అధిక బరువును తగ్గించుకునేందుకు తినాల్సిన ఆహారాలు ఇవే!

Written By: Bharath
Subscribe to Boldsky

లావుగా ఉండడం అనేది చాలామందిని ఇబ్బంది పెడుతుంది. శరీరంలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల కొందరు చాలా లావుగా కనిపిస్తుంటారు. దీంతో పలు రకాల వ్యాధుల బారిన కూడా పడుతుంటారు. అధిక బరువు సమస్యను అధిగమించేందుకు చాలా రకాలుగా ప్రయత్నించినా ఎలాంటి ఫలితం ఉండదు. అయితే కొన్ని రకాల హోం రెమిడీస్ వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు.

లావు పెరగడం, బరువు పెరగడం ఒంట్లో ఎక్కువగా కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. దీన్ని తగ్గించడానికి వ్యాయామాలు చేయడంతో పాటు కొన్ని రకాల ఫుడ్స్, డ్రింక్స్ తీసుకోవాలి. దీంతో శరీరంలో ఉండే కొవ్వంతా కరిగిపోతుంది. స్లిమ్ గా తయారవుతారు.

1. తగినట్లుగా తినండి

1. తగినట్లుగా తినండి

ఆహారాన్ని తగినంతగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాకాకుండా ఎక్కువగా తింటే మాత్రం ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అందువల్ల మీరూ ఎప్పుడు తిన్న కూడా లిమిట్ లోనే తినండి. ఇలా శరీరానికి అవసరమైనట్లుగా తింటే మీ బరువు అదుపులో ఉంటుంది.

2. నీరు ఎక్కువగా తాగండి

2. నీరు ఎక్కువగా తాగండి

శరీర నుంచి మలినాలను బయటకు పంపేందుకు నీరు బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల బాడీకి అమసరమైన మేరకు నీటిని తాగుతూ ఉండండి. నీరు శరీరంలోని కొవ్వును తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో కేలోరీస్ ఏమి ఉండవు. రోజూ 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగితే చాలా మంచిది. దీనివల్ల శరీరంలోని కొవ్వు ఈజీగా కరిగిపోతుంది.

3. గ్రీన్ టీ

3. గ్రీన్ టీ

గ్రీన్ టీ కూడా కొవ్వును కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది. రోజుకు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ తాగడం చాలా మంచిది. అందువల్ల రోజూ గ్రీన్ టీ తాగుతూ ఉండండి.

4. నిమ్మకాయ తేనె

4. నిమ్మకాయ తేనె

నిమ్మ, తేనె కలిపిన ద్రావణాన్ని రోజూ తీసుకుంటే చాలా మంచిది. పరగడుపున ఈ ద్రావణం తీసుకోవాలి. ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపడానికి బాగా ఉపయోగపడుతుంది.

5. ఆపిల్ సైడర్ వినెగర్

5. ఆపిల్ సైడర్ వినెగర్

ఆపిల్ సైడర్ వెనీగర్ జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరంలో కొవ్వును కరిగించేస్తుంది. ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల వెనిగర్ కలుపుకుని తాగితే మంచిది. దీంతో ఎక్కువగా ఆకలి వేయడదు. అలాగే త్వరగా బరువు తగ్గుతారు.

6. బ్లాక్ పెప్పర్

6. బ్లాక్ పెప్పర్

నల్ల మిరియాల్లో అల్కాలిడ్ రసాయనాలుంటాయి. ఇవి కొవ్వును కరిగించడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే కొత్తగా కొవ్వు కణాలు బాడీలో ఏర్పడకుండా నల్ల మిరియాలు సాయం చేస్తాయి. రక్తంలో కొవ్వు పెరగకుండా నల్ల మిరియాలు నియంత్రించగలవు. అందువల్ల వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి.

7. జీలకర

7. జీలకర

జీలకర కూడా కొవ్వును కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే శరీరంలో ఉండే కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. నీటిలో జీలకర వేసి దాన్ని కాసేపు మరిగించి తాగితే చాలా ప్రయోజనాలుంటాయి. కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

8. కొత్తిమీర జ్యూస్

8. కొత్తిమీర జ్యూస్

కొత్తిమీర జ్యూస్ వల్ల కూడా శరీరంలోని కొవ్వు ఈజీగా కరిగిపోతుంది. బరువు తగ్గడానికి కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల వంటకాల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగించాలి. అలాగే కొత్తిమీరతో జ్యూస్ తయారు చేసుకుని తాగితే కూడా మంచి ప్రయోజనాలుంటాయి.

9. క్రాన్బెర్రీ జ్యూస్

9. క్రాన్బెర్రీ జ్యూస్

క్రాన్బెర్రీ జ్యూస్ కూడా బరువు తగ్గించడానికి బాగా పని చేస్తుంది. ఒక గ్లాస్ క్రాన్బెర్రీ జ్యూస్ లో కాస్త నిమ్మకాయ రసం లేదంటే వెనిగర్ ను కలుపుకుని తాగితే చాలా ప్రయోజనాలుంటాయి. ఈ జ్యూస్ వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు.

10. యాపిల్స్

10. యాపిల్స్

యాపిల్స్ కూడా శరీరంలోని కొవ్వును తగ్గించడానికి బాగా ఉపయోపడతాయి. యాపిల్స్ జీర్ణక్రియను పెంచుతాయి. యాపిల్స్ లో ఉండే పెక్టిన్ కొవ్వును కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది. యాపిల్ పండ్లు గానీ లేదా జ్యూస్ గానీ రెగ్యులర్ గా తీసుకుంటుంటే చాలా మంచిది.

11. నట్స్

11. నట్స్

నట్స్ కూడా ఫ్యాట్ ని కరిగించడంలో బాగా పని చేస్తాయి. బాదం, ఇతర నట్స్ ను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. దీంతో మీరు త్వరగా బరువు తగ్గుతారు.

12. దోసకాయ

12. దోసకాయ

దోసకాయలో 90% నీరు ఉంటుంది. కేవలం 13 శాతం మాత్రమే కేలరీలు ఉంటాయి. ఇందులో సల్ఫర్ , సిలికాన్ వంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించేందుకు బాగా ఉపయోగపడతాయి. అందువల్ల దోసకాయను కూడా ఎక్కువగా తింటూ ఉండండి.

13. యాలకులు

13. యాలకులు

యాలకులు కూడా కొవ్వును కరిగించడంలో బాగా పని చేస్తాయి. వీటిని మనం వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. వీటిని మనం తినే ఆహారంలో రెగ్యులర్ గా వాడుతుంటూ చాలా ప్రయోజనాలున్నాయి. అలాగే వీటిని నేరుగా తినడం వల్ల కూడా శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

English summary

Home Remedies For Fat Burn

Here Home Remedies For Fat Burn
Story first published: Wednesday, November 29, 2017, 13:19 [IST]
Subscribe Newsletter