డీహైడ్రేషన్కు సంబంధించిన ఈ 10 సంకేతాలను తెలుసుకొని మిమల్ని మీరు కాపాడుకోండి !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మానవ శరీరం 70% నీటితోనే తయారు కాబడుతుంది. మీరు ఎలాంటి ఆహారం తీసుకోకుండా 3 వారాలు జీవించగలరు కానీ, నీళ్లు తాగకుండా 7 రోజులు మాత్రమే (లేదా మీరు ఎడారిలో ఒంటరిగా ఉన్నట్లయితే) జీవించగలరు !

కనీసం 2 - 4 లీటర్లు నీటిని ప్రతిరోజు త్రాగటం వల్ల మీరు డీహైడ్రేషన్కు గురవ్వకుండా ఉండగలరు. నీరు అనేది సకల ప్రాణికోటికి అంత ముఖ్యమైనది !

దురదృష్టవశాత్తు, మనలో కొంతమంది రోజువారీకి సరిపడేంత నీటిని త్రాగరు, అందుకు వారి బద్ధకం కారణమవ్వచ్చు (లేదా) వారికి నీటి కొరత సమస్య ఉండవచ్చు. అలాంటి సమస్యలను ఎదుర్కొన్న వారిలో మీరూ కూడా ఉన్నట్లయితే, మీరు డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండేందుకు ఇక్కడ 10 సంకేతాలను సూచించాము. అవేమిటో మీరు కూడా తెలుసుకోండి.

1. మీ దాహాన్ని వెంటనే తీర్చుకోండి :

1. మీ దాహాన్ని వెంటనే తీర్చుకోండి :

మీ మెదడు మీరు దాహాన్ని కలిగి ఉన్నట్లుగా సూచించిన వెంటనే కొంత నీరుని త్రాగాలి. మీరు డీహైడ్రేషన్కు గురవుతారని సూచించే మొట్ట మొదటి సంకేతం "దాహం" కలిగినట్లుగా భావించడం. మీరు ఈ సూచనను తప్పక పాటించాలి.

2. మీ నోరు పొడిబారడం :

2. మీ నోరు పొడిబారడం :

మీ నోటి లోపలి భాగం ఎడారి వలె పొడిగా మారినప్పుడు, మీ బుగ్గల చుట్టూ ఇసుక అట్ట కట్టినట్లుగా ఉన్న భావనను మీ నాలుక కలిగి ఉంటుంది, అంటే మీరు తీవ్రమైన డీహైడ్రేషన్ను ఎదుర్కోబోతున్నరని దాని అర్థం.

3. నిద్రను వేగవంతం చేస్తుంది :

3. నిద్రను వేగవంతం చేస్తుంది :

డీహైడ్రేషన్ మీ మెదడును కష్టతరమైనదిగా ప్రభావితం చేస్తుంది. ఇది తీవ్రమైన అలసటను ప్రేరేపించి నిద్రపోవాలనే కోరికను ఎక్కువగా పెంచుతుంది.

అలా మీకు జరిగినప్పుడు, మీరు నిద్రించకండి! దానికి బదులుగా వెంటనే కొంచెం నీరుని తాగి, తిరిగి మీ శరీరాన్ని హైడ్రేట్ చెయ్యండి.

4. భ్రాంతి :

4. భ్రాంతి :

డెలిరీయం అనేది ప్రస్తుత కాలంలో విజృంభిస్తున్న డిహైడ్రేషన్ వ్యాధికి సంబంధించిన లక్షణం, ఇక్కడ మీరు పగటి పూట కూడా భ్రాంతి చెందుతారు. వాస్తవానికి, మీ స్నేహితులు వచ్చి మీరెందుకు అస్పష్టంగా మాట్లాడుతున్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తే - అప్పటివరకు మీరు మాట్లాడిన విషయాలేవీ మీకు గుర్తుండకపోవచ్చు అలాంటి సందర్భంలో మీరు వెంటనే ఒక గ్లాసు నీటిని తాగాలి.

5. తలనొప్పి :

5. తలనొప్పి :

భరించరాని తలనొప్పి రావడం అనేది కూడా డీహైడ్రేషన్ను తెలియజేసే మరొక సాధారణ సంకేతం. కానీ ఇది విషపూరితం కాబడిన నీటికు సంకేతంగా ఉండటం వలన, కొన్ని గంటల వ్యవధిలో మీరు ఎంత నీటిని తాగుతున్నారో అన్నదానిపై జాగ్రత్త వహించాలి.

6. కండరాల తిమ్మిరి :

6. కండరాల తిమ్మిరి :

కండర తిమ్మిర్లు అనేది మీ శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలు అసమతుల్యతకు దారితీసినందున సాధారణంగా ఏర్పడుతుంది. ఇది కూడా డీహైడ్రేషన్ను సూచించే మరొక గుర్తు.

మీరు తీవ్రమైన వ్యాయమాలను ఆచరించిన తర్వాత పొందే తిమ్మిర్లలో కంగారుపడకండి. ఆ రోజు వ్యాయమంలో భాగంగా, మీరు లక్ష్యంగా చేసుకున్న కండరాల సమూహాలను మాత్రమే ప్రభావితం చేస్తాయి.

7. మీకు చెమట పట్టకపోతే :

7. మీకు చెమట పట్టకపోతే :

మీరు కొంత శారీరక శ్రమను చేసిన తర్వాత మీకు మధ్యలో హఠాత్తుగా చెమట పట్టడం నిలిచిపోతే, మీరు వెనువెంటనే మీ శరీరాన్ని తప్పక హైడ్రేట్ చేయాలి, ఎందుకంటే ఇది డీహైడ్రేషన్ను తెలియచేసే తీవ్రమైన సంకేతం.

8. ముదురు పసుపు రంగులో మూత్రము :

8. ముదురు పసుపు రంగులో మూత్రము :

మీరు ముదురు పసుపు రంగులో ఉన్న మూత్రమును పోస్తున్నప్పుడు మీకు చాలా మంటగా గానీ అనిపిస్తే, మీరు నీటిని (H2O) చాలా త్వరగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది తీవ్రమైన డీహైడ్రేషన్కు సంకేతం.

నిజానికి, మీరు తీవ్రంగా డీహైడ్రేషన్కు గురైనప్పుడు, మూత్రవిసర్జన అనేది హఠాత్తుగా ఒకరోజులో కొద్ది మొత్తంలో ఉండవచ్చు (లేదా) పూర్తిగా హరించుకు (లేకుండా) పోవచ్చు .

9. చర్మం పొడిబారడం :

9. చర్మం పొడిబారడం :

మీ చర్మం దాని సహజ స్వభావాన్ని కోల్పోయినప్పుడు అనగా ప్రకాశిస్తున్న ఛాయ నుంచి ముడతలు, పగుళ్లు వంటి దశకు చేరినట్లైతే, మీరు ఖచ్చితంగా డీహైడ్రేషన్ సమస్యను కలిగి ఉన్నారని అర్ధం.

10. అస్పష్టమైన కంటిచూపు :

10. అస్పష్టమైన కంటిచూపు :

మీ కళ్ళు హఠాత్తుగా ముఖ్యమైన విషయాలపై దృష్టిని కేంద్రీకరించలేకపోతే, అది చాలా దూరమైన (లేదా) దగ్గరైనా సరే, మీరు అస్పష్టమైన కంటిచూపును కలిగి ఉండటమనేది కూడా, డీహైడ్రేషన్ సూచించే ఒక సంకేతం.

గమనిక : అస్పష్టమైన కంటిచూపు అనేది రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలను కలిగి ఉన్న చిహ్నంగా కూడా ఉంటుంది. మీరు నిర్ణీత సమయానికి భోజనమును దాటవేయబడినట్లైతే, (లేదా) మీరు జలుబు వంటి అనుభూతిని కలిగి ఉంటే, వెంటనే గ్లూకోజ్ నీరును తాగండి.

English summary

Knowing These 10 Signs of Dehydration Can Save Your Life!

70% of the human body is made up of water. That's why dehydration is worse for your body compared to starvation. This article discusses the signs of dehydration that tell you you need to stock up on H2O ASAP!That's why it's very important to keep yourself hydrated throughout the day by drinking at least 2 - 4 L of water.
Story first published: Tuesday, March 20, 2018, 12:00 [IST]