For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 10 అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి వేపను ఉపయోగించండి !

|

వేప అనేది అత్యంత బహుముఖ ప్రయోజనాలను కలిగిన మొక్కలలో ఒకటి. ఆయుర్వేద ప్రకారం, ఇది వివిధ రకాల రుగ్మతలను నయం చేయగలిగే శక్తివంతమైన ఒక హెర్బ్. వాస్తవానికి ఈ హెర్బ్ను, 4,500 సంవత్సరాల క్రితం నుంచే వైద్య సహాయం కోసం ఉపయోగించినట్లుగా చాలా బలమైన సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి.

ఆయుర్వేద ప్రకారం, వేపాకులు వాతానికి సంబంధించిన రుగ్మతలకు చికిత్స అందించుటలో బాగా ఉపయోగపడటమే కాకుండా, రక్తాన్ని శుభ్రపరుస్తుంది, విషాన్ని తొలగిస్తుంది, కీటకాలు కుట్టడం వల్ల ఏర్పడిన గాయాలను - చీమును కలిగి ఉన్న పుండ్ల వంటి పరిస్థితులను పూర్తిగా నయం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో విహరించే స్వేచ్ఛా రాడికల్స్ను నిరోధిస్తుంది, అలాగే కాలిన గాయాలను, దెబ్బలను, అంటువ్యాధులనే కాకుండా ఇతర చర్మ సమస్యలపై బాగా పనిచేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ను కలుగుజేసే బ్యాక్టీరియాను చంపుతుంది & మీలో రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.

10 Ways To Use Neem In Daily Life For Overall Wellness

ఇలా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను వేప ద్వారా పొందవచ్చు, మీ రోజువారి జీవితంలో వేపను ఉపయోగించడం వల్ల మీ పూర్తి ఆరోగ్యాన్ని సంరక్షించే 10 రకాల ప్రయోజనాలను చేకూర్చగలదు. అవి

1. రోగనిరోధకతను పెంపొందించే దివ్యౌషధం :

1. రోగనిరోధకతను పెంపొందించే దివ్యౌషధం :

వేప, మీలో ఉన్న రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. వేపాకులను టీ తయారీలో ఉపయోగించినప్పుడు వాటిలో ఉన్న యాంటీ-బ్యాక్టీరియల్ & యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచటానికి దోహదపడతాయి. అందుకోసం మీరు కొన్ని వేపాకులను మెత్తగా నూరి, దానిని ఒక గ్లాసు వేడినీళ్లలో కలిపి తాగాలి. ఇది మీ ఆరోగ్యాన్ని సాధారణంగా కాపాడే ఒక సులభమైన మార్గం.

2. డిటాక్సిఫైర్ :

2. డిటాక్సిఫైర్ :

వేపలో డిటాక్సిఫైర్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల శరీరంలో ఉన్న విష వ్యర్ధాలను బహిష్కరించేలా చేయడంలో కాలేయాన్ని & మూత్రపిండాలను ప్రేరేపిస్తాయి, అంతేకాకుండా ఇది మీ శరీర జీవక్రియను గరిష్టస్థాయికి పెంచుతుంది. వేపాకులను పొడిగా మార్చి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని & తేనెను కలిపి సేవించండి. ఈ రకమైన మిశ్రమాన్ని సప్లిమెంట్ రూపంలో కూడా మీరు తీసుకోవచ్చు. ఇది మీ శరీరంలో ఉన్న విష వ్యర్థాలను బయటకు తొలగించడానికి సహాయపడుతుంది.

3. రక్తంలో చక్కెర స్థాయిలను సరిగ్గా నిర్వహించడానికి :

3. రక్తంలో చక్కెర స్థాయిలను సరిగ్గా నిర్వహించడానికి :

రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరపరచడంలో వేప చాలా ప్రభావంతంగా పనిచేస్తుందని మీకు తెలుసా ! వేపలో గల రసాయనిక సమ్మేళనాలు ఇన్సులిన్ రిసెప్టార్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, శరీరంలో ఇన్సులిన్ సరైన మోతాదులో విడుదలవ్వడానికి సహాయకారిగా పనిచేస్తుంది. అందువల్ల, వేపను ఉపయోగించి కూడా డయాబెటిస్తో బాధపడేవారు ఇన్సులిన్ మీద తక్కువ ఆధారపడేలా చేయవచ్చు. అయితే, తీసుకోవాల్సిన మోతాదు మరియు ఇతర అంశాల గురించి మీ డాక్టర్తో ఒకసారి చర్చించండి.

4. జీర్ణకోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది :

4. జీర్ణకోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది :

జీర్ణాశయ ప్రేగులలో ఏర్పడిన వాపులను & అల్సర్లను, కడుపు ఉబ్బరాన్ని, తిమ్మిర్లను & మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, అంతేకాకుండా స్టమక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా నిరోధించడంలో వేప బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ జీర్ణశక్తిని పెంపొందించడంతోపాటు, శరీరం లోపల ఉన్న వ్యర్ధాలను బహిష్కరించడంలో కూడా మెరుగైన పనితీరును కలిగి ఉంటుంది. మీరు రోజులో కొన్ని తాజా వేపాకులను నమలడం వల్ల మీకు మరింతగా ఉపయోగపడగలదు.

5. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది :

5. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది :

వేపలో ఉన్న యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ చికిత్సకు బాగా పనిచేస్తాయి. వేపతో తయారు చేసిన నూనెలో (లేదా) పేస్టును, నొప్పులకు గురైన కీళ్లు & కండరాల ప్రాంతాలలో వర్తించడం వల్ల మీకు ఏర్పడిన అసౌకర్యాన్ని పూర్తిగా తగ్గిస్తుంది.

6. నోటి ఆరోగ్యాన్ని పూర్తిగా సంరక్షిస్తుంది :

6. నోటి ఆరోగ్యాన్ని పూర్తిగా సంరక్షిస్తుంది :

నోటి ఆరోగ్యాన్ని సంరక్షించే ఉత్పత్తులలో వేప అనేది ఒక సాధారణమైన పదార్థంగా ఉపయోగించబడుతుంది. చిగుళ్ల వ్యాధులు & నోటి దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాలను తొలగించడంలో - వేపలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వేప నీరును మౌత్వాష్ ఉపయోగించడం చాలా మంచిది. అలాగే వేప కొమ్మలను కూడా టూత్బ్రష్గా కూడా ఉపయోగించవచ్చు.

7. కంటి & చెవులలో ఏర్పడిన చిన్న ఇబ్బందులను దూరం చేస్తుంది :

7. కంటి & చెవులలో ఏర్పడిన చిన్న ఇబ్బందులను దూరం చేస్తుంది :

వేపాకులను బాగా మరగకాచిన తర్వాత, ఆ వేప నీళ్ళను పూర్తిగా చల్లబరచాలి. మీ కళ్ళను కడగడానికి ఈ నీటిని ఉపయోగించినట్లయితే కంటి ఇరిటేషన్, రెడ్-నెస్, అలసట నుంచి మీకు సత్వరంగా ఉపశమనమును కలగజేస్తుంది.

8. మీ చర్మ సౌందర్యానికి స్నేహపూర్వకంగా పనిచేస్తుంది :

8. మీ చర్మ సౌందర్యానికి స్నేహపూర్వకంగా పనిచేస్తుంది :

ఒక కప్పు వేపాకులను తీసుకొని, నీటిలో వేసి బాగా మరిగించాలి. అలా మరగ కాచిన నీటిని చల్లారాక ఒక బాటిల్లో వేసి నిల్వ చేసుకోవాలి. మొటిమలు, చర్మవ్యాధులు, శరీర దుర్వాసన వంటి మొదలైన వాటిని నివారించడానికి, పైన వేపతో తయారు చేసిన మిశ్రమాన్ని కొద్దిగా మీ స్నానపు నీటిలో కలపండి. మొటిమలను పూర్తిగా నివారించడానికి వేపాకులను బాగా ముద్దగా నూరి, పేస్ట్గా తయారు చేసుకొని, మీ ముఖానికి ఫేస్ ప్యాక్లా అప్లై చేయండి. వేప నీరు స్కిన్ టోనర్గా కూడా ఉపయోగపడుతుంది. చర్మంపై కాలిన గాయాలను మాన్పించడానికి వేపాకులను ఉపయోగించటం వల్ల త్వరగా ఉపశమనం కలిగించడమే కాకుండా, ప్రభావిత ప్రాంతాల్లో అలర్జీలు, ఇన్ఫెక్షన్లు ఏర్పడకుండా రక్షిస్తుంది.

9. అన్నిరకాల జుట్టు సమస్యలను పూర్తిగా తొలగిస్తుంది :

9. అన్నిరకాల జుట్టు సమస్యలను పూర్తిగా తొలగిస్తుంది :

వేపాకులను బాగా మరగకాచిన తరువాత, ఆ నీటిని చల్లార్చి మీ జుట్టును శుభ్రం చేయడానికి ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల వేపలో ఉన్నా యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పేనుకొరుకుడు, చుండ్రు, హెయిర్ ఫాల్, డ్రై స్కాల్ఫ్, రింగు రింగులుగా ఉన్న జుట్టును చికిత్స చేయడంలో బాగా సహాయపడుతుంది. ఇది మీ జుట్టును మృదువుగా, నునుపుగా చేస్తుంది.

 10. గొప్ప క్రిమిసంహారిణి :

10. గొప్ప క్రిమిసంహారిణి :

మీ ఇంట్లో ఉన్న అన్ని రకాల కీటకాలను దూరంగా నెట్టి వేయడంలో వేప చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వేపలో నానబెట్టిన కాటన్ బట్టను మీ కిటికీకి దగ్గరలో ఉంచండి (లేదా) వేపాకులను కాల్చటం వల్ల కూడా కీటకాలను దూరం చేయవచ్చు. దోమలను దూరంగా ఉంచడానికి ఇదే ఉత్తమమైన మార్గము !

English summary

10 Ways To Use Neem In Daily Life For Overall Wellness

Neem is a powerful healing herb that can be used in our daily life for maintaining overall health. It is beneficial in boosting immunity, detoxifying the body, treating arthritis, keeping sugar levels stable and so on. It is a skin-friendly and hair-friendly herb too.10 Ways To Use Neem In Daily Life For Overall Wellness
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more