నీళ్లు తగినంత తాగకపోతే శరీరంలో ఏం జరుగుతుంది?

Posted By:
Subscribe to Boldsky

ఆ నీళ్లే కాదా... తాగితే ఎంత... తాగకపోతే ఏంటి అని చాలామంది అనుకుంటారు. శరీరంలో ఎక్కువశాతం నీరే ఉంటుంది. ఈ నీరే ప్రాణాధారం. శరీరానికి తగినంత నీరు అందివ్వడంతో ఆరోగ్యంగా ఉంటారు. నీరు సేవించడం వలన శరీరంలోని విషపూరితమైన పదార్థాలు బయటకు విసర్జించడమే కాకుండా చర్మం, ఉదరం, మూత్రపిండాలలోనున్న పలురకాల విషపదార్థాలు బయటకు విసర్జించబడతాయి. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు రకరకాల జబ్బులు చోటుచేసుకుంటాయి. నీరు తక్కువగా తీసుకోవడంతో డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమౌతుంది.

శరీరంలో చేరుకునే రకరకాల జబ్బులను నీరు పారద్రోలుతుంది. కాబట్టి శరీరానికి తగినంత నీరు అందిస్తుండాలి. శరీర బరువును నియంత్రించేందుకు నీరు ఓ దివ్యౌషధంలా ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తొలగించేసే గుణం ఇందులో ఉంది. నీటిలో క్యాలరీలు, కొవ్వు, చక్కెర, కార్బోహైడ్రేట్లుండవు. నీటిని సేవించడం వలన ఎక్కువ క్యాలరీలు కలిగిన సోడా, డ్రింక్స్, మద్యం, ఇతర జ్యూస్‌లను త్రాగాలనిపించదు.

నీళ్లు తగినంత తాగకపోతే శరీరంలో ఏం జరుగుతుంది?

బరువు తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా...అంతెందుకు మన శరీరంలోని అవయవాలన్నీ వాటి పని అవి చక్కగా చేసుకుంటూ పోవాలన్నా నీళ్లెక్కువ తాగితే చాలు. అసలు నీళ్లు తాగకపోతే.. వచ్చే సమస్యలు చాలానే ఉన్నాయి. అవి కూడా తెలుసుకుంటే ఇంకాస్త జాగ్రత్తగా ఉండగలుగుతాం. అవేంటంటారా?

రాగి పాత్రలో నీళ్ళు త్రాగడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు

 బరువు పెరుగుతారు...

బరువు పెరుగుతారు...

శరీరంలో నీటి బరువు అనేది ఉంటుంది. అయితే అది నీళ్లు తాగడం వల్లకాదు...తాగకపోవడం వల్ల పెరుగుతుంది. ఎలాగంటే నీళ్లు తాగనందువల్ల శరీరం తనకున్న ప్రతి నీటి చుక్కనీ దాచుకోవడం మొదలుపెడుతుంది. దాంతో శరీరం బరువు పెరుగుతుంది. వినడానికి కాస్త కొత్తగా ఉన్నా ఇది నిజమేనంటున్నారు వైద్యులు. ద జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిజం ఈ విషయాన్ని ఓ నివేదికలో స్పష్టం చేసింది.

శక్తి నశిస్తుంది...

శక్తి నశిస్తుంది...

నీరసంగా ఉంటోందా? ఇలాంటప్పుడు కాఫీ , టీలకు బదులు కాసిని నీళ్లు తాగండి. అప్పుడే శరీరం తేమగా మారుతుంది. ఎందుకంటే శరీరం డీహైడ్రేషన్‌కి గురయినప్పుడుశక్తి తగ్గిపోతుంది. ఏకాగ్రతా కుదరదు. మనం తీసుకునే నీళ్లల్లో ఎనభైశాతం వరకూ మెదడు సామర్థ్యం, దాని పనితీరు ఆధారపడి ఉంటాయి. ఒత్తిడిగా ఉన్నప్పుడు తగినని నీళ్లు తీసుకోగలిగితే మానసిక సామర్థ్యమూ పెరుగుతోందని చెబుతోంది....బ్రిటన్‌కి చెందిన ఓ అధ్యయనం.

15రోజులు కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..!

ఆకలేస్తుందా?

ఆకలేస్తుందా?

శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోతే డీహైడ్రేషన్‌ బాధిస్తుంది. ఇలాంటప్పుడు ఆకలిగానూ అనిపిస్తుంది. ఆ సమయంలో ఓ గ్లాసు చల్లటి నీళ్లు తాగాలి. ఇరవై నిమిషాలు ఆగి నచ్చిన అల్పాహారం తినమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. నీళ్లు ఎక్కువగా తాగకపోతే తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. మలబద్ధకం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలూ ఇబ్బంది పెడతాయి.

అసహనానికి కారణమూ ఇదే...

అసహనానికి కారణమూ ఇదే...

మనసంతా ఆందోళనగా, విసుగ్గా ఉందా? బహుశా మీ శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోవడమే కారణం కావొచ్చు.. అంటున్నాయి యూనివర్సిటీ ఆఫ్‌ కనెక్టికట్‌కు చెందిన అధ్యయనాలు. కాబట్టి ఎప్పుడూ నీళ్లసీసాను పక్కన ఉంచుకోవడం వల్ల ఇలాంటివెన్నో సమస్యలు పరిష్కారమవుతాయి.

మెదడు పరిమాణం తగ్గుతుంది

మెదడు పరిమాణం తగ్గుతుంది

నీటిశాతం తగ్గిన యుక్తవయసు పిల్లల్లో మెదడు పరిమాణం తగ్గుతున్నట్టు కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. తగినంత నీరు తాగని పిల్లల్లో పుర్రె ఎముకకు, మెదడుకు మధ్య ఖాళీ ఏర్పడుతున్నట్టు తేలటంతో ఇది నిర్ధరణ అయ్యింది. ఇలాంటి సమయాల్లో పిల్లల్లో సమస్యను పరిష్కరించే సామర్థ్యమూ తగ్గుతుండటమూ గమనార్హం. నీళ్లు తాగిన తర్వాత మెదడు తిరిగి మామూలు సైజుకు చేరుకోవటం విశేషం.

భోజనం చేయటానికి ముందు రెండు గ్లాసుల నీళ్లు తాగినవాళ్లు

భోజనం చేయటానికి ముందు రెండు గ్లాసుల నీళ్లు తాగినవాళ్లు

నీరు తగినంత తీసుకోకపోతే తిండి ఎక్కువగా తినే అవకాశముంది. భోజనం చేయటానికి ముందు రెండు గ్లాసుల నీళ్లు తాగినవాళ్లు కాసింత తక్కువగా తింటున్నట్టు బయటపడటమే దీనికి నిదర్శనం. అంటే నీరు తిండిని అదుపు చేస్తూ.. బరువు తగ్గటానికీ తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఉదయాన్నేలెమన్ వాటర్ తాగితే: గొప్ప ప్రయోజనాలు

తగినంత నీరు తాగకపోతే ముఖం వాడిపోతుంది.

తగినంత నీరు తాగకపోతే ముఖం వాడిపోతుంది.

తగినంత నీరు తాగకపోతే ముఖం వాడిపోతుంది. చర్మం ముడతలు ముడతలుగా కనిపిస్తుంది. మన చర్మం మీద ఏర్పడే సన్నటి రేఖలు, ముడతల్లోకి నీరు చేరుకొని, కొత్త కాంతిని తెచ్చిపెడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

ఒంట్లో నీరు తగ్గితే నిస్సత్తువ,

ఒంట్లో నీరు తగ్గితే నిస్సత్తువ,

ఒంట్లో నీరు తగ్గితే నిస్సత్తువ, తికమక పడటం, కోపం, మానసికంగా కుంగిపోవటం, ఒత్తిడి వంటివి తలెత్తుతాయి. వ్యాయామం చేయటానికి ముందు నీళ్లు తాగనివారిలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నట్టు టఫ్స్‌ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలటమే దీనికి నిదర్శనం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    What Happen to Your Body When You Don't Drink Enough Water

    what Happen to Your Body When You Don't Drink Enough Water,Every organ in your body and every cell in your body needs water to function on a daily basis. Now, let us discuss what happens when you don't drink enough water.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more