చేసి ఉడికించడం ద్వారా బార్లీ వాటర్ తయారవుతుంది . ఇది రిఫ్రెషింగ్ డ్రింక్ లైట్ గా స్వీట్ గా కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసుకోవచ్చు. బార్లీ వాటర్ లో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిగురించి మీరు తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలగక తప్పదు. బార్లీ వాటర్ ను ఎలా తయారుచేసుకోవాలో..మరియు వాటిలోని అద్భుత ప్రయోజనాలేంటో తెలుసుకుందాం ..

ఒక సర్వింగ్ కు , రెండు టీస్పూన్ల బార్లీ తీసుకుని సాస్ పాన్ లో ఒక నిముషం ఫ్రై చేసి తర్వాత అందులో వాటర్ మిక్స్ చేయాలి. బార్లీ మెత్తబడే వారకూ ఉడికించాలి. ఉడికిన తర్వాత వడగట్టుకోవాలి. గోరువెచ్చగా మారిన తర్వాత మీకు నచ్చిన ఫ్లేవర్ తో తాగొచ్చు. దీన్ని ఒకే సారి ఎక్కువగా తయారుచేసి నిల్వచేసుకోవచ్చు కూడా. అది కూడా చాలాసింపుల్ గా కొద్దిగా ఎక్కువ మొత్తంలో బార్లీని కుక్కర్ లో వేసి దానికి డబుల్ గా నీరు మిక్స్ చేసి సాప్ట్ గా అయ్యే వరకూ ఉడికించుకోవాలి. తర్వత దీన్ని వడగట్టి, చల్లార్చి, బాటిల్లో నింపి ఫ్రింజ్ లో పెట్టుకుని, రోజుకు రెండు మూడు సార్లు తాగొచ్చు.

బార్లీ ఎటువంటివి ఎంపి చేసుకోవచ్చు? ఒరిజినల్ బార్లీబియ్యంను ఎంపికచేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దీన్ని తీసుకోవడం మంచిది.

బార్లీలో దాగున్న అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..

1. కోలన్ క్యాన్సర్ తగ్గిస్తుంది:

1. కోలన్ క్యాన్సర్ తగ్గిస్తుంది:

బార్లీ వాటర్ లో దాగున్న బీటా గ్లూకాన్ బాడీలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది . దాంతో బౌల్ మూమెంట్ సాఫీగా జరుగుతుంది. హెమరాయిడ్స్ రిస్క్ తగ్గిస్తుంది.

ప్రేగులను శుభ్రపరుస్తుంది. దాంతో కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.

2.బాడీ డిటాక్సిఫికేషన్ చేస్తుంది:

2.బాడీ డిటాక్సిఫికేషన్ చేస్తుంది:

ఇది డ్యూరియాటిక్ గా పనిచేస్తుంది, శరీరంలో నిల్వ చేరిన అదనపు వాటర్ ను మరియు టాక్సిన్స్ ను యూరిన్ రూపంలో బయటకు నెట్టేస్తుంది.

3. బాడీహీట్ తగ్గిస్తుంది:

3. బాడీహీట్ తగ్గిస్తుంది:

వేసవి సీజన్ లో దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గిస్తుంది .

4. పొట్ట సమస్యలు తగ్గిస్తుంది:

4. పొట్ట సమస్యలు తగ్గిస్తుంది:

కారంగా ఉన్న ఆహారాలు తిన్నప్పుడు కడుపులో మంటగా ఉన్నప్పుడు, బార్లీ వాటర్ ను తాగడం వల్ల బర్నింగ్ సెన్షేషన్ తగ్గిస్తుంది.

5. యాంటీఇన్ఫ్టమేటరీ:

5. యాంటీఇన్ఫ్టమేటరీ:

బార్లీ వాటర్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది . ఆర్థరైటిస్ తో బాధపడే వారు మరియు జాయింట్ పెయిన్ తో బాధపడేవారు బార్లీ వాటర్ తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

6. బీటా గ్లూకాన్ :

6. బీటా గ్లూకాన్ :

బీటా గ్లూకాన్ శరీరంలోని గ్లూకోజ్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది, దాంతో బ్లడ్ షుగక్ లెవల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. అంటే డయాబెటిక్ పేషంట్స్ బార్లీ వాటర్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటుంది.

7. డైటరీ ఫైబర్ అందుతుంది:

7. డైటరీ ఫైబర్ అందుతుంది:

రెగ్యులర్ గా బార్లీ వాటర్ తాగడం వల్ల, శరీరానికి అవసరమయ్యే డైటరీ ఫైబర్ అందుతుంది.

8. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

8. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

హైఫైబర్ కంటెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో మీ హార్ట్ హెల్తీగా ఉంటుంది.

9.బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

9.బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బార్లీ వాటర్ బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది . గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ప్రయోజనకారి . బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది. కాళ్ల వాపులను తగ్గిస్తుంది.

10. జెస్టేషనల్ డయాబెటిస్:

10. జెస్టేషనల్ డయాబెటిస్:

గర్భిణీ స్త్రీలో జస్టేషనల్ డయాబెటిస్ ను, ఈస్ట్ ఇన్ఫెక్షన్ మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.

11. ల్యాక్టేషన్ పెంచుతుంది :

11. ల్యాక్టేషన్ పెంచుతుంది :

పాలిచ్చే తల్లులు, బార్లీ వాటర్ తాగడం వల్ల పాలు పడేలా చేస్తుంది మరియు తల్లి, బిడ్డలో జీర్ణశక్తిని పెంచుతుంది.

12. కిడ్నీ స్టోన్స్ తొలగిస్తుంది:

12. కిడ్నీ స్టోన్స్ తొలగిస్తుంది:

కిడ్నీ స్టోన్స్ తొలగించడంలో బార్లీ వాటర్ గ్రేట్ రెమెడీ. రోజూ ఒక గ్లాసు బార్లీ వాటర్ తాగడం వల్ల కిడ్నీస్టోన్స్ ను యూరిన్ ద్వారా బయటకు నెట్టేస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా, మంచి ఆకారంతో ఉంటాయి.

13. బార్లీ వాటర్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది:

13. బార్లీ వాటర్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది:

ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ పొట్ట నిండుగా ఉండేట్లు చేస్తుంది ఇది షుగర్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది. రోజంతా సరపడే ఎనర్జీ లెవల్స్ ను అందిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది మరియు మెటబాలిజం రేటు పెంచుతుంది. వేగంగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక కప్పు బార్లీ వాటర్ ను ఉదయం మరియు సాయంత్రం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Make Barley Water your beverage of choice

Barley Water is a beverage made by boiling barley in water. It makes for a refreshing drink when slightly sweetened and finished off with a dash of lime. Barley Water has a number of health benefits that could surprise you. We tell you how to make Barley water and all the health benefits associated with it.
Story first published:Wednesday, August 24, 2016, 18:07 [IST]
Desktop Bottom Promotion