For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జామకాయ జ్యూస్ ప్రయోజనాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి..! ఎందుకంటే

జామకాయ జ్యూస్ ప్రయోజనాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి..! ఎందుకంటే

|

జామకాయ అంటే పిల్లల నుండి పెద్దల వరకూ ప్రతి ఒక్కరీకి ఇష్టమైన పండు. తీపి, వగరు, పులుపు మూడు రుచుల మేలైన కలయిక జామకాయ. పేదల పాలిటి ప్రియ నేస్తం జామకాయ. మార్కెట్లో ఉండే పండ్లలో అన్నింటికంటే చౌకైనది. అందుకే ఇది బాగా పాపులర్ అయ్యింది. గ్రీన్ కలర్లో నోరూరించే జామకాయ అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. కేవలం రుచి మాత్రమే కాదు, అత్యద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే . జామకాయ, జామపండులోనూ పోషక విలువలు మెండుగా ఉంటాయి. పచ్చిదే తింటారు చాలామంది.

జామకాయ, జామపండు రెండింటిలోనూ మినిరల్స్, విటమిన్స్, ఇతర పోషకాంశాలు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ, సి లు ఉండటం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చును. ఈ పండులోని యాంటీ ఆక్సిడెట్స్, ఒమేగా -3, 6, ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతాయి. వాస్తవంగా చెప్పాలంటే వీటిలో ఉండే న్యూట్రీషియన్ గుణాలు ఇతర ఫ్రూట్స్ లో కంటే వీటిలో ఎక్కువ. జామ కాయలోలాగే, జామకాయతో చేసే జ్యూస్ లో కూడా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జామ కాయ జ్యూస్ తాగడం వల్ల రిఫ్రెషింగ్ గా ఫీలవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కావల్సిన అన్ని రకాల న్యూట్రీషియన్స్, మినిరల్స్ ను అందిస్తుంది. జామకాయ జ్యూస్ తాగడం వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం.

జామకాయ జ్యూస్ ఎలా తయారుచేయాలి :

జామకాయ జ్యూస్ ఎలా తయారుచేయాలి :

కావల్సినవి:

ఫ్రెష్ గా ఉన్న జామకాయ ముక్కలు : 1కప్పు

పంచదార: 1 టీస్పూన్

కోల్డ్ వాటర్ : 1/2కప్పు (సుమారు 120మిల్లీ)

ఐస్ క్యూబ్

పుదీనా ఆకులు: 2 లేదా 3

తయారీ

తయారీ

1. ముందుగా జామకాయ తీసుకుని నీటితో శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి కప్పులో తీసుకోవాలి.

2. తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి, పంచదార , కోల్డ్ వాటర్ ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోవాలి.

3. ఇప్పుడు ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి. పూర్తి విత్తనాలన్నింటిని తొలగించాలి.

4. ఈ జ్యూస్ కు ఐస్ క్యూబ్ మరియు పుదీనా ఆకులును జోడించి ఫ్రెష్ గా తాగితే ఆ మజాయే వేరు.

జామకాయలో ఉండే విటమిన్ సి

జామకాయలో ఉండే విటమిన్ సి

జామకాయలో ఉండే విటమిన్ సి అధిక రక్తపోటు ఉన్న వారికి సహాయపడుతుంది. దీర్ఘకాలం నుండి బాధపడుతున్న వారికి రక్తపోటును తగ్గించే యాంటీఆక్సిడెంట్ సహాయంతో గుండె సంబంధిత జబ్బులను అరికడుతుంది. ఒక గ్లాసు జామకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి కావల్సిన సోడియం, పొటాషియంలు అద్భుతంగా అందుతాయి. ఇది బ్లడ్ ప్రెజర్ మరియు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది. శరీరంలో రక్తంలోని హెచ్ డిఎల్(మంచి ) కొలెస్ట్రాల్ ను పెరగడానికి సహాయపడుతుంది. దాంతో హార్ట్ హెల్తీగా ఉంటుంది,.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

జామకాయ జ్యూస్ లో ఉండే ఫైబర్ మరియు మినిరల్స్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి బాడీ వెయిట్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలాగే శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. కోలన్లో ఫ్యాట్ కరిగిస్తుంది.

శరీరం యొక్క చర్మంను ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉండేలా చేస్తుంది:

శరీరం యొక్క చర్మంను ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉండేలా చేస్తుంది:

జామకాయ జ్యూస్ రెగ్యులర్ గా తాగడం వల్ల స్కిన్ కంప్లెక్షన్ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్, మరియు ఆస్ట్రిజెంట్ గుణాలు చర్మం కాంతివంతంగా ప్రకాశవంతంగా మార్చుతుంది. చర్మంలో ఎలాంటి మచ్చలైనా, మార్క్సైనా నివారిస్తుంది.జామకాయ జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు మినిరల్స్ చర్మ రంద్రాలను టైట్ గా మార్చి, కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

అతిసార మరియు విరేచనాలను తగ్గిస్తుంది

అతిసార మరియు విరేచనాలను తగ్గిస్తుంది

వాంతులు లేదా విరేచనాలు ఎక్కువైనప్పుడు లేదా జీర్ణసమస్యలున్నప్పడు జామకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మరియు యాంటీ మైక్రోబయల్ గుణాలు అతిసార, విరేచనాలు, వాంతులను తగ్గిస్తుంది. విటమిన్ సి జీర్ణ సమస్యను త్వరగా తగ్గిస్తుంది.

జామకాయ తినడం వల్ల కంటి సమస్యలను దూరం చేస్తుంది

జామకాయ తినడం వల్ల కంటి సమస్యలను దూరం చేస్తుంది

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో జామ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. వయస్సు రిత్యా వచ్చే కళ్ళ సంబంధిత సమస్యలు, వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జామ జ్యూస్ లో ఉండే విటమిన్ ఎ అందకు గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

Awesome Benefits of Guava Fruit Juice You Should Know!

A unique flavor, a fruity and tangy smell and beautiful color; these are some of the things that can attract anyone towards Guava. However, did you know it is also a powerhouse of nutrients and can provide your body with all the essential nutrient requirements when had on a regular basis?
Desktop Bottom Promotion