స్విమ్మింగ్ తో ఆరోగ్యం పదిలం

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

స్విమ్మింగ్ అనేది అన్ని వయసుల వారికీ మంచి వినోద కార్యకలాపం. ఇది తక్కువ ప్రభావంతో కూడిన వ్యాయామమే కాకుండా విశ్రాంతిని, మంచి అనుభూతిని కలిగించే ఒక గొప్ప మార్గం. మీ శారీరిక అలాగే మానసిక ఆరోగ్యాన్ని నిర్వహించుకోవడానికి స్విమ్మింగ్ అనేది ఖచ్చితమైన మార్గం.

స్విమ్మింగ్ ఒక సరదా, అంతేకాకుండా ఇది మీరు బలంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఒక గొప్ప మార్గం. ఇది ఒక మంచి వ్యాయామంగా గుర్తించబడింది ఎందుకంటే నీటి తాకిడిని తట్టుకోవడానికి వ్యతిరేకంగా మీరు మీ శరీరం మొత్తాన్నీ అటూ ఇటూ కదిలిస్తూ ఉండాలి.

Top 10 Benefits of Swimming

స్విమ్మింగ్ మీ హార్ట్ రేట్ ని సరిగా ఉంచి, సహనాన్ని, కండరాల టోన్స్ ని పెంచుతుంది, ఆరోగ్యకరమైన బరువును పొందడానికి సహాయపడుతుంది, అలాగే మొత్తం శరీరానికి వ్యాయామాన్ని అందిస్తుంది.

స్విమ్మింగ్ వ్యాయామాలు చాలా సులువుగా ఉంటాయి, ఇవి మీ సమన్వయాన్ని మెరుగుపరుస్తాయి, ఒత్తిడిని ఉపశమనం చేస్తాయి, కదలికలను మెరుగుపరుస్తాయి. కాబట్టి, స్విమ్మింగ్ వల్ల మీకు తెలీని ఆరోగ్య ప్రయోజనాల గురించి మరిన్ని విషయాలను చదివి తెలుసుకోండి.

1.మీ మొత్తం శరీరం పనిచేస్తుంది

1.మీ మొత్తం శరీరం పనిచేస్తుంది

స్విమ్మింగ్ వల్ల అతిపెద్ద ప్రయోజనలలో ఒకటి శరీరం మొత్తానికి వ్యాయామం కలిగించడం. స్విమ్మింగ్ చేసేటపుడు అనేక స్ట్రోక్స్ ఉంటాయి, ప్రతిదీ భిన్నమైన కండరాల గ్రూపుపై శ్రద్ధ చూపిస్తుంది. ఇది మీ కండరాలను బలోపేతం చేసి, శక్తిని, సహనాన్ని పెంచుకోడానికి సహాయపడుతుంది.

2.గుండెకు ప్రయోజనకరం

2.గుండెకు ప్రయోజనకరం

స్విమ్మింగ్ మీ హార్ట్ రేట్ ని పెంచడం వల్ల, మీ ఊపిరితిత్తులు, గుండె బలంగా ఉంటాయి. చురుకుగా లేని వారితో పోలిస్తే స్విమ్మింగ్ మరణ ప్రమాదాన్ని కూడా తగ్గి౦చగలదని పరిశోధకులు చెప్పారు. కాబట్టి, ఇది బ్లడ్ ప్రెజర్ ని తగ్గించి, బ్లడ్ షుగర్ ని నియంత్రించడానికి సహాయపడుతుంది.

3.స్విమ్మింగ్ జ్ఞానాన్ని పెంచుతుంది

3.స్విమ్మింగ్ జ్ఞానాన్ని పెంచుతుంది

స్విమ్మింగ్ జ్ఞాపక శక్తిని, ఆలోచనా నైపుణ్యాన్ని పెంచుతుంది. ఇది ఇన్ఫ్లమేషన్ ను, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, కొత్త మెదడు కణాల త్వరితగతిన పెరగడానికి సహాయపడుతుంది. స్విమ్మింగ్ మూడ్, ఆత్రుత, ఒత్తిడి ని పెంచి, ఆలోచనలు మరింత ప్రభావవంతంగా రావడానికి మెదడు సామర్ధ్యాన్ని పెంచుతుంది.

4.ఆస్తమా కి చాలా మంచిది

4.ఆస్తమా కి చాలా మంచిది

ఆస్తమా వంటి ప్రమాదకర ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారికి స్విమ్మింగ్ చాలా ప్రభావవంతమైనది. అస్తమా తో బాధపడుతున్నవారికి స్విమ్మింగ్ వ్యాయామం చాలా ప్రయోజనకరం ఎందుకంటే నీటి నుండి తేమ తీవ్రంగా శ్వాస తీసుకునే సమయంలో బైటికి పోయి తిరిగి తేమను భర్తీ చేస్తుంది.

5.బరువు తగ్గడానికి చికిత్స

5.బరువు తగ్గడానికి చికిత్స

మీరు త్వరగా బరువు తగ్గాలి అనుకుంటే, స్విమ్మింగ్ మీకు ఒక మంచి వ్యాయామంగా చెప్పొచ్చు. ఒక గంట తీవ్రంగా స్విమ్మింగ్ చేస్తే దాదాపు 715 క్యాలరీలు ఖర్చవుతాయని ప్రముఖ అధ్యయనం కనుగోన్నాది. ఇండియన్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం, స్విమ్మింగ్ చేయని వారితో స్విమ్మర్ల వినోద ఫిట్నెస్ తో పోలిస్తే, స్విమ్మింగ్ చేసేవారు నడుము, తొడలు చాలా సన్నగా ఉన్నట్టు తేలింది.

6.ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది

6.ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది

స్విమ్మింగ్ కి మూడ్ ని పెంచే ప్రభావాలు ఉన్నాయి, ఇవి మీ ఒత్తిడి స్థాయిలకు అద్భుతంగా పనిచేస్తాయి. మీరు స్విమ్మింగ్ వ్యాయామానికి దాదాపు 30 నిముషాలు కేటాయిస్తే, మీ శరీరం ఒత్తిడిని పోగొట్టి, ఉపశమనాన్ని కలిగిస్తుంది. కాబట్టి, స్విమ్మింగ్ ద్వారా మీ భుజాల నుండి ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు!

7.నిద్రను పెంచుతుంది

7.నిద్రను పెంచుతుంది

స్విమ్మింగ్ రాత్రులందు మంచి నిద్ర పోవడానికి సహాయపడే తగినంత శక్తి ఉంది. నిద్రలేమితో బాధపడేవారు స్విమ్మింగ్ చేయడం ప్రారంభిస్తే మంచి నిద్రను పొందవచ్చు. మీరు మీ నిద్రను మెరుగుపరుచుకోవాలి అనుకుంటే, మీకు స్విమ్మింగ్ ఖచ్చితమైన వ్యాయామం.

8.శక్తిని పెంచుతుంది

8.శక్తిని పెంచుతుంది

స్విమ్మింగ్ ఒక స్థాయి వరకు మీ శక్తి స్థాయిలను పెంచుతుంది. మీరు స్విమ్మింగ్ చేసేటపుడు మీ కండరాలు అన్నీ పనిచేస్తాయి కాబట్టి, ఇది మీ శరీరాన్ని చార్జ్ చేస్తుంది. స్విమ్మింగ్ లో ఒక అరగంట గడిపితే, రోజంతా మీరు ఎంతో చురుకుగా ఉంటారు.

9.మీ ఊపిరితిత్తులకు చాలా మంచిది

9.మీ ఊపిరితిత్తులకు చాలా మంచిది

మీరు స్విమ్మింగ్ చేసేటపుడు, మీ శరీరం ఎక్కువ ప్రభావవంతంగా ఊపిరి తీసుకుంటుంది. శరీరం ప్రతి శ్వాసతో తాజా గాలిని ఎక్కువగా తీసుకుని, కార్బన్డయాక్సైడ్ ని ఎక్కువ వదిలేస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంచుతుంది, దాని ఫలితంగా హార్ట్ రేట్, రక్తపోటు తక్కువగా ఉంటాయి.

10.కొలెస్ట్రాల్ ని పెంచుతుంది

10.కొలెస్ట్రాల్ ని పెంచుతుంది

స్విమ్మింగ్ కొలెస్ట్రాల్ LDL (చెడు) ను తగ్గి౦చి, మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. దీని ఏరోబిక్ శక్తికి ధన్యవాదాలు. ఇది మీ కొలెస్ట్రాల్ లెవెల్ ని స్ధిరంగా ఉంచి, మీ శరీరం మంచి ఆకారంతో ఉండేట్టు చేస్తుంది.

English summary

10 Benefits of Swimming

You may have heard that experts recommend adults get 150 minutes of moderate activity or 75 minutes of vigorous activity each week. Swimming is an excellent way to work your entire body and cardiovascular system. An hour of swimming burns almost as many calories as running, without all the impact on your bones and joints.
Story first published: Thursday, January 18, 2018, 10:26 [IST]