For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటబుల్స్ వండి తినాలా ? పచ్చిగా తినాలా ?

By Swathi
|

కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు బాగా తినాలని ప్రతి ఒక్కరూ సూచిస్తుంటారు. నిత్యం ఆహార ప్రణాళికలో ఆరోగ్యకరమైన కూరగాయలు చేర్చుకోవడం వల్ల అనేక రకాల పోషకాలు, విటమిన్స్, మినరల్స్ పొందవచ్చని చెబుతారు. అలాగే.. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు అని సూచిస్తుంటారు. అయితే.. కొన్ని కూరగాయలను మాత్రం పచ్చిగా తింటేనే మంచిదని కొంతమంది సలహాలు ఇస్తుంటారు. మరి పచ్చిగా తింటే మంచిదా.. ఉడికించి తింటే మంచిదా అనేది చాలామందిని వేధించే ప్రశ్నలు. అయితే కొన్ని కూరగాయలను ఉడికించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. మరికొన్ని కూరగాయలను పచ్చిగా తినడం వల్ల పోషకాలు పొందవచ్చు. ఇంతకీ ఏ వెజిటబుల్ ఎలా తినాలో ఇప్పుడు చూద్దాం..

పొట్టిగా ఉన్నవారికి శుభవార్త: పొడవు పెరగడానికి సహాయపడే సీక్రెట్ ఫుడ్స్ ...

Which Vegetables Are Healthier?

బీట్ రూట్
బీట్ రూట్స్ ని పచ్చిగా తింటేనే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. వీటిని ఉడికించడం వల్ల ఇవి 25 శాతం పోలేట్ ను కోల్పోతాయి. కాబట్టి పచ్చిగా తినడం వల్ల పొందే ఫోలేట్ మెదడుకి మంచిది. వీలైతే.. బీట్ రూట్ ని జ్యూస్ రూపంలో తీసుకోవడం మంచిది.

Which Vegetables Are Healthier?

మష్రూమ్స్
మష్రూమ్స్ ని ఉడకబెట్టి తీసుకోవడమే ఆరోగ్యకరం. ఉడకబెట్టి తీసుకోవడం వల్ల.. కండరాల నిర్మాణానికి ఉపయోగపడే పొటాషియం పొందవచ్చు. పుట్టగొడుగుల్లో శక్తివంతమైన పాలీశాఖరైడ్స్ ఉంటాయి. అలాగే టాక్సిన్స్ కూడా ఉంటాయి. టాక్సిన్స్ ని హరించి, పాలీశాఖరైడ్స్ శరీరానికి పొందాలంటే.. పుట్టగొడుగుల్ని ఉడికించి తీసుకోవాలి.

వెజిటేబుల్స్ క్లీన్ చేయడం మరవకండి

Which Vegetables Are Healthier?

ఉల్లిపాయలు
ఉల్లిపాయలు పచ్చివి తింటే మెండైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఒక ముక్క తింటే చాలు. ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నప్పుడే ఎక్కువ శాతం అల్లిసిన్ అనే ఫైటో న్యూట్రియంట్ ఉంటుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ రాకుండా అరికడుతుంది. కాబట్టి ఉల్లిపాయలు పచ్చిగా తినడానికే ప్రాధాన్యత ఇవ్వాలి.

Which Vegetables Are Healthier?

టమోటా
టమోటాలపై చాలా అపోహలున్నాయి. వీటిని పచ్చిగా తింటేనే మంచిదని చాలా మంది భావిస్తారు. కానీ వీటిని ఉడకబెట్టి తీసుకోవడం వల్ల క్యాన్సర్ తో పోరాడే లైకోపిన్ ని పొందవచ్చు. అలాగే టమోటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. కాబట్టి వీటిని ఉడకబెట్టి తింటేనే ప్రయోజనాలు పొందవచ్చు.

English summary

Raw or Cooked: Which Vegetables Are Healthier?

Raw or Cooked: Which Vegetables Are Healthier? Have you always wondered how to prepare vegetables in order to maximize their nutritional content? There's no easy answer, since cooking powers up the nutrients in some vegetables—and does the exact opposite in others.
Story first published: Wednesday, January 27, 2016, 15:03 [IST]
Desktop Bottom Promotion