For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ ఒక అరటిపండు నెలరోజులు తింటే పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!

By Swathi
|

చాలా సాధారణంగా.. అందరూ తీసుకునే ఫ్రూట్ బనానా. ఆకలిని తగ్గించుకోవడానికి అరటిపండుని తింటారు. ఇది.. ఏడాదంతా అందుబాటులో ఉండటం వల్ల.. దీన్ని ప్రతి ఒక్కరూ తినడానికి ఆసక్తి చూపుతారు. ఇష్టపడతారు.

కానీ.. చాలామంది అరటిపండులో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలియదు. అరటిపండు అంటే.. చాలా నిర్లక్ష్యంగా చూస్తారు. ఇందులో అద్భుతమైన పోషకాలు మిలితమై ఉంటాయి. సాధారణంగా.. రోజుకి ఒక యాపిల్ డాక్టర్ ని దూరంగా ఉంచుతుంది అంటారు. కానీ.. రోజుకి ఒక అరటిపండు కూడా.. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తుంది.

బరువు తగ్గాలనుకుంటున్నారా ? ఐతే బనానా డైట్ ఫాలో అవండి

అరటిపండులో న్యాచురల్ షుగర్, ఫైబర్, పొటాషియం, విటమిన్స్ ఉంటాయి. ఇది ఫ్యాట్, కొలెస్ట్రాల్ లేని ఫ్రూట్. అందుకే.. అరటిపండ్లను డైట్ లో కంపల్సరీ చేర్చుకోవాలని సూచిస్తారు. దీన్ని డైరెక్ట్ గా తినవచ్చు. లేదా సలాడ్స్, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. అయితే మచ్చలు ఉండే అరటిపండు ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

మచ్చలు ఉండే అరటిపండులో ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కి కారణమయ్యే కణాలను అరికడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక అరటిపండు తినడానికి ప్రయత్నించండి. ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే పొందే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..

హార్ట్ బర్న్

హార్ట్ బర్న్

మీరు కంటిన్యూగా.. హార్ట్ బర్న్ సమస్య, యాసిడ్ రిఫ్లక్స్ తో బాధపడుతున్నారంటే.. అరటిపండ్లు తింటే.. వెంటనే ఉపశమనం పొందవచ్చు.

కాన్ట్సిపేషన్

కాన్ట్సిపేషన్

కంటిన్యూగా కాన్ట్సిపేషన్ సమస్యను ఫేస్ చేస్తున్నారంటే.. ప్రతిరోజూ ఒక నెలపాటు.. అరటిపండు తింటే.. సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. బోవెల్ మూవ్ మెంట్ ని తేలిక చేస్తుంది.

ఎనర్జీ పొందడానికి

ఎనర్జీ పొందడానికి

విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల అరటిపండ్లు స్టామినా, ఎనర్జీని రోజంతా అందిస్తాయి.

బ్లడ్ ప్రెజర్

బ్లడ్ ప్రెజర్

అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెజర్ ని తగ్గిస్తుంది. స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది.

జీర్ణక్రియకు

జీర్ణక్రియకు

అరటిపండ్లలో ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి చాలా ముఖ్యమైనవి. కాబట్టి ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే.. ఎలాంటి జీర్ణసంబంధ సమస్యలు దరిచేరవు.

అనీమియా

అనీమియా

అరటిపండ్లను ప్రతిరోజూ తినడం వల్ల అనీమియా నివారించవచ్చు. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. హిమోగ్లోబిన్ పెరగడానికి, శరీరానికి బ్లడ్ సరఫరా అవడానికి సహాయపడుతుంది.

పొట్టలో అల్సర్

పొట్టలో అల్సర్

అరటిపండ్లు.. గ్యాస్ట్రిక్ జ్యూస్ లు తొలగించి.. ఎసిడిటీని నివారిస్తాయి. పొట్టలో అనారోగ్యాన్ని, ఇరిటేషన్ ని తగ్గించడంలో, బ్యాక్టీరియాతో పోరాడటంలో.. అరటిపండ్లు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. దీనివల్ల అల్సర్ నివారించవచ్చు.

ఆరోగ్యకరమైన కళ్లు

ఆరోగ్యకరమైన కళ్లు

అరటిపండ్లలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ అరటిపండ్లు తింటే.. కంటిచూపు సమస్యలు రావు.

English summary

What Happens When You Eat One Banana Everyday!

What Happens When You Eat One Banana Everyday! The banana is one of the most commonly consumed fruits. Majority of people eat bananas to satiate their hunger as this is one fruit which is easily available all through the year.
Story first published:Friday, August 19, 2016, 13:59 [IST]
Desktop Bottom Promotion