For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెడ్ వైన్ కి చెందిన ఈ 10 ముఖ్యమైన వాస్తవాలు మిమ్మల్ని అమితాశ్చర్యానికి గురిచేస్తాయి.

|

వైన్ అనేది అమ్మాయిల బెస్ట్ ఫ్రెండ్ అని పాశ్చాత్య దేశాలలో ఒక సేయింగ్ ఉంది. వైన్ ని తాగడానికి అక్కడ అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. మరే ఇతర ఆల్కహాలిక్ డ్రింక్ ని ప్రిఫర్ చేయరు. వైన్ ని తీసుకునేందుకు మాత్రం మొగ్గు చూపుతారు.

వైన్ కి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. దీని పురాతన డ్రింక్ గా పరిగణిస్తారు. వివిధ రకాల బ్లాక్ గ్రేప్స్ తో రెడ్ వైన్ ని తయారుచేస్తారు. వయొలెట్ నుంచి బ్రిక్ రెడ్ అలాగే బ్రౌన్ కలర్స్ లో వైన్ లభ్యమవుతుంది.

క్రష్ చేసి ఫెర్మెంట్ చేయబడిన డార్క్ కలర్ గ్రేప్స్ నుంచి రెడ్ వైన్ ని తయారుచేస్తారు. బ్లాక్ గ్రేప్స్ లో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభ్యమవుతాయి. అందువలన, రెడ్ వైన్ అనేది ఏంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ను అందించడంతో పాటు ఇమ్మ్యూనిటీని బూస్ట్ చేయడానికి అలాగే గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి అమితంగా ఉపయోగపడుతుంది.

రెస్వెరాట్రల్, కెటెచిన్స్, ఎపికెటెచిన్ మరియు ప్రాయంతోక్యానిడిన్స్ వంటి వివిధ యాంటీ ఆక్సిడెంట్స్ గ్రేప్స్ లో లభ్యమవుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కి గుండె వ్యాధులను అరికట్టే శక్తి కలదు. అలాగే, ఫ్రీ రేడికల్ డ్యామేజ్ పై కూడా ఇవి పోరాటం జరుపుతాయి.

రెడ్ వైన్ అనేది ఆరోగ్యానికి మంచిదైనా దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. రెడ్ వైన్ ని మోడరేట్ క్వాన్టిటీలోనే తీసుకోవాలి. తద్వారా, లివర్ వ్యాధులను అరికట్టవచ్చు. అలాగే డిమెన్షియాతో పాటు ప్రోస్ట్రేట్ క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు.

రెడ్ వైన్ లో ఆల్కహాల్ అనేది 12 శాతం నుంచి 15 శాతం వరకు లభిస్తుంది. ఇందులో 125 కేలరీలు లభిస్తాయి. కొలెస్ట్రాల్ అనేది అస్సలు లభించదు. 3.8 గ్రాముల కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి.

ఇప్పుడు, రెడ్ వైన్ కు సంబంధించైన ముఖ్యమైన వాస్తవాలను పరిశీలిద్దాము.

10 Important Facts About Red Wine That Will Blow Your Mind

1. రెడ్ వైన్ ను తక్కువ డోస్ లలో తీసుకుంటేనే మంచిది:

రెడ్ వైన్ ని అస్సలు తీసుకోకపోవడం కంటే మోడరేట్ క్వాన్టిటీలో తీసుకుంటే మంచిది. ఎందుకో తెలుసా? రెడ్ వైన్ లో గుండె వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్స్ కలవు. అలాగే, టైప్ 2 డయాబెటీస్ కి గురయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గించే సామర్థ్యం కలదు. అలాగే, ప్రాణాంతక సమస్యల నుంచి కూడా రక్షణని కలిగించే సామర్థ్యం కలదు. అయితే, రెడ్ వైన్ ను ఎక్కువగా తీసుకుంటే తీవ్రమైన ప్రమాదానికి గురయ్యే ప్రమాదం కలదు.

2. పోలీఫెనాల్స్ లభిస్తాయి:

2. పోలీఫెనాల్స్ లభిస్తాయి:

ట్యానిన్, రెస్వెరాట్రాల్ తో పాటు దాదాపు 5000 ప్లాంట్ కాంపౌండ్స్ వంటి పోలీఫెనాల్స్ రెడ్ వైన్ లో లభిస్తాయి. ట్యాన్నిన్ లభ్యమయ్యే రెడ్ వైన్ వలన అనేక బెనిఫిట్స్ లభిస్తాయి. డార్క్ చాకోలెట్స్ మరియు గ్రీన్ టీ లో కూడా ట్యాన్నిన్ లభిస్తుంది. బ్లడ్ వెజిల్స్ ని బ్లాక్ చేసే కొలెస్ట్రాల్ ని ట్యానిన్ అడ్డుకుంటుంది. తద్వారా, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

3. కొన్ని వైన్స్ ఆరోగ్యానికి మంచివి:

3. కొన్ని వైన్స్ ఆరోగ్యానికి మంచివి:

ఏయే రకాల రెడ్ వైన్స్ ఆరోగ్యానికి మంచివో చెప్పడం కాస్త కష్టతరమే. కాబట్టి ఇప్పుడు మేము గైడ్ చేస్తాము. స్వీట్ వైన్స్ బదులు డ్రై రెడ్ వైన్స్ ని చూజ్ చేసుకోండి. వీటిలో ఆల్కహాల్ తక్కువగా ఉంటుంది. అలాగే ట్యానిన్ లెవెల్ ఎక్కువగా ఉండే రెడ్ వైన్స్ ను ప్రిఫర్ చేయండి.

4. శృంగార జీవితాన్ని మెరుగుపరుస్తుంది:

4. శృంగార జీవితాన్ని మెరుగుపరుస్తుంది:

రెడ్ వైన్ కి సంబంధించిన ఆసక్తికరమైన వాస్తవమిది. రెడ్ వైన్ ను తరచూ మోడరేట్ క్వాన్టిటీస్ లో తీసుకుంటే మీ శృంగార జీవితం మెరుగవుతుంది. ప్రతిరోజూ 2 గ్లాసుల వైన్ ని తీసుకునే మహిళలు రెడ్ వైన్ ను తీసుకొని మహిళల కంటే ఫిజికల్ ప్లెజర్ ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని తెలుస్తోంది.

5. యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్:

5. యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్:

రెడ్ వైన్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ లో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ అలాగే కార్డియో ప్రొటెక్టివ్ ప్రాపర్టీస్ కలవు. ఇవి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. గ్రేప్స్ నుంచి రెడ్ వైన్ ను ప్రిపేర్ చేస్తారు. గ్రేప్స్ స్కిన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే వివిధ రకాల క్యాన్సర్స్ ని అరికట్టే సామర్థ్యం వీటికి కలదు.

 6. కేలరీలు తక్కువగా లభిస్తాయి:

6. కేలరీలు తక్కువగా లభిస్తాయి:

రెడ్ వైన్ ను తీసుకోవడం వలన మీ వెయిస్ట్ లైన్ పెరగదు. ఇది బెల్లీ ఫ్యాట్ ను ప్రోత్సహించదు. ప్రతిరోజూ ఒక గ్లాసుడు రెడ్ వైన్ ను తీసుకునే మహిళలో 10 పౌండ్ల బాడీ ఫ్యాట్ అనేది రెడ్ వైన్ తీసుకొని మహిళల కంటే తక్కువగా ఉంటుంది. దీనికి కారణమేంటంటే, రెడ్ వైన్ లో కేలరీలతో పాటు ఫ్యాట్ కంటెంట్ తక్కువగా లభిస్తుంది.

7. ఒత్తిడిని తగ్గిస్తుంది:

7. ఒత్తిడిని తగ్గిస్తుంది:

రెస్వెరాట్రాల్ అనే కాంపౌండ్ రెడ్ వైన్ లో లభిస్తుంది. ఇది డిఎన్ఏను రిపెయిర్ చేస్తుంది. ట్యూమర్ జీన్స్ ను అణగార్చి లాంగివిటీను ప్రోమోట్ చేస్తుంది. ఒక గ్లాసుడు రెడ్ వైన్ ను తీసుకోవడం వలన ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుముఖం పడుతుంది. డిన్నర్ మీల్స్ తో పాటు ఒక గ్లాసుడు రెడ్ వైన్ ను తీసుకోవడం ప్రారంభించమని నిపుణులు సూచిస్తున్నారు.

8. నిద్రని పెంపొందిస్తుంది:

8. నిద్రని పెంపొందిస్తుంది:

మేలాటనిన్ అనే కాంపౌండ్ అనేది నిద్రని పెంపొందిస్తుంది. ఇది రెడ్ వైన్ లో లభిస్తుంది. రెడ్ వైన్ ని తయారుచేసేందుకు ఉపయోగపడే గ్రేప్స్ లో ఇది లభిస్తుంది. నిద్రలేమి సమస్యతో మీరు ఇబ్బందిపడుతున్నట్టయితే రెడ్ వైన్ ని తీసుకోమని నిపుణులు సూచిస్తున్నారు. ఒక గ్లాసుడు రెడ్ వైన్ ను తీసుకోవడం వలన ఈ మెరుగుదలకు గమనించవచ్చు. అయితే, బెడ్ టైం కి ముందుగా మాత్రం దీనిని తీసుకోకూడదు.

9. ఏజింగ్ ని వాయిదా వేస్తుంది:

9. ఏజింగ్ ని వాయిదా వేస్తుంది:

ఒక గ్లాసుడు రెడ్ వైన్ ను తీసుకోవడం వలన చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. చర్మం ఏజింగ్ అనేది తగ్గుతుంది. రెడ్ వైన్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి స్కిన్ సెల్స్ పై ఏర్పడే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి. అలాగే హానికర యూవీ రేస్ నుంచి చర్మానికి రక్షణను ఏర్పరుస్తాయి.

10. స్మోకింగ్ ఎఫెక్ట్స్ ను అరికడుతుంది:

10. స్మోకింగ్ ఎఫెక్ట్స్ ను అరికడుతుంది:

అవును, ఇది నిజం. రెడ్ వైన్ లో స్మోకింగ్ వలన కలిగే నెగటివ్ ఎఫెక్ట్స్ ను అరికట్టే సామర్థ్యం కలదు. రెడ్ వైన్ అనేది ఇంఫ్లేమేషన్ ను అరికట్టి తద్వారా స్కిన్ ఏజింగ్ ను వీలైనంత వరకూ వాయిదా వేస్తుంది. ఈ మార్పు సాధారణంగా స్మోకింగ్ ను మానివేసిన తరువాత కనపడుతుంది.

English summary

10 Important Facts About Red Wine That Will Blow Your Mind

10 Important Facts About Red Wine That Will Blow Your Mind,Red wine is made from different varieties of black grapes and the colour of the wine can range. Read on to know the interesting and important facts on red wine.
Desktop Bottom Promotion