అలోవెర జెల్ రక్తంలో కలిసిన డ్రగ్స్ అవశేషాలను తొలగిస్తుందా?

By: Sindhu
Subscribe to Boldsky

శరీరంలోని టాక్సిన్స్ తొలగించే లక్షణం కలబంద (అలోవెరా)లో ఉన్నప్పటకీ ఆ రసం తీసుకున్న వెంటనే రక్తంలో ఉన్న డ్రగ్స్‌ ప్రభావం తగ్గుతుందని చెప్పలేమంటున్నారు ఆయుర్వేద నిపుణులు. డ్రగ్స్‌ కేసులో సిట్‌ ముందు హాజరవడానికి ముందు సినీ ప్రముఖులు కలబంద రసాన్ని తీసుకుని కడుపును శుద్ధి చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో.. ఎంతో కాలంగా రక్తంలో కలిసిపోయిన మాదకద్రవ్యాల అవశేషాలను తొలగించే శక్తి కలబందకు ఉందా? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

దీనిపై ఇంతవరకూ శాస్త్రీయమైన అధ్యయనాలేవీ జరగలేదుగానీ.. సప్త ధాతువుల్లో రెండో ధాతువైన రక్తాన్ని శుద్ధి చేసే గుణం కలబందలో కొంత వరకు ఉన్నప్పటికీ ఆ రసాన్ని 30-45 రోజులపాటు తీసుకుంటేగానీ దాని ప్రభావం రక్తం మీద కొంతైనా కనిపించదని కొందరు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి డ్రగ్స్‌ వాడటం వల్ల రక్తంలో కలిసిపోయే అవశేషాలు నాలుగైదు రోజులపాటు అలోవెరా జెల్‌ తాగినంత మాత్రాన రక్తపరీక్షల్లో కనిపించకుండా పోవని వారు స్పష్టం చేస్తున్నారు. మరికొందరు ఆయుర్వేద నిపుణులేమో.. కలబంద రసం చర్మం మీద చూపినంత ప్రభావం రక్తంపై చూపుతుందనడానికి ఆధారాలేవీ లేవంటున్నారు.

అలోవెర జెల్ రక్తంలో కలిసిన డ్రగ్స్ అవశేషాలను తొలగిస్తుందా?

కలబంద (అలోవెరా)ను మన పూర్వీకులు 'కుమారి' అని పిలిచేవారు. ఇది పూర్వం ప్రతి ఇంటి పెరట్లో, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా లభించేది. జీర్ణశక్తిని పెంచేందుకు, జీర్ణాశయ సంబంధిత సమస్యలకు, ఎముకల వైద్యానికి కలబందను ఉపయోగించేవారు.. కలబంద రసం, దాని గుజ్జు చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు, శరీరాన్ని కాంతివంతం చేసేందుకు, చర్మవ్యాధులు నివారించేందుకు, కాలిన గాయాలను మాన్పేందుకు, శరీరంలోని మాలిన్యాలను తొలగించేందుకు ఉపయోగపడుతుందని నిర్ధారించారు.

అలోవెర చర్మ సౌందర్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది

అలోవెర జెల్ రక్తంలో కలిసిన డ్రగ్స్ అవశేషాలను తొలగిస్తుందా?

అప్పటి నుంచి కలబందను ప్రపంచవ్యాప్తంగా సౌందర్య సాధనాల్లో ఉపయోగించడం మొదలైంది. అలోవెరాకు అంతర్జాతీయంగా ఊహించనంత డిమాండ్‌ పెరిగింది. అలోవేరా జెల్‌, సబ్బులు, సౌందర్య సాధనాలు.. ఇలా పలురకాల ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. అలోవెర జెల్ డ్రగ్స్ తీసుకున్న ఆనవాలు తెలుపుతుందో లేదో కానీ, ఇందులో గొప్ప ఉపయోగాలున్నాయన్న విషయం ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు...

గాయాలను మాన్పుతుంది:

గాయాలను మాన్పుతుంది:

కలబందలో చాలా బలమైన యాంటీబాక్టీరియల్ మరియు క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి, ఇది తెగిన గాయాలను, కీటకాలు కుట్టినప్పుడు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పూత పూస్తారు. ఈ మొక్కనుండి వచ్చే జెల్ ను గాయపడ్డ ప్రాంతంలో అప్లై చేస్తే. ఇది గాయాలపై బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందుకే కలబందను ఔషధాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది:

శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది:

అలోవెరా జ్యూస్ లో రిజవేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . బాడీ యాక్టివ్ గా మరియు హెల్తీగా మార్చుతుంది . ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది . జీవక్రియలు డ్యామేజ్ కాకుండా తగ్గిస్తుంది. మినిరల్స్ , యాంటీఆక్సిడెంట్స్ , విటమిన్స్ శరీరంలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేయడానికి సహాయపడుతాయి.

చర్మం మృదుత్వానికి అలోవెర జెల్ ..!

ఇమ్యూనిటి పెంచుతుంది:

ఇమ్యూనిటి పెంచుతుంది:

అలోవెరా జ్యూస్ ఇమ్యూన్ సిస్టమ్ ను మెరుగుపరుస్తుంది . డైజెస్టివ్ డిసీజ్ ను మెరుగుపరుస్తుంది. సర్క్యులేటింగ్ సిస్టమ్ ను మెరుగుపరచడానికి బెటర్ గా పనిచేస్తుంది. సర్క్యులేటింగ్ సిస్టమ్ బెటర్ గా పనిచేసినప్పుడు మొత్తం శరీరం యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది.

హార్ట్ హెల్త్ కు మంచిది

హార్ట్ హెల్త్ కు మంచిది

ప్రతి రోజూ అలోవెరా జ్యూస్ ను త్రాగడం వల్ల హార్ట్ సమస్యలుండవు మరియు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తొలగించి, మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది . దాంతో హార్ట్ బీట్ మెరుగుపడుతుంది. చెస్ట్ పెయిన్, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కొన్ని పరిశోధనలలో, వైద్యులు కలబంద రసాన్ని రక్తనాళాల ద్వారా రక్తంలోకి ప్రవేశపెట్టడం వలన గణనీయంగా ఎర్ర రక్త కాణాల విస్తరణ సామర్థ్యం అధికం అవుతుంది. ఫలితంగా, ఎర్రరక్త కాణాలు ఆక్సిజన్ రవాణా చేసే సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా, కలబంద రసంలో రక్త పీడనాన్ని నియంత్రించే కారకాలు ఉండటం వలన, రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం పెరుగుతుంది మరియు శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను కూడా తగ్గిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

అలోవెరజ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . శరీరం, చిన్న ప్రేగులు న్యూట్రీషియన్స్ గ్రహించేలా చేస్తుంది. మలబద్దకం నివారిస్తుంది . బౌల్ సమస్యలను నివారిస్తుంది.ఈ రసం తాగితే, జీర్ణక్రియ బాగా జరుగుతుంది. వ్యవస్ధను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం పోగొడుతుంది. డయోరియా వంటివి తగ్గుముఖం పడతాయి.

కాలిన గాయాలను మాన్పుతుంది :

కాలిన గాయాలను మాన్పుతుంది :

కలబంద చర్మాన్ని తెల్లగా మార్చుతుంది. మరియు కలబందను సరిగా ఉపయోగించడం వల్ల సన్ టాన్ మరియు హైపర్ పిగ్మెటేషన్ విజయవంతంగా తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. కలబందలో, చర్మాన్ని చాలా చల్లదనాన్ని అంధించడంతో పాటు చర్మంలో చైతన్యం మరియు తేమను నింపడానికి సహాయపడుతుంది.

అన్ని రకాల జుట్టు సమస్యలకు అద్భుత ఔషధం అలోవెరా

స్కిన్ ఎలాసిటి పెంచుతుంది:

స్కిన్ ఎలాసిటి పెంచుతుంది:

అలోవెరా జెల్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం తేమగా ఉంచడానికి ఎక్కువగా సహాయపడుతుంది. మరియు చర్మం స్థితిస్థాపకతను పెంచుతుంది.

ముడుతలను పోగొడుతుంది:

ముడుతలను పోగొడుతుంది:

కలబంద జెల్ వృద్ధాప్య ప్రభావం వల్ల వచ్చే, ముడుతలు, పొడి చర్మం మొదలగు సమస్యలనుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

చర్మ వ్యాధులను నివారిస్తుంది :

చర్మ వ్యాధులను నివారిస్తుంది :

కలబంద యాంటీపిత్తాశయ హెర్బ్ గా ఉపయోగిస్తారు. ఇది ఎసిడిటి, గాస్ట్రిక్, పేగు పూత మరియు వాపును తగ్గించడంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. కలబంద చర్మం మంటను తగ్గిస్తుంది. కాబట్టి ఇది అంతర్గతంగా మంటను తగ్గిస్తుంది. ఇది మీ జీర్ణక్రియ సులభతరం చేస్తుంది. మీరు ఎటుంటి ఆహారం తీసుకొన్న జీర్ణక్రియకు ఎటువంటి హానీ కలిగించకుండా కలబంద గుజ్జు సహాయపడుతుంది.

రక్తం మీద ప్రభావం... సందేహమే

రక్తం మీద ప్రభావం... సందేహమే

అలోవెరాకు శరీర మాలిన్యాలను తొలగించే గుణం ఉందని నిర్ధారించారు. రక్తంలో పేరుకుపోయిన అవశేషాలను తొలగించే గుణం ఉన్నట్లు నిర్ధారించలేదు. చర్మకణాలపై చూపిన ప్రభావాన్ని అలోవెరా రక్తకణాలపైనా చూపించగలదా లేదా అనేది శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

English summary

Aloe Vera Cleanse Blood? Effective Therapeutic Agent against Multidrug

Aloe Vera Cleanse Blood? Effective Therapeutic Agent against Multi drug, Aloe vera is an herbal medicinal plant with biological activities, such as antimicrobial, anticancer, anti-inflammatory, and antidiabetic ones, and immunomodulatory properties.Aloe vera juice gets rid of toxic substances in the contents
Subscribe Newsletter