వీటిని తింటే ఈజీగా బరువు తగ్చొచ్చు

Posted By: Bharath
Subscribe to Boldsky

ఎక్కువగా యంగ్ ఏజ్ లో చాలామంది ఒత్తిడికి గురువుతూ ఉంటారు. దీంతో తినే తిండిపై శ్రద్ధ పెట్టరు. ఫలితంగా అధిక బరువు లేక ఊబకాయం వస్తుంది. లావును తగ్గించుకోవడానికి ఎలాంటి మ్యాజిక్ లు ఉండవు. బర్గర్ లు, పిజ్జాలులాంటివి తినడం తగ్గించాలి. రోజూ వ్యాయామం చేయాలి. అలాగే తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

అలాగే కొన్నిమంచి ఫుడ్స్ తీసుకోవాలి. మరి ఎలాంటి ఆహారాలు తెలుసుకోవడం ముఖ్యం. ఆ ఆహారాల గురించి ఒక్కసారి తెలుసుకుందామా.

1. అల్లం

1. అల్లం

బరువును తగ్గించడంలో అల్లం బాగా పని చేస్తుంది. కడుపు ఉబ్బరం సమస్యను కూడా ఇది తొలగిస్తుంది. మీరు వెంటనే బరువు తగ్గాలంటే కచ్చితంగా రోజూ మీరూ తినే ఆహారాల్లో అల్లం ఉండేలా చూసుకోండి.

2. వెల్లుల్లి

2. వెల్లుల్లి

బరువు తగ్గించడంలో వెల్లుల్లి బాగా పని చేస్తుంది. శరీరంలో ఎక్కువ కేలరీలను తగ్గించడానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. రోజూ తినే ఆహారంలో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి. అలాగే పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని తిన్నా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.

3. దాల్చిన చెక్క

3. దాల్చిన చెక్క

బరువును తగ్గిచడంలో దాల్చిన చెక్క బాగా పని చేస్తుంది. రోజూ ఉదయం మీరు తాగే కాఫీ లేదా టీ కాస్త దాల్చినచెక్కను కలుపుకుని తాగితే మేలు. దీంతో మీరూ త్వరగా బరువు తగ్గొచ్చు.

4. క్యెన్ని పెప్పర్

4. క్యెన్ని పెప్పర్

క్యేన్నె పెప్పర్ కూడా శరీరంలోని కేలరీలను తగ్గించడంలో బాగా ఉపయోపగపడుతుంది. మీరూ తినే ఆహారాలు వీటి ద్వారా తయారు చేస్తే మీకు ఆకలి అదుపులో ఉంటుంది. అలాగే శరీరంలోని ఎక్కువ కేలరీలను తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూ ఉండండి.

5. నల్ల మిరియాలు

5. నల్ల మిరియాలు

నల్ల మిరియాలు కూడా బరువు తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. వీటిని కూడా మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. సూప్ లో గానీ లేదా మీరూ తినే ఆహారపదార్థాల్లో గానీ వీటిని ఉపయోగించండి.

6. ఆవాలు

6. ఆవాలు

ఆవాల్లో సెలీనియం ఉంటుంది. ఇది థైరాయిడ్ కు సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. అలాగే ఆవాలు బరువును తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి.

7. నిమ్మకాయ

7. నిమ్మకాయ

నిమ్మకాయలో ఎలాంటి కేలరీలు ఉండవు. ఇది కూడా బరువు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్ గా నిమ్మకాయం రసాన్ని తాగడంలాంటిది చేస్తే మీరు త్వరగా బరువు తగ్గొచ్చు.

8. క్వినోవా

8. క్వినోవా

కినోవాను ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటిలో ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఇది కూడా మంచి ఆహారం. దీన్ని రెగ్యులర్ గా తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

9. బాదం

9. బాదం

బాదంపప్పు బరువు తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. రోజూ కొన్ని బాదంపప్పులను తింటూ ఉండండి. రాత్రి నీళ్లలో నానబెట్టుకుని ఉదయాన్నే వాటి పొట్టు తీసి తింటే కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.

10. కోకో పౌడర్

10. కోకో పౌడర్

శరీరంలోని ఫ్యాట్ ను, రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడానికి కోకో పౌడర్ బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల కోకో పౌడర్ ను కూడా బరువు తగ్గించుకోవడానికి ఉపయోగించొచ్చు.

11. వోట్స్

11. వోట్స్

బరువును తగ్గించడానికి వోట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. వోట్స్ మీల్స్ తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. అలాగే ఎక్కువసేపు ఆకలికాకుండా ఉండేందుకు వోట్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి.

12. గుడ్లు

12. గుడ్లు

గుడ్లలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మీరూ బరువు తగ్గాలంటే రోజూ గుడ్లు తినడం చాలా మంచిది. అందువల్ల ఇప్పటి నుంచి రోజూ గుడ్లు తింటూ ఉండండి.

13. బ్లాక్ బీన్స్

13. బ్లాక్ బీన్స్

బ్లాక్ బీన్స్ కూడా బరువు తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి. వీటిలో ప్రోటీన్స్, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో మీరూ త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.

14. అవిసె గింజలు

14. అవిసె గింజలు

అవిసె గింజలు కూడా బరువు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు ఎక్కువ సేపు ఆకలికాకుండా అవిసే గింజలు తోడ్పడుతాయి.

15. చియా విత్తనాలు

15. చియా విత్తనాలు

చియా విత్తనాలు బరువు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఫైబర్, ఫ్యాట్స్, క్యాల్షియం అధికంగా ఉంటుంది. అందువల్ల చియా విత్తనాలను కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

16. బర్గమిక్ వెనిగర్

16. బర్గమిక్ వెనిగర్

బర్గమిక్ వెనిగర్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీన్ని రోజూ మీ ఆహారంలో తీసుకోవడం వల్ల మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు. అందువల్ల దీన్ని కూడా వినియోగించండి.

17. తృణ ధాన్యాలు

17. తృణ ధాన్యాలు

తృణ ధాన్యాల్లోనూ ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని కూడా బరువు తగ్గేందుకు ఉపయోగించొచ్చు. అన్ని రకాల తృణ ధాన్యాలు మీ ఆరోగ్యానికి చాలా మంచివి.

18. గ్రీక్ యోగర్ట్

18. గ్రీక్ యోగర్ట్

గ్రీక్ యోగర్ట్ లో కాల్షియం అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది కూడా బరువు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు.

19. ఆలివ్ ఆయిల్

19. ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ కూడా బరువును బాగా తగ్గిస్తుంది. మీరు తినే ఆహారపదార్థాలను ఆలివ్ ఆయిల్ ఉపయోగించి తయారు చేసుకోండి. దీంతో మీ శరీరంలోని ఫ్యాట్ మొత్తం ఈజీగా కరిపోతుంది. వీలైనంత మీ వంటకాల్లో ఆలివ్ ఆయిల్ ఉపయోగించడానికి ప్రయత్నింంచండి. దీని ద్వారా మీరు త్వరలోనే చాలా బరవు తగ్గిపోతారు.

20. బెర్రీస్

20. బెర్రీస్

బెర్రీస్ శరీరంలోని ఫ్యాట్ ను కరిగించేస్తుంది. ఇందులో అధిక ఫ్లేవానోయిడ్ ఉంటాయి. అన్ని రకాల బెర్రీలు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు త్వరగా బరువు తగ్గేలా చేస్తాయి.

21. గుమ్మడికాయ విత్తనాలు

21. గుమ్మడికాయ విత్తనాలు

గుమ్మడి విత్తనాల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. బరువు తగ్గడానికి ఈ విత్తనాలు బాగా ఉపయోగపడతాయి.

22. సోడియం తక్కువగా ఉండే పులుసులు

22. సోడియం తక్కువగా ఉండే పులుసులు

మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే మీరు తినే ఫుడ్స్ ను తయారు చేయడానికి నూనె తక్కువగా ఉపయోగించాలి. చికెన్ లేదా కూరగాయాలను వండేటప్పుడు తక్కవ సోడియం నీటిలో వాటిని ఉడికిస్తే చాలా మంచిది. అలాంటి ఆహారాలు తింటే మీరు త్వరగా బరువు తగ్గుతారు.

23. శనగలు

23. శనగలు

వీటిలోనూ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మొలకెత్తిన శనగలు తింటే మంచిది. ఉడుకబెట్టుకుని కూడా తినొచ్చు. వీటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

24. టమాటో సాస్

24. టమాటో సాస్

టమాటాలు కూడా బరువును తగ్గించేందుకు బాగా పని చేస్తాయి. అయితే మార్కెట్లో లభించే టమాటో సాస్ కాకుండా మీరు సొంతంగా తయారు చేసుకునే సాస్ వల్ల మంచి ప్రయోజనాలుంటాయి. రెగ్యులర్ గా టమాటో సాస్ ఉపయోగించడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చు.

English summary

Weight Loss Ingredients From Kitchen

Hereweight loss kitchen ingredients. Read further to know about the list of weight loss ingredients.
Story first published: Friday, December 1, 2017, 14:52 [IST]