For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శీతాకాలంలో బెల్లం మరియు వేరుశెనగ లేదా చిక్కీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

శీతాకాలంలో బెల్లం మరియు వేరుశెనగ లేదా చిక్కీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

|

శీతాకాలంలో పచ్చి వేరుశెనగ కాయల సీజన్,ఈ సీజన్ లో చాలా మంది వేరుశెనగను ఎక్కువగా తింటారు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ వేరుశెనగతో బెల్లం కూడా కలిపి తినడం వల్ల మరిన్ని రెట్టింపు ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? శీతాకాలంలో, ప్రజలు తరచూ వేరుశెనగలు తింటుంటారు మరియు వేరుశెనగతో పాటు బెల్లం కలిపి తినడం వల్ల, ఇది శరీరానికి వెచ్చదనాన్ని అందించడమే కాక, అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది మరియు వేరుశెనగ మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు దంతాలు బలంగా ఉంటాయి.

Benefits of eating jaggery and peanuts in winter season

శీతాకాలంలో వేరుశెనగ మరియు బెల్లం మిశ్రమం తినడం ఆరోగ్యానికి మంచిది. రెండింటిలో విపరీతమైన వైద్య లక్షణాల మిశ్రమం దాగి ఉన్నాయి. సహజంగా, మీరు వేరుశెనగ మాత్రమే తింటుంటారు. కానీ బెల్లం కలిపిన వేరుశెనగలను తింటే, దానిలో ఆరోగ్య ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. వేరుశెనగతో పాటు బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒక పరిశోధనలో వెల్లడయ్యాయి. శీతాకాలంలో వేరుశెనగ మరియు బెల్లం తయారు చేసిన చిక్కి తినడం కూడా ఆరోగ్యానికి మంచిది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. వేరుశెనగ మరియు బెల్లం మిశ్రంతో తయారుచేసిన చిక్కీ కూడా తినవచ్చు. వీటిని తినడం వల్ల శరీరానికి ఎంత మేలు చేస్తాయో చూద్దాం..

మహిళలు బెల్లం మరియు వేరుశెనగను ఎప్పుడు తినవచ్చు?

మహిళలు బెల్లం మరియు వేరుశెనగను ఎప్పుడు తినవచ్చు?

గర్భధారణ సమయంలో వేరుశెనగ మరియు బెల్లం తినడం రక్త ప్రసరణకు సరిగ్గా మెరుగ్గా ఉంటుంది. ఇది గర్భాశయం పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది పిల్లలు సరైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. పీరియడ్స్‌లో తినడం వల్ల వెన్నునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

పళ్ళు మరియు ఎముకలు బలంగా ఉంటాయి

పళ్ళు మరియు ఎముకలు బలంగా ఉంటాయి

ప్రోటీన్ మరియు కాల్షియం అధికంగా ఉన్న వేరుశెనగ మరియు బెల్లం తినడం వల్ల దంతాలు మరియు ఎముకలను బలపరుస్తుంది.

ఆమ్లత్వం మరియు మలబద్ధకం నుండి ఉపశమనం

ఆమ్లత్వం మరియు మలబద్ధకం నుండి ఉపశమనం

ఫైబర్ అధికంగా ఉండే వేరుశెనగలు ఆమ్లత్వం లేదా మలబద్ధకం నుండి కూడా రక్షిస్తాయి.

బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

బెల్లం మెగ్నీషియంకి మంచి మూలం, బెల్లం తినడం వల్ల కండరాలు, నరాలు మరియు రక్త నాళాల అలసట తొలగిపోతుంది. మొలాసిస్ పొటాషియంలకు మంచి మూలం. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి బెల్లం చాలా మంచిది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మరియు ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది కడుపులోని గ్యాస్ మరియు జీర్ణక్రియకు సంబంధించిన ఇతర సమస్యలను తొలగిస్తుంది. ఆహారం తిన్న తర్వాత చిటికెడు బెల్లం ముక్క తినడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. బెల్లం వాడకం చలికాలంలో లేదా శీతాకాలంలో మీకు అమృతంలా పనిచేస్తుంది. దాని వెచ్చదనం కారణంగా, చల్లని, చలి వాతావరణం నుండి శరీరానికి వెచ్చదనం అందిస్తుంది. ముఖ్యంగా కఫం నుండి మిమ్మల్ని ఉపశమనం చేయడానికి ఇది సహాయపడుతుంది.

వేరుశెనగ ప్రయోజనాలు

వేరుశెనగ ప్రయోజనాలు

వేరుశెనగ గుండెకు చాలా మంచిది, ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. వేరుశెనగ పెద్దప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ల అవకాశాలను తగ్గిస్తుంది. శరీరానికి అవసరమైన ఇనుము, జింక్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, సెలీనియం, మాంగనీస్, రాగి వంటి అనేక ఖనిజ మూలకాలకు వేరుశెనగ ఒక అద్భుతమైన మూలం.

బెల్లం కాల్షియంకు మంచి మూలం

బెల్లం కాల్షియంకు మంచి మూలం

బెల్లం కాల్షియంకు మంచి మూలం. దీన్ని తినడం ద్వారా మీ శరీరం రక్తహీనతతో బాధపడుతున్నవారికి అద్భుతమ మార్పు కనిపిస్తుంది. రోజూ తినడం వల్ల మీ శరీర నరాల అలసట తొలగిపోతుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో మొలాసిస్ కూడా ప్రభావవంతంగా ఉంటుంది. శీతాకాలంలో బెల్లం తినడం మీకు అమృతం లాంటిదని అంటారు.

గమనిక :

గమనిక :

మీకు శీతాకాలంలో బెల్లం మరియు వేరుశెనగ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో అవగాహన పెంచడానికి ఈ హోం రెమెడీని మీతో పంచుకోవడం జరిగింది. అయితే, మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లైతే , దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి. ఆ తర్వాత వీటిని నిరభ్యరంతరంగా తినండి.

English summary

Benefits of eating jaggery and peanuts in winter season

India is a tropical country and is blessed with a pronounced change in seasons. Ancient India celebrated all seasons with names given to each season, festivals allocated to each change of season and designated foods assigned to each of them. That came with a deep understanding that changes in diet also need to be altered by changing environments.
Desktop Bottom Promotion